కె. విశ్వనాథ్ జీవిత చరిత్ర – K. Viswanath biography in Telugu

కె. విశ్వనాథ్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నటుడు.

బాల్యం :

కాశినాధుని విశ్వనాథ్ 1930 వ సంవత్సరంలో ఫిబ్రవరి 19 వ రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలంలో కాశినాధుని సుబ్రహ్మణ్యం మరియు కాశినాధుని సరస్వతి అనే దంపతులకు జన్మించారు.

విశ్వనాథ్ తన ఇంటర్మీడియట్ చదువును గుంటూరు హిందూ కాలేజీ నుంచి పూర్తి చేసారు. BSc డిగ్రీ ను ఆంధ్ర యూనివర్సిటీ కి చెందిన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజి నుంచి పూర్తి చేసారు.

కెరీర్:

విశ్వనాధ్ తన కెరీర్ ను మద్రాస్ లోని వౌహిని స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. అక్కడే ఈయన తండ్రి కూడా పనిచేసేవారు.

వౌహినిలో సౌండ్ ఇంజనీరింగ్ హెడ్‌గా ఉన్న ఎ కృష్ణన్ మార్గదర్శకత్వం తో ముందుకు సాగారు. తరవాత వీరు ఇద్దరు సన్నిహితులుగా మారారు.

తరవాత సినిమాలలో దర్శకత్వం చేయటం ప్రారంభించారు.

1951 వ సంవత్సరంలో పాతాళ భైరవి సినిమాకు దర్శకత్వం వహించారు .

1965 వ సంవత్సరంలో ఆత్మ గౌరవం అనే సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా అరంగేట్రం చేసారు.

ఈ సినిమాకు నంది అవార్డు లభించింది. తరవాత చెల్లెలి కాపురం (1971), శారద (1973), ఓ సీత కథ (1974) మరియు జీవన జ్యోతి (1975) సినిమాలకు దర్శకత్వం వహించారు.

1980 లో తీసిన శంకరా భరణం సినిమా పాశ్చాత్య సంగీతం కారణంగా సాంప్రదాయ భారతీయ సంగీతాన్నిమరిచిపోతున్నారనే విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుక వస్తుంది.

విశ్వనాధ్ తన సినిమాలలో మానసికంగా మరియు శారీరకంగా వికలాంగుల పాత్రలతో కూడా సినిమాలు చేసి వారిని హైలైట్ చేసారు.

శారద (1973), స్వాతి ముత్యం (1986), స్వాతి ముత్యం (1986), కలాం మారింది (1972) అనే సినిమాలలో మానసిక మరియు శారీరక వికలాంగుల గురించి చాలా బాగా చెప్పారు.

విశ్వనాధ్ తన సినిమాలలో సామజిక సమస్యలను చాలా బాగా లేవెనెత్తేవారు.

సప్తపది, సిరివెన్నెల, సూత్రధారులు, శుభలేఖ, శృతిలయలు, శుభ సంకల్పం, ఆపద్బాంధవుడు, స్వయం కృషి, మరియు స్వర్ణకమలం సినిమాల ద్వారా సామజిక సమస్యలైన అంటరానితనం, కులవ్యవస్థ, మరియు కట్నం లాంటి గంభీర విషయాలపై సినిమాలను చేసి ప్రశంసలను అందుకున్నారు.

తెలుగు సినిమాలకె అని కాకుండా హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.

సర్గమ్ (1979), కామ్‌చోర్ (1982), శుభ్ కామ్నా (1983), జాగ్ ఉతా ఇన్సాన్ (1984), సుర్ సంగమ్ (1985), సంజోగ్ (1985), ఈశ్వర్ (1989), సంగీత్ (1992) మరియు ధన్వన్ (1993) హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు.

దర్శకత్వం తో పాటు 1995 వ సంవత్సరంలో శుభ సంకల్పం సినిమాలో నటుడిగా అరంగేట్రం చేసారు.

వజ్రం (1995), కలిసుందాం రా (2000), నరసింహ నాయుడు (2001), నువ్వు లేక నేను లేను (2002), సంతోషం (2002), సీమ సింహం (2002), ఠాగూర్ (2003), లక్ష్మీ నరసింహ (2004), స్వరాభిషేకం (2004), ), ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007), ఆటాడు (2005), మరియు పాండురంగడు (2008), మరియు దేవస్థానం (2012) తెలుగు సినిమాలలో నటించారు.

అలాగే తమిళ సినిమాలలో కూడా నటించారు. కొన్ని TV సిరియాల్ లలో కూడా నటించారు.

మరణం:

విశ్వనాధ్ 92 సంవత్సరాల వయస్సులో అనారోగ్యం బారిన పడి అపోలో హాస్పిటల్ లో చేరారు.

ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఫిబ్రవరి 2 వ తారీకు 2023 వ సంవత్సరంలో తుది శ్వాస విడిచారు.

Source: K. Viswanath – Wikipedia

Leave a Comment