చంద్ర గ్రహణం అంటే ఏమిటి – What is Lunar eclipse?

సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే వరుసలో చాలా దగ్గర దగ్గరగా  వచ్చినప్పుడు సూర్యుని నీడ చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డువస్తుంది. 

ఫలితంగా భూమి యొక్క నీడ చంద్రుడు పై పడుతుంది. ఇది కేవలం పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. 

 ప్రతి నెల ఒక్కసారి పౌర్ణమి వస్తుంది కదా అయితే ప్రతి నెల కూడా చంద్రగ్రహణం అవ్వాలి కదా అని మీకు సందేహం రావొచ్చు. 

చంద్రుని కక్ష్య భూమితో పోలిస్తే  కొన్ని డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకే   సూర్యుడు చంద్రుడు మరియు భూమి ఎల్లపుడు ఒకే వరసలో ఉండవు. 

చంద్ర గ్రహణం రెండు రకాల నీడలతో ఏర్పడుతుంది, అంబ్రా (umbra) మరియు పెనుంబ్రా (penumbra)

పెనుంబ్రా నీడ ఎక్కువ ప్రాంతం లో విస్తరించి ఉంటుంది కానీ దట్టంగా ఉండదు. 

అంబ్రా నీడ మాత్రం తక్కువ ప్రాంతంలో విస్తరించి ఉంటుంది మరియు చాలా దట్టంగా ఉంటుంది.  

Umbra and Penumbra

చంద్ర గ్రహణం మొత్తం మూడు రకాలుగా ఉంటుంది 

1) సంపూర్ణ గ్రహణం (Total lunar eclipse)

2) పాక్షిక చంద్రగ్రహణం (Partial lunar eclipse)

3) పెనుంబ్రల్ చంద్రగ్రహణం (Penumbral lunar eclipse)

సంపూర్ణ గ్రహణం :

సంపూర్ణ చంద్ర గ్రహణంలో చంద్రడు మొత్తం  అంబ్రల్ నీడలో ఉంటాడు.  ఈ సూర్య గ్రహణం లో చంద్రుడు మొత్తం ఎరుపుగా కనిపిస్తాడు. 

భూమి నుంచి వెళ్లే కాంతి తరంగాలలో ఎరుపు రంగు వక్రీభవించి చంద్రుడి వైపు వెళతాయి. ఫలితంగా చంద్రుడు ఎరుపుగా కనిపిస్తాడు. 

 పాక్షిక చంద్రగ్రహణం : 

పాక్షిక చంద్ర గ్రహణంలో చంద్రుడు పాక్షికంగా అంబ్రల్ నీడలో ఉంటాడు. కాబట్టి పాక్షికంగా భూమి నీడ చంద్రుడి పై పడి గ్రహణం ఏర్పడుతుంది. భూమి వైపు ఉన్న చంద్రుడు కాస్త భాగం నలుపుగా మారి కన్పించకుండా ఉంటుంది. 

పెనుంబ్రల్ చంద్రగ్రహణం: 

ఈ గ్రహణం కేవలం పెనుంబ్రా నీడలోనే ఏర్పడుతుంది.  పెనుంబ్రా నీడ దట్టంగా ఉండక పోవటంతో చంద్రడు కాస్త నల్లగా కనిపిస్తాడు.  ఈ గ్రహణం లో చంద్రుడి రంగు చాలా తక్కువ స్థాయిలో మారటం వల్ల గ్రహణం అయ్యిందని కూడా గమనించలేము. 

Blood Moon

చంద్ర గ్రహణాలు ప్రతి సంవత్సరం 3 సార్లు జరుగుతాయి. ఈ గ్రహణాన్ని రాత్రి సమయంలో సగం భూమి పై నివసించే ప్రజలు చూడవచ్చు.   

సూర్య గ్రహణం సమయంలో నేరుగా సూర్యుడి వైపు చూడటం మన కళ్ళకి ప్రమాదకరం కానీ చంద్ర గ్రహణాన్ని మనం మన కళ్ళతో నేరుగా  చూడవచ్చు.  

Leave a Comment