DLS మెథడ్ అంటే ఏమిటి – What is DLS method in Telugu?

DLS మెథడ్ ను డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి (DLS) అని అంటారు. 

క్రికెట్ మ్యాచ్ లను ఆడేటప్పుడు వర్షం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోయినప్పుడు గణిత సూత్రాలను ఉపయోగించి టోటల్ స్కోర్ లో లేదా ఓవర్ లలో మార్పులు చేస్తారు. 

 ఈ పద్ధతిని ఫ్రాంక్ డక్‌వర్త్ మరియు టోనీ లూయిస్ అనే  గణాంకవేత్తలు (statisticians) రూపొందించారు. ఆ సమయంలో ఈ పద్దతిని డక్‌వర్త్-లూయిస్ పద్ధతి (D/L) అని అనేవారు. 

1997 వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన తరువాత ఈ పద్దతిని ICC అధికారికంగా ఈ అమలు చేయటానికి ఒప్పుకుంది. 

డక్‌వర్త్ మరియు లూయిస్ యొక్క పదవి విరమణ తరవాత ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ ఈ మెథడ్ యొక్క భాద్యతలను చేపట్టారు.   

స్టీవెన్ స్టెర్న్ నవంబర్ 2014 వ సంవత్సరంలో ఈ మెథడ్ యొక్క పేరును D/L నుంచి DLS గా మార్చారు. ఈ పేరు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. 

ఇలా ఈ మెథడ్ ను రూపొందించిన మరియు మార్పులు చేసిన వారి పేర్ల  మీదగానే నామకరణం చేసారు.    

Average Run Rate method:

ఈ పద్దతిని 1950లలో ప్రారంభించారు. ఈ పద్ధతిలో స్కోర్ ను ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన టీం యొక్క రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. 

ARR మెథడ్ ను ఒక ఫార్ములా ద్వారా నిర్ణయిస్తారు. 

టీమ్ 2 టార్గెట్ = (టీం 1 సగటు రన్ రేట్ * టీం 2 వద్ద ఉన్న ఓవర్లు )+1 

ఉదాహరణకి టీం 1 50 ఓవర్లలో 250 పరుగులు చేసింది, టీం 1 యొక్క సగటు ఒక ఓవర్ కి 5 పరుగులు. వర్షం పడటం కారణంగా టీం 2 ఆడబోయే ఓవర్లు 25 అయ్యాయి.

పై ఫార్ములా ప్రకారం రెండో టీం స్కోర్ = (5*25) +1; 126 పరుగులు అవుతాయి. 

ఈ పద్దతి లో చాలా లొసుగులు ఉన్నాయి 

1)తక్కువ ఓవర్లు ఉండటం కారణంగా టీం 2 సులువుగా తమ యొక్క రన్ రేట్ ను చేరవచ్చు. 

2) ఈ పద్దతిలో వికెట్లను పరిగణలోకి తీసుకోరు, అందుకే ఈ పద్దతి టీం 2 కి అనుకూలంగా  ఉంటుంది. 

3)టీం 1 ఆడేటప్పుడు వర్షం పడి తగ్గిన ఓవర్లకు ఎలాంటి పరిహారం ఉండక పోయేది. ఎందుకంటే టీం 1 కి వర్షం పడి ఓవర్లు తగ్గుతాయని విషయం తెలియదు. ఇంకా ఓవర్లు ఉన్నాయని నెమ్మదిగా ఆడుతారు.     

4) టీం 2 ఆడేటప్పుడు వర్షం పడిన సందర్భాలలో, ఆ సమయంలో ఉన్న మ్యాచ్ పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోలేక పోయేవారు.  

ARR పద్దతి ద్వారా జరిగిన ప్రముఖ మ్యాచులు: 

1987వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. 

