గూగుల్ AI బార్డ్ అంటే ఏమిటి – What is google AI Bard in Telugu?

బార్డ్ (Bard) అనేది గూగుల్ సంస్థ కు చెందిన A.I చాట్ బోట్ మరియు experimental conversational AI service. ఈ బోట్ Language Model for Dialogue Application (LAMDA) పై ఆధారం చేసుకొని తయారు చేయబడింది. బార్డ్ మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన చాట్ జిపిటి (chat gpt) కి పోటీగా లంచ్ చేసింది.

ఫిబ్రవరి 6 వ తారీకున సుందర్ పిచాయి ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా AI మరియు బార్డ్ చాట్ బోట్ గురించి ప్రకటించారు.

AI టెక్నాలజీ:

AI గురించి మాట్లాడుతూ పిచాయి, ప్రస్తుతం టెక్నాలజీ లో AI చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది, డాక్టర్లకు వ్యాధులను గుర్తించటంలో, ప్రాంతీయ భాషలలో సమాచారాన్ని తెలుసుకోవటం లో సహాయపడుతుంది. అలాగే ప్రజలకు, బిజినెస్ చేసేవారికి మరియు కమ్యూనిటీ వారికి సహాయం చేస్తుందని చెప్పారు. అందుకే గూగుల్ కంపెనీ AI టెక్నాలజీ మీద పనిచేయటం మొదలు పెట్టింది అని అన్నారు.

బార్డ్ (BARD):

గూగుల్ conversation technology అంటే మనుషులతో మాట్లాడగలిగే సామర్థ్యం కలిగిన టెక్నాలజీ అయిన LaMDA ను 2021లో లాంచ్ చేసారు.

ఈ LaMDA టెక్నాలజీ ను ఆధారం చేసుకొని బార్డ్ అనే experimental conversational AI service ను గూగుల్ సాధారణ ప్రజల కోసం లాంచ్ చేయనుంది.

మొదట గూగుల్ LaMDA కు చెందిన ఒక లైట్ వెర్షన్ మరియు తక్కువ కంప్యూటింగ్ పవర్ ను వినియోగించే మోడల్ ను లాంచ్ చేయనుంది.

ఈ మోడల్ ఎలా పనిచేస్తుంది అని చూపించడానికి గూగుల్ ఒక గిఫ్ ఫైల్ ను రిలీజ్ చేసింది.

What new discoveries from NASA’s James Webb Space Telescope to a 9-year-old అని టైపు చేసినప్పుడు ఇలా సమాధానం ఇచ్చింది.

సాధారణంగా మనము గూగుల్ లో ఏదైనా general knowledge కి సంధించిన ప్రశ్న అడిగినప్పుడు అది టక్కున సమాధానం చెబుతుంది. ఉదాహరణకి క్రికెట్ లో ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు ? కానీ ఇప్పుడు AI టెక్నాలజీ ద్వారా ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు క్రికెట్ ఆటను ఎలా ఆడాలి ?

గూగుల్ సెర్చ్ లో కూడా ఈ ఫీచర్ ను చేర్చి ఇన్ఫర్మేషన్ ను సులువుగా అందరికి చేరేలా గూగుల్ ప్రయత్నిస్తుంది.

ప్రకటన:

ప్రస్తుతం గూగుల్ బార్డ్ ఎప్పుడు లంచ్ చేయబోతోందనే విషయం పై స్పష్టత తెలపలేదు. రాబోయే రోజులలో గూగుల్ అందరికి అందుబాటులో ఉండేవిదంగా లాంచ్ చేయబోతుంది.

చాట్ జిపిటి :

చాట్ జిపిటి రిలీజ్ అయిన కొంత సమయం తరవాత బార్డ్ అనే చాట్ బోట్ గూగుల్ రిలీజ్ చేయటం చాట్ జిపిటి కి గట్టి పోటీ ఇవ్వటానికి అని చాలా మంది భావిస్తున్నారు.

Source: Google AI updates: Bard and new AI features in Search (blog.google)

Leave a Comment