Whatsapp success story – వాట్సాప్ సక్సెస్ స్టోరీ

కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ పంపాలంటే ఒక SMS ప్యాక్ రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ మెసేజ్ ప్యాక్ కూడా పరిమిత సంఖ్యలో మెసేజ్ లు చేసుకునే వసతి ఇచ్చేది. కానీ కాలం మారింది ఇప్పుడు ఒక ఇంటర్నెట్ ప్యాక్ రీఛార్జి చేసుకుంటే చాలు మెసేజ్ లు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్ని చేసుకోవచ్చు.ఇవన్నీ ఒక సింగల్ ఆప్ లో వస్తున్నాయి అంటే అది కేవలం వాట్సాప్ వల్ల అని చెప్పవచ్చు. 

ఇంత గా ఫేమస్ చెందిన వాట్సాప్ అసలు ఎలా కనుగొన బడింది? ఎవరు కనుగొన్నారు ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాము..    

పేస్ బుక్ ఇంటర్వ్యూ లో రిజెక్ట్ అయిన తరవాత వాట్సాప్ కనుగొనడం :

పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ రాక ముందు సోషల్ మీడియా వెబ్ సైట్  లేదా మెసెంజర్ గా పిలవబడే వెబ్ సైట్ యాహూ (Yahoo). ఈ యాహూ కంపెనీ లో పనిచేసిన ఉద్యోగులు బ్రియాన్ ఆక్టన్ మరియు జాన్ కౌమ్ అనే ఇద్దరు 2007 వ సంవత్సరంలో యాహూ సంస్థను వదిలేసారు. కొద్దీ రోజులు తమ సెలవులను సౌత్ అమెరికా లో గడిపిన తరవాత పేస్ బుక్ లో ఉద్యోగం కోసం అప్లై చేశారు కానీ వారు అక్కడ రిజెక్ట్ అయ్యారు. వారి అదృష్టం కావొచ్చు వారు ఆలా రిజెక్ట్ అవ్వటం వల్లనే ఈ రోజు మనకు వాట్సాప్ అనే సర్వీస్ ను తయారు చేయ గలిగారు. 

ఆప్ స్టోర్ వల్ల వచ్చిన ఆలోచన : 

2009 వ సంవత్సరం జనవరి లో కౌమ్ మరియు ఆక్టన్ ఐఫోన్ కొనుగోలు చేసిన తరవాత ఆప్ స్టోర్ బాగా ట్రేండింగ్ లో ఉందని గుర్తించిన వీరు ఇద్దరు ఒక మెసేజ్ ఆప్ ని తయారు చేయాలనీ నిర్ధారించుకున్నారు. RentACoder.com (ఇప్పుడు ఇది freelancer.com గా మారింది) అనే వెబ్ సైట్ నుంచి ప్రోగ్రామింగ్ కోడ్ రాసే రష్యా కు చెందిన ఒక ఫ్రీ లాన్సర్ ను ఎంచుకున్నారు.                  

వాట్స్ ఆప్ పేరు: 

ఒక messaging ఆప్ తయారు చేయాలి అనుకున్న వీరు ఇద్దరు ఆప్ కి ఏ పేరు పెడితే త్వరగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అని ఆలోచన వచ్చింది. కౌమ్ దీనికి జవాబు గా ” whats up” అనే యాస పదాన్ని ఆధారంగా చేసుకొని తాము తయారు చేసే ఆప్ కి “whatsapp” అనే పేరు ఫిబ్రవరి 2009 వ సంవత్సరంలో పెట్టడం జరిగింది. 

ముందు తయారు చేసిన వాట్సాప్ వెర్షన్ చాలా సార్లు క్రాష్ అవ్వటం వల్ల కౌమ్ వాట్సాప్ అనే ఆప్ తయారు చేయాలనే ఆలోచన ఇక మానుకోవాలని అనుకున్నాడు.  తనతో పాటు ఈ ఆలోచనలో తనకు తోడు గా ఉన్న ఆక్టన్ ఇంత త్వరగా తాను ఓటమిని ఒప్పుకోవద్దు అని ప్రయత్నం చేయమని కౌమ్ ని ప్రోత్సహించాడు.   

Never give up :

ఇక వాట్సాప్ తయారు చేసే ఆలోచన మానుకుందాం అనే లోపు ఆపిల్ కంపెనీ చేసిన చిన్న ప్రకటన వల్ల ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆపిల్ కంపెనీ తమ యూజర్లు ఏదైనా ఆప్ ఉపయోగించనప్పుడు యూజర్ కి ఒక నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. ఇదే ఆలోచనను వాట్సాప్ లో కూడా స్టేటస్ మార్చినప్పుడు ఇతర వాట్సాప్ యూజర్లకు నోటిఫికేషన్ పంపాలని నిర్ణయించుకున్నారు.    

వాట్సాప్ 2.0 వెర్షన్ లో  మెసేజ్ సర్వీస్ ను అందచేయటం మొదలుపెట్టారు.  ఆక్టన్ తాను ముందుగా పనిచేసిన యాహూ కంపెనీ లో ని స్నేహితులను కలిసి తమ స్టార్ట్ ఆప్ అయిన వాట్సాప్ లో ఇన్వెస్ట్ చేయమని కోరగా $250,000 వేల డాలర్లతో సహాయం చేసారు.   

చాలా ప్రయత్నాల తరువాత నవంబర్ 2009 లో ఐఫోన్ ఆప్ స్టోర్ లో లాంచ్ చేసారు. రెండు నెలల తరవాత బ్లాక్ బెర్రీ వెర్షన్ కూడా విడుదల చేసారు. వాట్సాప్ ప్రారంభించిన సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని  కొని వాడేవారు కానీ తరవాత అందరికి ఫ్రీ గా ఇవ్వటం మొదలు పెట్టారు. 2011 వ సంవత్సరం నాటికి వాట్సాప్ ఆపిల్ U.S. ఆప్ స్టోర్ లోని మొదటి 20 ఆప్ ల జాబితా లో చేరింది. 

ఒక్కో సంవత్సరం గడిచే కొద్దీ వాట్సాప్ క్రేజ్ జనాలలో ఎక్కువగా అవ్వటం మొదలైంది. ఈ ఆప్ పై ఇక ఎందుకు సమయం వ్యర్థం చేయాలి అని మొదట్లో అనుకున్నారు కానీ ఇపుడు అదే ఆప్ 2013 వ సంవత్సరంలో 1.5 బిలియన్ డాలర్ల విలువకు చేరింది.

Facebook కొనుగోలు :

2014 వ సంవత్సరంలో ఫేస్ బుక్ వాట్సాప్ ను 19 బిలియన్ డాలర్ల ఖరీదు తో కొనుగోలు చేసింది. ఇది అప్పట్లో జరిగిన acquisition లో అతిపెద్దది. 2015 వ సంవత్సరంలో కంప్యూటర్ ద్వారా కూడా వాట్సాప్ ను వినియోగించే వసతి కలిగించింది.

వాట్సాప్ ను చైనా, ఇరాన్, టర్కీ, బ్రెజిల్, శ్రీలంక, ఉగాండ లాంటి  దేశాలు కొన్ని కారణాల వల్ల బ్యాన్ కూడా చేసాయి.        

Leave a Comment