విరాట్ కోహ్లీ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ మరియు భారత క్రికెట్ జట్టు యొక్క మాజీ కెప్టెన్. డొమెస్టిక్ క్రికెట్ లో ఢిల్లీ తరపు నుంచి మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తరపు నుంచి ఆడతారు. కోహ్లీ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్ మ్యాన్.
Table of Contents
బాల్యం :
విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988 వ సంవత్సరం, ఢిల్లీ లో ప్రేమ్ కోహ్లీ మరియు సరోజ్ కోహ్లీ అనే దంపతులకు జన్మించారు.
కోహ్లీ యొక్క తండ్రి ఒక క్రిమినల్ లాయర్ మరియు సరోజ్ కోహ్లీ ఒక గృహిణి. కోహ్లీ కి వికాస్ అనే అన్న మరియు అక్క భావన ఉన్నారు.
కోహ్లీ ఢిల్లీ, ఉత్తమ్ నగర్ నుంచి విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ నుంచి స్కూల్ చదువును పూర్తి చేసారు.
1998 సంవ్సతరంలో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ ప్రారంభమవుతుంది. తొమ్మిది సంవత్సరాల కోహ్లీ ఈ అకాడమీ లో చేరారు.
డొమెస్టిక్ క్రికెట్ :
కోహ్లీ తొలిసారిగా 2002-03 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీను అక్టోబర్ 2002వ సంవత్సరంలో ఢిల్లీ నుంచి అండర్ 15 జట్టులో ఆడారు. 2003- 04 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీలో జట్టు యొక్క కెప్టెన్ గా ఉన్నారు.
2004-05 విజయ్ మర్చంట్ ట్రోఫీను అండర్ 17 జట్టు నుంచి ఆడి గెలిచారు. ఈ ట్రోఫీలో కోహ్లీ రెండు సెంచరీలను చేసారు.
ఫిబ్రవరి 2006వ సంవత్సరంలో లిస్ట్ A క్రికెట్ ను ఢిల్లీ తరపున సర్వీసెస్ క్రికెట్ టీం కి వ్యతిరేకంగా అరంగేట్రం చేసారు.
నవంబర్ 2006 వ సంవత్సరంలో 18 సంవత్సరాల కోహ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తమిళనాడు కి వ్యతిరేకంగా అరంగేట్రం చేసారు.
ఇదే సంవత్సరం డిసెంబర్ లో కోహ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించారు. తండ్రి చనిపోయిన మరుసటి రోజు కర్ణాటక టీం కి వ్యతిరేకంగా ఆడి 90 పరుగులు చేసారు. ఔట్ అయ్యిన తరవాత నేరుగా అంత్యక్రియలకు వెళ్లారు.
2006 వ సంవత్సరంలో భారత అండర్-19 జట్టు లో ఎంపిక చేయబడ్డారు.ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మరియు ODI సిరీస్ లలో భారతదేశం గెలిచింది.
2007 వ సంవత్సరంలో Twenty20 లో అరంగేట్రం వేసారు. ప్రతి సిరీస్ లో కోహ్లీ మంచి స్కోర్ ను చేసేవారు. 2008 జూన్ లో కోహ్లీ కి మరియు అండర్ 19 జట్టు కి చెందిన ఇతర సహచరులకు బోర్డర్-గవాస్కర్ స్కాలర్‌షిప్ లభించింది.
అంతర్జాతీయ క్రికెట్ :
2008వ సంవత్సరంలో కోహ్లీ ను భారత ODI జట్టులో చేర్చబడింది. ఇలా తన అంతర్జాతీయ అరంగేట్రాన్ని 19 సంవత్సరాల వయస్సులో చేసారు.
శ్రీలంక టూర్ కి వెళ్లిన ఇండియా టీం లో సచిన్ మరియు సెహ్వాగ్ గాయ పడటంతో కోహ్లీ ఓపెనర్ గా బ్యాటింగ్ చేసారు.
ఈ టూర్ లో జరిగిన నాలగవ మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసారు.