వర్షం కారణంగా రెండవ ఇన్నింగ్స్ ఆలస్యం అయ్యినప్పుడు ARR మెథడ్  ద్వారా శ్రీలంక ఓవర్లను 45 కి తగ్గించారు. శ్రీలంక టీం యొక్క టార్గెట్ ను 267 (296 x 45/50 = 266.4) గా నిర్ణయించారు.  శ్రీలంక ఈ మ్యాచ్ లో 158-8 పరుగులను చేసింది. 

ఆ సమయంలో DLS పద్దతిని ఉపయోగించినట్లయితే శ్రీలంక స్కోర్ 282 పరుగులు ఉండేది. 

1988-89లో  జరిగిన ఆస్ట్రేలియా ట్రై సిరీస్ లో వర్షం పడటం కారణంగా ఆస్ట్రేలియా 38 ఓవర్లలో 226 పరుగులు చేసింది. 

వెస్ట్ ఇండీస్ 31.2 ఓవర్లలో 180 పరుగులు చేయాలి. రెండవ ఇన్నింగ్స్ ను ఆడుతున్న వెస్ ఇండీస్ టీం 6.4 ఓవర్లలో 47−2 పరుగులు చేసింది. 

వర్షం పడటం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. వర్షం ఆగిన తరవాత ARR మెథడ్ ద్వారా 18 ఓవర్లలో 108 (226 x 18/38 = 107.1) పరుగులు చేయాలి అని నిర్ణయించబడింది.  

వెస్ట్ ఇండీస్ ఇంతకుముందే 47 పరుగులు చేసింది కాబట్టి వెస్ట్ ఇండీస్ టార్గెట్ 11.2 ఓవర్లలో 61 పరుగులు చేయాలి. 

వెస్ట్ ఇండీస్ టీం 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసి సులువుగా ఈ టార్గెట్ ను పూర్తి చేసింది.   

ఇదే మ్యాచ్ ను DLS మెథడ్ ద్వారా నిర్ధారిస్తే 61 కి బదులు 139 పరుగుల లక్ష్యం ఉండేది. 

ఈ పద్దతిలో ఉన్న లొసుగులను అధిగమించటానికి చూసారు కానీ అంతగా ప్రభావం చూపలేదు.  ఆస్ట్రేలియా వెస్ట్ ఇండియా చేతిలో ఓడిపోయిన తరవాత ఈ పద్దతిని Most Productive Overs method తో మార్చారు. 

ఈ పద్దతిలో ఉన్న లొసుగులను అధిగమించటానికి చూసారు కానీ అంతగా  ప్రభావం చూపలేదు. వెస్ట్ ఇండియా చేతిలో ఓడిపోయిన తరవాత ఈ పద్దతిని Most Productive Overs method తో మార్చారు. 

 Most Productive Overs method:

ఈ పద్దతి 1991 లో ఆస్ట్రేలియా ద్వారా రోపొందించబడింది. ఈ పద్దతి లో రన్ రేట్ ను కాకుండా మంచిగా ఆడిన ఓవర్లను పరిగణలోకి తీసుకునేవారు.   

ఈ పద్దతిలో కూడా ఒక ఫార్ములా ద్వారా స్కోర్ ను నిర్ణయిస్తారు. టీం 2 యొక్క టార్గెట్ ను టీం 1 ఎక్కువ పరుగులు చేసిన ఓవర్ల  ఆధారంగా నిర్ణయించేవారు. 

Team 2’s new target from their total of X overs = Runs scored by Team 1 in their highest-scoring X overs+1

మొదటి పద్దతి టీం 2 ను సపోర్ట్ చేసే రెండవ పద్దతి టీం 1 కి సపోర్ట్ చేస్తుంది.      ఈ పద్దతి లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి  

1)ఈ పద్దతిలో టీం 2 వేసిన మంచి ఓవర్లను పట్టించుకోలేదు. 

2)ఈ పద్దతిలో కూడా వికెట్లను పరిగణలోకి తీసుకోలేదు.

3)MPO పద్దతిలో కేవలం మంచిగా ఆడిన ఓవర్లను పరిగణలోకి తీసుకోవటం వల్ల రెండవ టీం వేసిన మైడెన్ ఓవర్లను పరిగణలోకి తీసుకోలేదు.  

