బ్రహ్మానందం జీవిత చరిత్ర – Brahmanandam biography in Telugu

బ్రహ్మానందం భారతదేశానికి చెందిన నటుడు మరియు కమేడియన్. ఈయన ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లో నటిస్తారు.

1000 కి పైగా సినిమాలలో నటించి అత్యధిక సినిమాలలో నటించిన నటుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నారు.

బాల్యం:

కన్నెగంటి బ్రహ్మానందం 1 ఫిబ్రవరి 1956 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లి మండలం, ముప్పాళ్ల దగ్గర ఉన్న చాగంటి వారి పాలెం అనే గ్రామంలో నాగలింగాచారి మరియు లక్ష్మీ నర్సమ్మ దంపతులకు జన్మించారు. మొత్తం 8 మంది తోబుట్టువులలో బ్రహ్మానందం ఒకరు. ఈయన తండ్రి ఒక కార్పెంటర్.

ఎలిమెంటరీ చదువును సత్తెనపల్లి లో పూర్తిచేసుకున్నారు. భీమవరం లోని DNR కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి MA చదివారు.

మాస్టర్ డిగ్రీ సంపాదించిన తరవాత వెస్ట్ గోదావరి జిల్లాలో తెలుగు లెక్చరర్ గా చేరారు.

కెరీర్ :

లెక్చరర్ గా పనిచేస్తూనే థియేటర్ చేసేవారు అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ గా నటించేవారు. అదే సమయంలో ఈయన భార్య హైదరాబాద్ లోని రాంనగర్ లో తన అన్నయ ఇంటికి డెలివరీ కోసం వచ్చారు. సెలవులలో బ్రహ్మానందం హైదరాబాద్ వచ్చే వారు. అలా హైదరాబాద్ వచ్చినపుడు నవలా రచయిత మరియు నాటక రచయిత అయిన ఆది విష్ణు ను కలిసేవారు, ఆదివిష్ణు ను తన కామెడీ తో నవ్వించేవారు.

బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ను చూసిన ICV శశిధర్, మీరు చేస్తున్న కామెడీ కొత్తగా మొదలైన దూరదర్శన్ లో చేసే బాగుంటుందని చెప్పారు.

ఈ షో లో బ్రహ్మానందం పర్ఫార్మన్స్ (నటన) ప్రేక్షకులను బాగా నచ్చింది. ఈ షో లో బ్రహ్మానందం నటన చూసిన దర్శకుడు జంధ్యాల అహ!నా-పెళ్లంట! సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 1987 లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రకు ప్రేక్షకులు చాలా మెచ్చుకున్నారు.

ఇదే సంవత్సరం హిట్టు సినిమాలైనా పసివాడి ప్రాణం మరియు స్వయం కృషి లో నటించారు.

ఆ తరవాతి సంవత్సరాలు కూడా హిట్టు సినిమాలలో నటించారు. 1988 లో వివాహ భోజనంబు చూపులు కలిసిన శుభవేళ (1988), బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989), ముద్దుల మావయ్య (1989), జగదేక వీరుడు అతిలోక సుందరి (1990), బొబ్బిలి రాజా (1990) మరియు బామ్మ మాట బంగారు బాట (1990) సినిమాలలో బ్రహ్మానందం నటనను మంచి ప్రశంసలు లభించాయి.

1990 తరవాత కూడా విడుదలైన మరియు విజయం సాధించిన సినిమాలలో బ్రహ్మానందం నటించారు.

క్షణ క్షణం (1991) మరియు రౌడీ అల్లుడు (1991), భళారే విచిత్రం (1991), జంబ లకిడి పంబ (1992), మరియు యమలీల (1994) లాంటి సినిమాలలో నటించి ప్రజల ఆదరణ పొందారు.

క్రిటిక్స్ కూడా బ్రహ్మానందం కామెడీ సినిమా విజయానికి ముఖ్య కారణం అని చెప్పారు.

బ్రహ్మానందం 1992 లో బాబాయ్ హోటల్ సినిమాలో లీడ్ రోల్ లో నటించారు. తరువాత బ్రహ్మానందం సినిమాలలో నటిస్తూనే వెళ్లారు. బ్రహ్మానందం కామెడీ కోసం సినిమాలకు జనాలు వెళ్లటం ప్రారంభించారు. ఇలా 1000 కి పైగా సినిమాలలో ఈయన నటించారు.

వ్యక్తిగత జీవితం:

బ్రహ్మానందం మరియు లక్ష్మి దంపతులకు రాజా గౌతమ్ మరియు సిద్ధార్థ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.

నటనతో పాటు బ్రహ్మానందం ఒక స్కెచ్ ఆర్టిస్ట్, ఖాళీ సమయాలలో స్వామి వివేకానంద మరియు జిడ్డు కృష్ణమూర్తి రాసిన ఫిలాసఫీలను చదువుతారు.

Source: Brahmanandam – Wikipedia

Leave a Comment