కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జీవిత చరిత్ర – Kusukuntla Prabhakar Reddy biography in Telugu

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. 2022 లో మునుగోడు లో జరిగిన బై ఎలక్షన్స్ లో TRS పార్టీ తరపు నుంచి పోటీ చేసారు.

బాల్యం :

ప్రభాకర్ రెడ్డి 1965 సంవత్సరంలో నల్గొండ జిల్లా, సమస్థాన్ నారాయణపూర్ లోని సర్వైల్ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లి కమలమ్మ మరియు తండ్రి జాంగా రెడ్డి, ఒక రైతు.

హైదరాబాద్ లోని వివేక వర్ధిని కాలేజీ నుంచి B.ed ను పూర్తి చేసారు. నల్గొండ లోని నారాయణ కాలేజి నుంచి B.sc చదువుకున్నారు.

కెరీర్ :

టీచర్ గా తన కెరీర్ ను మొదలుచేసి ఒక స్కూల్ ను కూడా ప్రారంభించారు.

రాజకీయ జీవితం :

2002వ సంవత్సరంలో తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న మరియు
తన గురువు అయిన కళ్లెం యాదగిరి రెడ్డి తో కలిసి TRS పార్టీ లో చేరారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో మునుగోడు నుంచి జరుగుతున్న ఆందోళనలతో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కారణంగా ప్రజలలో ఒక గుర్తింపును సంపాదించారు.

మునుగోడు ప్రాంత ప్రజలు సరైన నీటి సదుపాయం లేక ఫ్లోరోసిస్ బారిన పడేవారు.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తల్లి కూడా ఫ్లోరోసిస్ బాధితులలో ఒకరు.

తెలంగాణ వచ్చిన తరవాత, 2014 లో జరిగిన ఎన్నికలలో మునుగోడు నియోజక వర్గం నుంచి 38,055 ఓట్ల భారీ మెజారిటీ తో గెలిచారు.

MLA గా ఎన్నుకోబడ్డ తరవాత నీటి సమస్యను తొలగించడానికి మిషన్ కాకతీయను మరియు ఫ్లోరోసిస్ సమస్యను అంతమొందించడానికి మిషన్ భగీరథ ను ప్రారంభించారు. ఇవే కాకుండా మునుగోడు ప్రజలకు ఆరోగ్య సదుపాయం మరియు మంచి విద్య కోసం కృషి చేసారు.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు రావటం వల్ల 2018 లో జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీ తో ఓడిపోయారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు.

2022 లో మునుగోడు లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసి మెజారిటీ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను ఓడించారు.

Leave a Comment