2009 ICC ఛాంపియన్స్ ట్రోఫీ లో యువరాజ్ సింగ్ గాయపడటం వల్ల కోహ్లీ నాల్గవ బ్యాట్స్ మ్యాన్ గా ఆడారు.
2009 లోనే ఇండియా లో శ్రీలంక తో జరిగిన ODI సిరీస్ లో యువరాజ్ సింగ్ కి బదులుగా ఆడారు. ఈ సిరీస్ లో జరిగిన నాల్గవ మ్యాచ్ లో కోహ్లీ మొట్ట మొదటి ODI సెంచరీ 107 పరుగులు చేసారు.
2010 లో జరిగిన ట్రై సిరీస్ (ఇండియా, బాంగ్లాదేశ్, శ్రీలంక ) లో టెండూల్కర్ స్థానంలో ఆడి సెంచరీను కొట్టారు.
2010లో జరిగిన శ్రీలంక, జింబాబ్వే మరియు ఇండియా మధ్య జరిగిన ట్రై సిరీస్ లో సీనియర్ ప్లేయర్స్ అందుబాటులో ఉండక పోవటం వల్ల వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు.
ఈ సిరీస్ ఆడిన తరవాత వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ గా రికార్డు సంపాదించారు.
కోహ్లీ తన టీ20 అరంగేట్రాన్ని జింబాబ్వే టీం తో జరిగిన మ్యాచ్ తో చేసారు.
ఆ తరవాత జరిగిన 2010 ఆసియ కప్ లో మరియు న్యూజిలాండ్ మరియు శ్రీలంక తో జరిగిన ట్రై సిరీస్ లో కూడా సరిగా ఆడలేకపోయారు.
కోహ్లీ ఫార్మ్ లో లేకున్నా ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో సెలెక్ట్ చేసారు. ఈ సిరీస్ లో కోహ్లీ తన మూడవ సెంచరీ ను పూర్తి చేసారు.
ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో కూడా సెంచరీ చేసి నాలగవ ODI సెంచరీ ను తన ఖాతా లో వేసుకున్నారు.
కోహ్లీ యొక్క ఆట ఆడిన తీరు కోహ్లీ యొక్క స్థానాన్ని ఇండియా టీం లో సురక్షితం చేసింది.
2011 లో జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా మంచి ఆటను ప్రదర్శించి ICC ర్యాంకింగ్స్ లో రెండవ స్థానంలో నిలిచారు.
2011 లో జరిగిన వరల్డ్ కప్ లో 5 వ ODI సెంచరీ చేసి, వరల్డ్ కప్ లో అరంగేట్రంలో సెంచరీ చేసిన మొదటి భారత బ్యాట్స్ మ్యాన్ గా నిలిచారు.
2011 లోనే కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసారు. ఈ సిరీస్ లో కోహ్లీ పెద్దగా స్కోర్ చేయలేకపోయారు.
తరవాత జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ పేరు లేకున్నా, యువరాజ్ సింగ్ కు గాయమైన కారణంగా కోహ్లీ కి అవకాశం దక్కింది.
ఆ సిరీస్ లో కోహ్లీ కి బ్యాటింగ్ అవకాశం దొరకక పోయిన తరవాత జరిగిన ODI సిరీస్ లో కోహ్లీ తన ఆరవ ODI సెంచరీ ను చేసారు.
2011 లో టెస్ట్ ఆడటానికి ఇండియా టీం ఆస్ట్రేలియా టూర్ చేసింది.మొదటి రెండు మ్యాచ్ లలో కోహ్లీ సరిగా ఆడలేక పోయారు. ఈ సిరీస్ లో బౌండరీ దగ్గర నిల్చున్న కోహ్లీ ని కొందరు జనాలు అనరాని మాటలు అనటం వల్ల కోపం తో కోహ్లీ జనాలకు మిడిల్ ఫింగర్ చూపించారు.
కోహ్లీ తన కెరీర్ లో రికార్డులను సొంతం చేసుకుంటూ ముందుకు సాగారు. తరవాత భారత జట్టు కెప్టెన్ గా కూడా ఎన్నుకోబడ్డారు.
2021 లో T20 మరియు ODI కెప్టెన్సీ నుంచి మరియు 2022 లో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు.
వ్యక్తిగత జీవితం :
కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను 11 డిసెంబర్ 2017 వ సంవత్సరంలో ఇటలీ లో చేసుకున్నారు.
ఈ దంపతులకు 2021వ సంవత్సరంలో పాప పుట్టింది.
Source: Virat Kohli – Wikipedia