బబుల్ టీ అంటే ఏమిటి – What is Bubble Tea in Telugu

బబుల్ టీ అనేది తైవాన్ కి చెందిన వంటకం (రెసిపీ). టీ ను పాలతో, పండ్లతో, పండ్ల జ్యూస్ లతో కలిపి తరవాత టాపియోకా పెర్ల్స్ ను చేర్చి గట్టిగా కలిపి బబుల్ టీ ను తయారు చేస్తారు.

ఈ టీ లో టాపియోకా పెర్ల్స్ కింది భాగంలో ఉంటాయి. బబుల్ టీ వేడిగా మరియు చల్లగా రెండు రకాలుగా కూడా దొరుకుతుంది.

ఈ టీ ను సర్వ్ చేస్తున్నప్పుడు ఒక మందమైన స్ట్రా (Straw) ఇవ్వబడుతుంది. దీని వెనక గల కారణం ఏమిటంటే స్ట్రా ద్వారా టీ తాగినప్పుడు టాపియోకా పెర్ల్స్ స్ట్రా ద్వారా నోటిలోకి చేరుతాయి. ఫలితంగా వాటి టేస్ట్ ను ఆస్వాదించవచ్చు.

 Bubble Tea in Telugu
Bubble tea (బబుల్ టీ)

టాపియోకా పెర్ల్స్ అంటే ఏమిటి ?

బబుల్ టీ లో అడుగు భాగంలో ఉండే బాల్స్ ను టాపియోకా పెర్ల్స్ అని అంటారు. ఇవి నల్ల రంగులో ఉంటాయి.

ఈ టాపియోకా పెర్ల్స్ ను కూడా తయారు చేసే ఒక ప్రత్యేక రెసిపీ ఉంటుంది.

టాపియోకా పెర్ల్స్ ను తయారు చేయటానికి ముందుగా టాపియోకా స్టార్చ్ (పిండి పదార్ధం) ను తయారు చేసుకోవాలి.  టాపియోకా స్టార్చ్ ను కాసావా (కర్ర పెండలం దుంప) అనే మొక్క నుండి తయారు చేయటం జరుగుతుంది. 

ఇలా తయారు అయిన స్టార్చ్ ను మళ్ళీ ఒక ప్రత్యేక రెసిపీ ద్వారా టాపియోకా పెర్ల్స్ ను తయారు చేస్తారు. ఈ పద్దతి లో నల్ల రంగు కలపడటం వల్ల టాపియోకా పెర్ల్స్ నల్లగా కనిపిస్తాయి.  

హిస్టరీ : 

1980 వ సంవత్సరంలో తైవాన్ లో బబుల్ టీ ను తాగటం ప్రారంభించారు. తైవాన్ కి చెందిన వలస దారులు అమెరికా మరియు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు బబుల్ టీ ప్రాచుర్యం లోకి వచ్చింది. 

బబుల్ టీ ఆవిష్కరణ ఎలా జరిగింది ?

బబుల్ టీ ఆవిష్కరణకు సంబంధించిన గట్టి ఆధారాలు లేవు కానీ దీనికి సంబంధించిన రెండు కథలు చాలా ప్రాముఖ్యత పొందాయి. 

మొదటి  కథ ప్రకారం Liu Han-Chieh  తైవాన్ లో Chun Shui Tang అనే ఇంటర్నేషనల్ షాప్ నడిపించేవాడు.  

1980 లో Liu జపాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ చల్లని కాఫీ (కోల్డ్ కాఫీ) సర్వ్ చేయటాన్ని గమనించారు. 

తిరిగి తైవాన్ వెళ్లి అక్కడ టీ ను కూడా చల్లగా అమ్మటం ప్రారంభించారు. ఈ కొత్త ఐడియా వల్ల Liu యొక్క బిసినెస్ చాలా బాగా నడవ సాగింది, ఫలితంగా వేరు వేరు బ్రాంచ్ లను ఓపెన్ చేయటం జరిగింది. 

ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్  Lin Hsiu Hui ప్రకారం ఆమె 1988వ సంవత్సరంలో బబుల్ టీ ను కనుగొన్నారు. 

ఒక సారి  Lin Hsiu Hui మీటింగ్ జరుగుతున్న సమయంలో టాపియోకా బాల్స్ ను టీ లో పోసారు. తన సహోద్యోగులను ఈ డ్రింక్ ను తాగమని కోరారు. 

ఆ మీటింగ్ లో ఉన్న అందరికి ఈ రకమైన టీ చాలా బాగా నచ్చింది. తరవాత ఈ టీ ను మెనూ లో చేర్చటం జరిగింది. చాలా కొద్దీ సమయంలోనే టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ గా మారింది. 

రెండవ కథ ప్రకారం 1986 వ సంవత్సరంలో Tu Tsong-he బబుల్ టీ ను కనుగొన్నారు. Tu Tsong-he అక్కడ ఉన్న మార్కెట్ లో టాపియోకా బాల్స్ ను చూసారు, వీటిని టీ లో చేర్చి బాబుల్ టీ ను అమ్మటం ప్రారంభించారు. 

వెరైటీలు:

బబుల్ టీ ను పాలు లేకుండా మరియు పాలతో రెండు రకాలుగా తయారు చేస్తారు. 

బబుల్ టీ లో బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ మరియు ఊలాంగ్ టీ అనే వెరైటీలు ఉంటాయి.

బబుల్ టీ లో టాపియోకా బాల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో పాటు గ్రాస్ జెల్లీ, అలోవేరా మరియు రెడ్ బీన్ లను కూడా ఉపయోగిస్తారు .   

Google Doodle:

బబుల్ టీ యొక్క ప్రాముఖ్యతను చూసి 29 జనవరి 2020 లో బబుల్ టీ ఎమోజి (emoji) ను లాంచ్ చేయటం జరిగింది.

2023 జనవరి 29 రోజున గూగుల్ ఈ సందర్భాన్ని గూగుల్ డూడుల్ ద్వారా జరుపుకుంటుంది.

Sources: 1) Bubble tea – Wikipedia   2) What Is Bubble Tea? – Twinings    

Leave a Comment