పూర్వం చనిపోయిన క్రైస్తవ అమరవీరులను వాలెంటైన్ అని పిలిచేవారు. వీరిని సత్కరించడానికి ఫిబ్రవరి 14 ను జరుపుకోవటం మొదలుపెట్టారు.
వాలెంటైన్ డే అనే పేరును 3 వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ రోమన్ సాధువు పేరు మీద పెట్టడం జరిగింది. ఈయనకు సంభందించి వివిధ రకాల కథలు ప్రాచుర్యం లో ఉన్నాయి.
హింసించబడుతున్న క్రైస్తవులకు సహాయం చేసినందుకు వాలెంటైన్ కు జైలు శిక్ష విధించారు.
ఆ సమయంలో ఉన్న రాజు క్లాడియస్ II తో ప్రత్యేకంగా వాలెంటైన్ విచారించబడ్డారు. వాలెంటైన్ తో మాట్లాడి రాజును ఆకట్టుకున్నాడు. వాలెంటైన్ ప్రాణాలను కాపాడటానికి ధర్మ పరివర్తన చేయమని కోరాడు.
కానీ వాలెంటైన్ రాజునే క్రైస్తవ మతం లోకి మారమని కోరుతాడు. చనిపోయే ముందు కళ్ళు కనిపించని జైలర్ కూతురు అయిన జూలియాను తన చేతి స్పర్శతో చూపును తీసుకవచ్చి ఒక అద్భుతాన్ని సృష్టించాడు.
ఈ వింత చుసిన జైలర్ యొక్క కుటుంబం మొత్తం క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. చివరికి వాలెంటైన్ ఆ రాజు ద్వారా వాలెంటైన్ ఉరి తీయబడుతాడు.
జూలియా కు చూపు వచ్చిన తరవాత వాలెంటైన్ ఒక ఉత్తరం రాసి చివరగా ” Your valentine” అని రాస్తాడు. అక్కడినుంచి Your valentine రాయటం మొదలైందని చాలా మంది భావిస్తారు.
ఇంకొక కథనం ప్రకారం వాలెంటైన్ క్లాడియస్ II రాజ్యంలోని సైనికులకు రహస్యంగా క్రైస్తవ వివాహాలను జరిపించేవారు. క్లాడియస్ II పెళ్లి కి వ్యతిరేకత తెలిపేవారు. పెళ్లి చేసుకున్న వారు ఒక మంచి సైనికుడు అవ్వలేదని మరియు ఒక మంచి తయారు అవ్వడాన్ని నమ్మేవాడు. ఇలా పెళ్లిళ్లు చేయించినందుకు వాలెంటైన్ కు మరణ శిక్ష పడిందని కొందరు నమ్ముతారు.
తమ ప్రతిజ్ఞలను మరియు దేవుడి ప్రేమ ను గుర్తు చేయటానికి కాగితం ముక్కలతో తయారు చేసిన గుండెను కత్తిరించి హింసించబడిన క్రైస్తవులకు పంచేవారు. అలా గుండె ఆకారాన్ని ప్రేమకు ప్రతిరూపంగా చూడటం మొదలుపెట్టారు అని భావిస్తారు.
క్రమ క్రమంగా ఫిబ్రవరి 14 ఆధునిక ఆచారాలతో ప్రేమికుల దినోత్సవంగా మారింది. ఈ రోజు ఎర్ర గులాబీ పువ్వులు ఇవ్వటం, చాకోలెట్స్ ఇవ్వటం, గిఫ్టులు ఇవ్వటం మరియు గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వటం మొదలయ్యాయి.
వాలెంటైన్ డే కి ముందు వాలెంటైన్ వీక్ అంటే మొత్తం వారాన్నీ వివిధ పేర్లతో జరుపుకుంటారు.
Valentine 7 days:
Day 7: రోజ్ డే (Rose Day)
Day 8: ప్రొపోజ్ డే (Propose Day)
Day 9: చాకోలెట్ డే (Chocolate Day)
Day 10: టెడ్డీ డే (Teddy Day)
Day 11: ప్రామిస్ డే (Promise Day)
Day 12: హాగ్ డే (Hug Day)
Day 13: కిస్ డే (Kiss Day)
Day 14: వాలెంటైన్ డే (Valentine’s Day)
Source:Valentine’s Day – Wikipedia