శకుంతలా దేవి భారతదేశానికి చెందిన ప్రముఖ మానవ గణన యంత్రం మరియు రచయిత. తనలో ఉన్న ప్రతిభ కారణంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ లో చోటును సంపాదించారు.
Table of Contents
బాల్యం :
శకుంతలా దేవి 4 నవంబర్ 1929వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరు నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
ఈమె తండ్రి సర్కస్ లో మెజీషన్ గా పనిచేసేవారు. చిన్న తనంలో తన మ్యాజిక్ లో భాగమైన ఒక కార్డు ట్రిక్ ను తన మూడు సంవత్సరాల కూతురికి చూపించినప్పుడు, కూతురిలో నంబర్లను గుర్తుపెట్టుకోగలిగే సామర్థ్యాన్ని కనుగొన్నారు.
శకుంతలా దేవి తండ్రి మ్యాజిక్ షో చేయటం మానేసి తన కూతురితో రోడ్ షోస్ చేసేవాడు. ఈ రోడ్ షోస్ లో తన కూతురి లెక్కలు చేయటంలో ఉన్న ట్యాలెంట్ ను చూపించేవాడు.
శకుంతలా దేవికి ఇది ఎవ్వరు కూడా నేర్పించలేదు, తాను ఎవరి దగ్గరికి వెళ్లి కూడా నేర్చుకోలేదు.
కేవలం 6 సంవత్సరాల వయస్సులో యూనివర్సిటీ అఫ్ మైసూర్ లో అరిథమెటిక్ లో తనకున్న ట్యాలెంట్ ను చూపించారు.
మెదడు ద్వారా గణన :
శకుంతలా దేవి వివిధ దేశాలకు ప్రయాణించి తన అరిథమెటిక్ ట్యాలెంట్ ను ప్రదర్శించేవారు. 1950వ సంవత్సరంలో యూరోప్ మరియు 1976వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో టూర్ ను చేసారు .
1988 వ సంవ్సతరంలో ఆర్థర్ జెన్సన్ అనే సైకాలజీ ప్రొఫెసర్ తనను అధ్యయనం చేస్తాను అన్నప్పుడు, అమెరికా లోని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా కు ప్రయాణం చేసారు.
ఆర్థర్ జెన్సన్ అడిగిన ప్రశ్నలకు శకుంతలా దేవి కొన్ని సెకన్లలో సమాధానం ఇచ్చారు. 61,629,875 యొక్క క్యూబ్ రూట్ మరియు 170,859,375 యొక్క ఏడవ రూట్ జెన్సన్ శకుంతలా దేవి ను అడిగారు.
జెన్సన్ తన పుస్తకంలో రాసే సమయంలోపే శకుంతలా దేవి 395 మరియు 15 అని జవాబు ఇచ్చారు.
జెన్సన్ దేవి గురించి 1990 వ సంవత్సరంలో ఇంటలిజెన్స్ అనే జర్నల్ లో రాసారు.
1977వ సంవత్సరంలో సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ లో 201 అంకెల సంఖ్య యొక్క 23rd root ను కేవలం 50 సెకన్లలో జవాబును ఇచ్చారు.
ఇదే ప్రశ్న ను కాలిక్యులేషన్ చేస్తున్న కంప్యూటర్ ఎక్కువ సమయం తీసుకుంది.
1980 వ సంవత్సరంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ లో 13 సంఖ్యల గుణకారాన్ని (7,686,369,774,870 × 2,465,099,745,779) కేవలం 20 సెకన్లలో చేసారు. ఈ సంఖ్యలను అక్కడున్న వారి నుంచి అడిగి తీసుకున్నారు.
శకుంతల దేవి గుణకారం యొక్క జవాబు 18,947,668,177,995,426,462,773,730 అని కరెక్ట్ గా చెప్పారు.
1977 వ సంవత్సరంలో The World of Homosexuals అనే పుస్తకాన్ని భారతదేశంలోని స్వలింగసంపర్కం పై రాసారు. ఫలితంగా విమర్శలను ఎదుర్కొన్నారు.
వ్యక్తిగత జీవితం :
1960లలో ఇండియా కు వచ్చిన దేవి IAS ఆఫీసర్ అయిన పరితోష్ బెనర్జీను పెళ్లి చేసుకున్నారు.
1979 వ సంవత్సరంలో ఈ దంపతులు విడాకులు తీసుకొని విడిపోయారు.
1980 సంవత్సరంలో లోక్ సభ ఎన్నికలలో ముంబై సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
మరణం :
13 ఏప్రిల్ 2013 వ సంవత్సరంలో తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న శకుంతలా దేవి బెంగళూర్ లోని హాస్పిటల్ లో చేరారు. కిడ్నీ మరియు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ 21 ఏప్రిల్ 2013వ సంవత్సరం, 83 సంవత్సరాల వయస్సులో హాస్పిటల్ లో చనిపోయారు.
2019 సంవత్సరంలో Shakuntala Devi అనే పేరుతో ఒక సినిమాను తీసారు.
Source: Shakuntala Devi – Wikipedia