ఇలా ఈ రెండు పద్ధతులు కూడా ఫెయిల్ అయ్యాయి.    

1992 లో జరిగిన వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా సెమీ ఫైనల్ ఆడుతున్న సమయంలో వర్షం పడింది.

12 నిమిషాల పాటు పడ్డ వర్షం పడటం వల్ల రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఆగిపోయింది.

మ్యాచ్ గెలవటానికి సౌత్ ఆఫ్రికా 13 బంతులలో 22 పరుగులు చేయాలి. వర్షం ఆగిన తరవాత MPO పద్దతి ద్వారా 1 బంతిలో 21 పరుగులు చెయ్యాలి.

1 బంతిలో 21 పరుగులు చేయటం అసంభవం ఎందుకంటే 1 బంతిలో గరిష్టంగా చేయగలిగే పరుగులు 6.

ఇదే మ్యాచ్ స్కోర్ ఒకవేళ D/L మెథడ్ ద్వారా నిర్ణయిస్తే 1బంతి లో 5 పరుగులు చేయాలి.

ఈమ్యాచ్ తరువాత MPO పద్దతి కూడా సరైనది అని తెలుసుకొని, బ్రిటిష్ గణాంకవేత్తలు (statisticians) ఫ్రాంక్ డక్‌వర్త్ మరియు టోనీ లూయిస్ లు రూపొందించారు.

1999 లో మొదటిసారి ICC అధికారికంగా D/L మెథడ్ ను గుర్తించింది.

D/L Method:

ఈ పద్దతి లో ముఖ్యంగా ఓవర్లను మరియు వికెట్లను పరిగణలోకి తీసుకుంటారు. ఈ రెండింటిని కలిపి రిసోర్సెస్ (వనరులు) అని అంటారు.

కింద చూపిన టేబుల్ ప్రకారం ఒక టీం వద్ద ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో దాని ప్రకారం టార్గెట్ నిర్ధారణ జరుగుతుంది.

Source: By Chintan9 – Own work, CC BY-SA 3.0, https://commons.wikimedia.org/w/index.php?curid=30109107

Team 2’s par score = Team 2’s resources/Team 1’s resources

ఉదాహరణకి మొదటి టీం 50 ఓవర్లను మరియు 10 వికెట్లతో మ్యాచ్ ఆడినట్లైతే, టీం 1 100% రిసోర్సెస్ వినియోగించిందని అర్థం.

ఉదాహరణకి టీం 1 100% రిసోర్సెస్ ను వినియోగించి 254 పరుగులను చేసింది.

వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ లో అంతరాయం కలిగినప్పుడు టీం 2 యొక్క రిసోర్సెస్ ను టేబుల్ నుంచి తీసుకుంటారు.

ఉదాహరణకు టీం 2 వద్ద 90% రిసోర్సెస్ ఉన్నాయి. ఫార్ములా ప్రకారం

టీం 2 యొక్క స్కోర్ :

254 × 90% / 100% = 228.6 అవుతుంది. టీం 2 228 పరుగులు చేస్తే మ్యాచ్ డ్రా అవుతుంది అలాగే 229 పరుగులు చేస్తే టీం 2 మ్యాచ్ గెలుస్తుంది.

కేవలం ఫార్ములా అని కాకుండా దీని కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మ్యాచ్ యొక్క టార్గెట్ ను నిర్ధారిస్తారు. సామాన్య ప్రజలకు ఈ సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉండదు.

DLS:

2015వ సంవత్సరంలో గణాంకవేత్త అయిన ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ D/L మెథడ్ లో కొన్ని మార్పులు చేసారు.

ఫలితంగా ఈ మెథడ్ ను ముగ్గురు గణాంకవేత్తల పేరు మీదుగా డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్(DLS) అని పెట్టడం జరిగింది.

 

Source: Duckworth–Lewis–Stern method – Wikipedia

Leave a Comment