P. K. రోజీ భారతదేశానికి చెందిన నటి, ఈమె ముఖ్యంగా మలయాళం సినిమాలలో నటించారు.
రోజీ మలయాళం సినిమా ఇండస్ట్రీ కి చెందిన మొట్ట మొదటి హీరోయిన్. దళిత మహిళ అయ్యి అగ్ర కుల మహిళగా నటించారని రోజీ ఇంటిని అగ్ర కులాల వారు తగల బెట్టారు.
బాల్యం:
రోజీ 1903 వ సంవత్సరంలో త్రివేండ్రం లోని నందన్‌కోడ్ లో పాలోస్ మరియు కుంజీ అనే దంపతులకు జన్మించారు. పుట్టినప్పుడు ఈమె కు రాజమ్మ అని పేరు పెట్టారు.
ఈమె పూలాయ కులానికి చెందిన వారు. చిన్న వయస్సులోనే రోజీ తన తండ్రిని కోల్పోయారు. తండ్రి చనిపోయిన తరవాత రోజీ కుటుంబం చాలా పేదరికాన్ని చూడాల్సి వచ్చింది.
చిన్న తనంలో రోజీ గ్లాస్ కట్టర్ గా పనిచేసారు, కానీ రోజీ కి కళ పట్ల కూడా అభిరుచి ఉండేది. రోజీ లో కళ గురించి ఉన్న ఆసక్తి ను చూసి తన అంకుల్ మ్యూజిక్ మరియు యాక్టింగ్ ను నేర్చుకోవటానికి ఒక టీచర్ ను కూడా ఏర్పాటు చేసారు.
రోజీ స్థానిక కళా పాఠశాలకు రోజు క్రమం తప్పకుండ వెళ్లి కక్కిరాసి నాటకం ను నేర్చుకునేవారు.
కక్కిరాసి నాటకం అనేది తమిళ మరియు మలయాళం కలయికతో కలిగిన తమిళ జానపద థియేటర్. ఈ నాటకంలో ముఖ్యంగా శివుడి మరియు పార్వతి కి సంబంధించిన కథలు చెప్పబడతాయి.
ఆ రోజులలో ప్రజలు స్త్రీల యొక్క నటనను చులకనగా చూసేవారు, పైగా నటన అనేది మహిళలకు చెందినది కాదని భావించేవారు. నటన చేసే మహిళల విచ్చలవిడిగా తిరిగేవారు అని భావించేవారు.
నటన పట్ల రోజీ కి ఉన్న ప్రేమ ఇతరులు తనను ఏమని పిలుస్తారో అనే ఆలోచన రానివ్వలేదు.
కెరీర్ :
1928 వ సంవత్సరంలో రోజీ కాకిరాసి నాటకంలో మంచి పట్టును సాధించారు. తరవాత JC డేనియల్ సినిమా అయిన విగతకుమారన్ లో హీరోయిన్ గా అవకాశం లభించింది.
ఈ సినిమాలో రోజీ సరోజినీ అనే నాయర్ కులానికి చెందిన మహిళ పాత్రను పోషించారు.
సినిమా విడుదల అయిన తరవాత నాయర్ కులానికి చెందిన వారు ఒక దళిత మహిళ అగ్ర కుల మహిళగా ఎలా నటిస్తుంది అని నిరసనలు చేయటం మొదలుపెట్టారు.
విగతకుమారన్ సినిమా ప్రారంభోత్సవం సమయంలో రోజీ ఉంటే మేము రాము అని సినీ ప్రముఖులు అన్నారు. ప్రముఖ న్యాయవాది మధూర్ గోవిందన్ పిళ్లై కూడా నిరాకరించారు.
సినిమాలో ఒక సన్నివేశంలో మెయిన్ క్యారెక్టర్ రోజీ తలలో ఉన్న పువ్వును ముద్దు పెడతాడు. ఇది చూసిన ప్రేక్షకులు స్క్రీన్ పై రాళ్లు విసిరారు.
దర్శకుడు డేనియల్ తిరువనంతపురంలోని క్యాపిటల్ థియేటర్‌లో జరిగిన సినిమా ఓపెనింగ్‌కి రోజీ ను పిలవలేదు. రోజీ వస్తే నిరసనకారులు వ్యతిరేకత తెలుపుతారని డేనియల్ రోజీ ను పిలవలేదు.
కానీ రోజీ అక్కడికి వస్తారు, ఫలితంగా నిరసనకారులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుల వివక్షత:
అగ్ర కుల మహిళగా రోజీ నటించిందని అగ్ర కులాల వారు రోజీ యొక్క ఇంటిని తగలబెట్టారు. రోజీ ఒక నేరం చేసిందని భావించారు.
కొన్ని ఆధారాల ప్రకారం ఇల్లు తగలబడిపోయిన తరవాత లారీ లో తమిళనాడుకు పారిపోయారు. తరవాత అదే లారీ డ్రైవర్ కేశవన్ పిళ్లై తో పెళ్లి చేసుకొని తమిళ నాడులో రాజమ్మాళ్ అనే పేరు తో సెటిల్ అయ్యారు.
పెళ్లి తరవాత రోజీ తన పేరును రాజమ్మాళ్ గా మార్చుకున్నారు. మరియు తన కులాన్ని కూడా తన భర్త యొక్క కులం అయిన నాయర్ కులం తో మార్చుకున్నారు.
రోజీ యొక్క పిల్లలకు తమ తల్లి ఒక హీరోయిన్ అని ఒక సమయంలో సినిమాలలో నటించిందని అన్న విషయం కూడా తెలియదు.
వ్యక్తిగత జీవితం :
రోజీ తన మతాన్ని క్రైస్తవ మతంగా మార్చుకున్నారని మరియు తన పేరు ను రాజమ్మ నుంచి రోజమ్మ గా మార్చుకున్నారని చాలా మంది నమ్ముతారు. కొందరి ప్రకారం దర్శకుడు డేనియల్ తన పేరును మార్చారని నమ్ముతారు.
10 ఫిబ్రవరి 2023 న, గూగుల్ రోజీ 120 వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ డూడుల్ తో గౌరవించింది.
Source: P. K. Rosy – Wikipedia