అజ్మేరి హక్ బధోన్ బంగ్లాదేశ్ కి చెందిన నటి, ఈమె బధోన్ అనే పేరుతో పాపులర్ అయ్యారు.
Table of Contents
బాల్యం:
బధోన్ 28 అక్టోబర్ లో 1983 వ సంవత్సరంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా లో జన్మించారు. బధోన్ యొక్క తండ్రి బంగ్లాదేశ్ వాటర్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారి.
తన తండ్రి యొక్క ప్రభుత్వ ఉద్యోగం కారణంగా తరచూ స్కూల్ లను మారాల్సి వచ్చేది.
2002 లో బధోన్ బంగ్లాదేశ్ వైద్య కళాశాలలో అడ్మిషన్ లభించింది.
2009 వ సంవత్సరంలో బధోన్ ఢాకా నుంచి Bachelor of Dental Surgery (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) నుంచి తన డిగ్రీను సంపాదించారు. ఈమె BMDC రిజిస్టర్డ్ డాక్టర్.
ఈమె మీడియా అంటే చాలా ఆసక్తి చూపించేవారు, అందుకే చిన్న వయస్సులోనే అందాల పోటీలో పాల్గొన్నారు.
కెరీర్:
2010 వ సంవత్సరంలో నిజుమ్ ఒరోన్నీ అనే సినిమాలో నటించి సినిమా కెరీర్లో డెబ్యూ చేసారు.
2021 వ సంవత్సరంలో రెహనా మరియమ్ నూర్ అనే ఒక బంగ్లాదేశీ సినిమాలో నటించారు.
2023 వ సంవత్సరంలో ఖుఫియా అనే స్పై థ్రిల్లర్ సినిమాలో RAW ఏజెంట్ గా పనిచేసారు.
బధోన్ పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. 2021 లో రొబీంద్రోనాథ్ ఏఖానే కౌఖోనో ఖేతే ఆశేన్ని అనే వెబ్ సిరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించారు.
2022 వ సంవత్సరంలో గుటి అనే వెబ్ సిరీస్ లో నటించారు.
సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు మేఘే ధాకా షోహోర్, చోయిటా పగ్లా, షువో బిబాహో, రాంగ్ మరియు భలోబాషా కరే కోయ్ అనే TV షోలలో మరియు సీరియల్ లలో కూడా పనిచేసారు.
అవార్డులు:
సంవత్సరం | అవార్డులు | కేటగిరీ |
2021 | హోయిచోయ్ అవార్డులు | Outstanding Female Debut |
2021 | ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులు | Best Performance (Actress) |
2021 | బంగ్లాదేశ్ 45వ జాతీయ చలనచిత్ర అవార్డులు | Best Actress |
2022 | 37వ సినిమా జోవ్ వాలెన్సియా (స్పెయిన్) | Best Actress |
వ్యక్తిగత జీవితం:
బధోన్ 2010 లో మష్రూర్ సిద్ధిఖీ సొనెట్ అనే వ్యక్తిని పేలి చేసుకున్నారు. ఈ ఇద్దరి దంపతులకు 6 అక్టోబర్ 2010 న మిషైల్ అమాని సయేరా (Mishael Amani Sayera) అనే పాప పుట్టింది. 4 సంవత్సరాల తరవాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.
2018 వ సంవత్సరంలో ఢాకా సెషన్ కోర్ట్ అసిస్టెంట్ జడ్జి ఇచ్చిన తీర్పు ద్వారా బధోన్ తన ఏకైక సంతానం మిషేల్ అమానీ సయేరా యొక్క గార్డియన్ షిప్ ను పొందారు.
Source: Azmeri Haque Badhon – Wikipedia