Twitter Success story in Telugu – ట్విట్టర్ సక్సెస్ స్టోరీ

ట్విట్టర్ అంటే ఏమిటి ?

ట్విట్టర్ ఒక సోషల్ మీడియా వెబ్ సైట్ మరియు మైక్రో బ్లాగింగ్ సర్వీస్. ట్విట్టర్ లో ప్రొఫైల్ తయారు చేసుకున్న వాళ్ళు మాట్లాడుకోవడానికి ఉపయోగించే మెసేజ్ లను ట్వీట్స్ అని అంటారు. ట్విట్టర్ మొదలుపెట్టినప్పుడు 140 అక్షరాలకు పరిమితం అయి ఉండేది కానీ తరవాత Non ఆసియన్ భాషల కోసం 280 అక్షరాలను చేయడం జరిగింది. ట్విట్టర్ ను మార్చ్ 21 2006 వ సంవత్సరంలో కనుగున్నారు. 

twttr నుంచి twitter గా మారటం :

2004 వ సంవత్సరంలో Odeo అనే ట్విట్టర్ పేరెంట్ కంపెనీ ను Evan Williams, Noah Glass కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కంపెనీ పోడ్ కాస్టింగ్ సర్వీస్ సేవలను అందించేది.

2006 వ సంవత్సరంలో Jack Dorsey, Noah Glass, Evan Williams మరియు  Biz Stone అనే నలుగురు యువకులు కలిసి టెక్స్ట్ మెసేజ్ ఆధారిత ఒక సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ను తయారు చేయాలనీ నిర్ణయించుకున్నారు. 

ఈ వెబ్ సైట్ పేరు” twttr ” అని పేరు పెట్టారు. ఇదే సంవత్సరంలో Jack Dorsey మొట్ట మొదటి ట్వీట్ “just setting up my twttr” అని ట్వీట్ చేసారు. twttr కనుగొన్న 6 నెలలకు వెబ్ సైట్ పేరు twitter గా మార్చారు. ట్విట్టర్ పదం యొక్క అర్థం కూడా చిన్న చిన్న సందేశాలు మరియు పక్షులు చేసే చిన్న చిన్న ధ్వనులు అని, ట్విట్టర్ అనే పేరు తమ వెబ్ సైట్ కి బాగా సరిపోయిందని Jack Dorsey వివరించారు. 

Twitter యొక్క ఎదుగుదల :   

2006 వ సంవత్సరంలో ఆగస్ట్ నెలలో కాలిఫోర్నియా లో జరిగిన భూకంపం మరియు 2007 లో జరిగిన South by Southwest Interactive  అనే ఫిల్మ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ను ప్రజలు ట్విట్టర్ ద్వారా ఎక్కువగా షేర్ చేయటం వళ్ళ ట్విట్టర్ ఒక్కసారిగా ప్రపంచం యొక్క కళ్ళలో పడింది. 2007 వ సంవత్సరంలో ట్విట్టర్ ఒక సంస్థ గా ఏర్పడింది.

 2010 వ సంవత్సరంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో జపాన్ కెమరూన్ దేశం ని ఓడించిన తరవాత ౩౦ సెకండ్స్ లలో ఒక్కో సెకండ్ కి 2,940 ట్వీట్స్ పోస్ట్ చేయడం జరిగింది.

ఇదే సంవత్సరంలో NBA ఫైనల్స్ లో Los Angeles Lakers గెలిచిన తరవాత ఒక్క సెకండ్ లో 3085 ట్వీట్ లు పోస్ట్ చేయడం జరిగింది. 

2011 వ సంవత్సరంలో FIFA Women’s World Cup Final జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ జరిగిన మ్యాచ్ లో 7,196 ట్వీట్ లు పోస్ట్ చేయబడ్డాయి. 

2009 వ సంవత్సరంలో మైఖేల్ జాక్సన్ చనిపోయినప్పుడు చాలా మంది గంటకు ఒక లక్ష ట్వీట్ లతో “Michael Jackson” అని తమ స్టేటస్ లోపెట్టడం మొదలుపెట్టారు. 

ట్విట్టర్ లోగో (Logo) :  

2006 వ సంవత్సరంలో ట్విట్టర్ ను కనుగొన్నపుడు కేవలం ట్విట్టర్ అనే టెక్స్ట్ మాత్రమే ఉండేది, తరవాత ట్విట్టర్ పదం తో పాటు ఒక పక్షి క్లిప్ఆర్ట్ జోడించారు. ఈ క్లిప్ఆర్ట్ ఒక ఆర్టిస్ట్ ది కావటం వళ్ళ ట్విట్టర్ సొంతంగా ఒక పక్షి బొమ్మ ఆకారంలో ఒక లోగో తయారుచేయాలని నిర్ణయించింది.  Mountain bluebird అనే పక్షిని ఆధారం చేసుకొని కొత్త లోగో తయారు చేసారు. 

ట్విట్టర్ ట్రెండ్స్:  

ట్విట్టర్ ట్రెండ్స్ లో ఒక ప్రాంతంలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక పదం, వాక్యం లేదా ఒక అంశం పై ఎంత మంది ఆసక్తి చుపిస్తున్నారో దానిని ఆధారం చేసుకొని ట్రేండింగ్ లిస్ట్ ఎన్నుకోబడుతుంది. ట్విట్టర్ ట్రెండ్స్ ఆధారం చేసుకొని ఒక వ్యక్తి ప్రస్తుతం ప్రజలు ఏ విషయం పై చర్చిస్తున్నారో తెలుసుకోవచ్చు.   

Leave a Comment