తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నవంబర్ 3 వ తారీకు నుంచి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే పేరుతో హెల్త్ డ్రైవ్ ను మొదలుపెడుతున్నారు.
ఈ డ్రైవ్ మొత్తం నెల రోజుల వరకు కొనసాగుతుంది. మొత్తం 50 వేల TSRTC ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించటం జరగబోతుంది.
TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ మాట్లాడుతూ, సంస్థ యొక్క బలం తమ ఉద్యోగుల ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
బస్ భవన్ లో నెల రోజుల రోడ్ మ్యాప్ ఆవిష్కరిస్తూ, ప్రతి ఉద్యోగి ఈ డ్రైవ్ లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
తార్నాక హాస్పిటల్ కేంద్రంగా 98 లేదా అంత కంటే ఎక్కువ స్థానాలలో ఈ డ్రైవ్ ఉండబోతుంది.
ఈ డ్రైవ్ లో హెల్త్ ప్రొఫైల్, రోగ నిర్దారణ పరీక్షలతో పాటు ప్రతి ఉద్యోగి కి ప్రత్యేక కన్సల్టేషన్ సదుపాయం కలిపిస్తారు.
ప్రతి రోజు దాదాపు 1800 మంది ఈ డ్రైవ్ లో పాల్గొన బోతున్నారు. ప్రతి సెంటర్ లో 10 మంది ఆరోగ్య సిబ్బంది ఉంటారు.
TSRTC ఉద్యోగుల ఆరోగ్యం కోసం step-monitoring app సదుపాయం కలిగించబోతున్నారు. ఈ ఆప్ ద్వారా రోజులు ఎన్ని అడుగులు నడిచారో తెలుసుకోవచ్చు.
ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ప్రస్తుతం రోజుకు 2,000 అడుగులు నడవాలి అని తరవాత దీనిని 10,000 అడుగుల వరకు పెంచాలని అని అన్నారు.
మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఈ హెల్త్ డ్రైవ్ ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మరియు టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చొరవ మేరకు ప్రారంభించారు అని చెప్పారు.
Source:1) TSRTC launches ‘Grand Health Challenge’ for its employees (thehansindia.com) 2) Telangana: TSRTC launches ‘Grand Health Challenge’ for its employees (siasat.com)