వరల్డ్ క్యాన్సర్ డే ను ఫిబ్రవరి 4 న ఒక అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి మరియు దీని నివారణ, చికిత్స మరియు గుర్తించే అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది.
వరల్డ్ క్యాన్సర్ డే ను యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కాన్సర్ (Union for International Cancer Control) ద్వారా నిర్వహించబడుతుంది.
ఈ సంస్థ 2008 లో వరల్డ్ కాన్సర్ డిక్లరేషన్ ద్వారా రాయబడిన లక్ష్యాలను చేరుకోవటంలో సహాయం చేస్తుంది.
ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే క్యాన్సర్ జబ్బు వల్ల కలిగిన అనారోగ్యాన్ని మరియు మరణాలను పెద్ద మొత్తంలో తగ్గించటం.
ఈ రోజు క్యాన్సర్ పై ఆవాహన పెంచటాన్ని, క్యాన్సర్ గురించి ఉన్న తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా మరియు కాన్సర్ పై ఉన్న తప్పుడు అవగాహనపై ఫోకస్ చేస్తుంది.
కాన్సర్ బారిన పడ్డ వారిని సపోర్ట్ చేస్తూ వివిధ రకాల ఉద్యమాలను నడుపుతారు. అందులోనిదే ఒకటి #NoHairSelfie. ఈ ఉద్యమంలో ప్రపంచమంతటా ఉన్న వారు తమ తలలను షేవ్ చేసుకొని లేదా గుండు చేయించుకొని క్యాన్సర్ బారిన పడ్డ వారికి మద్దతు తెలుపుతారు.
ఈ రోజును 2000 సంవత్సరం ఫిబ్రవరి 4 వ రోజున పారిస్ లో నిర్వహించబడ్డ World Cancer Summit Against Cancer for the New Millennium (న్యూ మిలీనియం కోసం క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ప్రపంచ క్యాన్సర్ సమ్మిట్) లో మొదలుపెట్టారు.
ప్రతి సంవత్సరం వరల్డ్ కాన్సర్ డే ను వివిధ నేపథ్యలతో నిర్వహించబడుతుంది.
2022 – 2024 Close the care gap
2019- 2021 I Am and I Will
2016 – 2018 We can. I can
2015 Not Beyond Us
2014 Debunk the Myths
2013 Cancer Myths – Get the Facts
2012 Together let’s do something
2010 – 2011 Cancer can be prevented
2009 – 2010 I love my healthy active childhood
ఈ రోజున కొన్ని ముఖ్య ప్రాంతాలను లేదా ల్యాండ్ మర్క్స్ ను ఆరంజ్ మరియు బ్లూ రంగులలో వెలిగించి ఈ రోజుకు మద్దతు తెలపటం జరుగుతుంది.
2019 వ సంవత్సరంలో 60 దేశాల ప్రభుత్వం అధికారికంగా ఈ రోజును నిర్వహించాయి. అలాగే 37 దేశాల లోని ముఖ్యమైన ప్రాంతాలను లైట్లతో వెలిగించే ప్రక్రియను మొదలుపెట్టారు.
ప్రతి సంవత్సరం దాదాపు 100 దేశాలలో 900 కంటే ఎక్కువ అక్టీవిటీస్ (కార్యకలాపాలు) జరుగుతాయి.
క్యాన్సర్ అంటే ఏమిటి ?
సాధారణంగా మనుషుల శరీరంలో కణాలు పుడుతూ చనిపోతూ ఉంటాయి. చనిపోయిన వాటి స్థానంలో కొత్త కణాలు వస్తాయి.
క్యాన్సర్ వ్యాధిలో మాత్రం కణాలు చనిపోకుండా అపరిమిత స్థాయిలో పెరుగుతూ పోతాయి. ఈ కణాలు ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా మనము క్యాన్సర్ బారిన పడుతాము. క్యాన్సర్ ఏ శరీర భాగం లో నైనా రావచ్చు
Source: World Cancer Day – Wikipedia