ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఆరవ చక్రవర్తి. ఈయనకు ఆలంగీర్ (ప్రపంచాన్ని జయించేవాడు) అనే బిరుదు కూడా ఉంది.
ఔరంగజేబు పాలనలో మొఘల్ సామ్రాజ్యం ఎక్కువగా విస్తరించింది. దాదాపు దక్షిణ ఆసియా మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరించారు.
Table of Contents
బాల్యం :
ఔరంగజేబు నవంబర్ 3 1618వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయిన షాజహాన్ మరియు రాణి ముంతాజ్ మహల్ కి జన్మించారు. ఈయన పుట్టినప్పుడు తాత మరియు మొఘల్ సామ్రాజ్య నాల్గవ చక్రవర్తి జహంగీర్ రాజు గా ఉన్నారు.
చక్రవర్తి జహంగీర్ చనిపోయిన తరవాత షాజహాన్ మొఘల్ సింహాసన వారసత్వం కోసం పోరాడి రాజు అయ్యారు. తండ్రి రాజు అయ్యిన తరవాత ఔరంగజేబు ఆగ్రాలో తన తండ్రితో పాటు చేరారు.
ఔరంగజేబు రాచరిక విద్యలు అయిన యుద్ధ విద్య, పోరాట శిక్షణ మరియు పాలక వ్యవస్థలను చదివారు. వీటితో పాటు ఇస్లామిక్ అధ్యయనాలను కూడా చదివారు.
28 మే 1633లో, 15 సంవత్సరాల ఔరంగజేబు పై ఒక యుద్ధ ఏనుగు దాడి చేసినప్పుడు కత్తితో పోరాడి ఏనుగును తొండాన్ని గాయపరిచి ప్రాణాలను కాపాడుకున్నారు.
తండ్రి షాజహాన్ ఔరంగజేబు యొక్క సూర్యాని మెచ్చుకొని బహదూర్ అనే బిరుదును ఇచ్చారు.
పరిపాలన:
బుందేల్ ఖండ్ యొక్క రాజు ఝుఝర్ సింగ్ షాజహాన్ యొక్క భూభాగం పై దాడి చేసారు. తాను చేస్తున్న దాడుల నుంచి వెనుతిరగడానికి కూడా నిరాకరించారు.
ఝుఝర్ సింగ్ రాజును ఓడించటానికి ఔరంగజేబు నామ మాత్రపు బాద్యతలను తీసుకొని బుందేల్ ఖండ్ పై దాడి చేసి ముట్టడించారు.
ఈ యుద్ధం ఔరంగజేబు గెలిచి ఝుఝర్ సింగ్ రాజును గద్దె దించారు.
దక్కన్ వైస్రాయ్ :
1636వ సంవత్సరంలో ఔరంగజేబు డెక్కన్ యొక్క వైస్రాయ్ గా నియమించబడ్డారు. అదే సమయంలో నిజాం షాహీ రాజ్యానికి చెందిన యువరాజు ముర్తజా షాహ్ III, తన రాజ్యాన్ని విస్తరిస్తూ షాజహాన్ అధీనంలో ఉన్న ప్రాంతాలను నాశనం చేసాడు.
షాజహాన్ తన కొడుకు ఔరంగజేబు ను పంపగా నిజాం షాహీ రాజ్యాన్నే అంతమొందించారు.
1637 వ సంవత్సరంలో ఔరంగజేబు ను ఒక చిన్న రాజపూత్ రాజ్యం బాగ్లనా వైపు పంపగా, సులువుగా ఆ రాజ్యాన్ని ముఘల్ రాజ్యం లో కలుపుకున్నారు.
1644 వ సంవత్సరంలో ఆగ్రా లో ఉన్న ఔరంగజేబు సోదరి జహానారా, తన పెర్ఫ్యూమ్ లో ఉన్న కెమికల్స్ దగ్గరలో ఉన్న దీపం ద్వారా మండటంతో కాలిపోయింది.
షాజహాన్ స్వయంగా తన కూతురు యొక్క ఆరోగ్యాన్ని చూసుకున్నాడు. ఆ సమయంలో షాజహాన్ అధీనంలో ఉన్న రాజ్యాల నుంచి చాలా మంది బాగోగులు తెలుసుకోవటానికి వచ్చారు.
విషయం తెలుసుకున్న ఔరంగజేబు వెంటనే ఆగ్రా కి రాకుండా మూడువారాల తరవాత వచ్చారు. ఈ విషయం షాజహాన్ కి నచ్చలేదు మరియు అసహనానికి గురి చేసింది.
పైగా ఔరంగజేబు సైనిక వేషధారణలో రాజా భవనంలోనికి రావటం చూసి ఔరంగజేబు ను డెక్కన్ వైస్రాయ్ పదవి నుంచి తొలగించాడు.
ఇంకొందరి చరిత్రకారుల ప్రకారం ఔరంగజేబు విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సాదా సీద ఫకీరు లాగ వేషధారణ చేయటం చూసి నచ్చక షాజహాన్ పదవి నుంచి తొలగించారని చెబుతారు.
1645 వ సంవత్సరంలో ఏడు నెలలు కోర్టు నుంచి కూడా బహిష్కరించబడ్డాడు. మిగతా ముఘల్ కమాండర్లతో తన బాధను చెప్పుకున్నాడు.
తరవాత షాజహాన్ ఔరంగజేబు ను గుజరాత్ యొక్క గవర్నర్ గా నియమించారు. తన పాలన మొదలైన తరవాత మత కల్లోలాలు జరిగాయి. కానీ కొంతకాలంలో అక్కడి పరిస్తుతులను సరి దిద్దారు.
1647 వ సంవత్సరంలో షాజహాన్ చిన్న కొడుకు మురాద్ బక్ష్ ఆఫ్గనిస్తాన్ లో పనికి రాడని, ఔరంగజేబు ను మురాద్ బక్ష్ స్థానంలో ఆఫ్గనిస్తాన్ లోని బాల్ఖ్ కు గవర్నర్ గా నియమించబడ్డారు.
ఆ సమయంలో ఆ ప్రాంతం ఉజ్బెక్ మరియు తుర్క్‌మెన్ తెగల దాడిలో ఉంది. మొఘల్ సామ్రాజ్యం వద్ద ఆయుధాలు ఉన్నా ప్రత్యర్థ సైన్యం కూడా చాలా బలమైనది. అక్కడి మంచు వాతావరణం కూడా సహకరించకపోవటం వల్ల ఉజ్బెక్ తెగ వారితో అసంతృప్తికర ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
మొఘల్ సార్వభౌమత్వాన్ని నామ మాత్రంగా గుర్తించడానికి బదులుగా ఆ భూభాగాన్ని వదులుకున్నారు.
రెండు సంవత్సరాల వ్యవధి లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అయినా ఫలితం మాత్రం దక్కలేదు.
తరవాత ఔరంగజేబు ముల్తాన్ మరియు సింధ్ ప్రాంతానికి గవర్నర్ గా నియమించబడ్డారు. 1649 మరియు 1652 సంవత్సరాలలో సఫావిడ్ సామ్రాజ్య అధీనంలో ఉన్న ఆఫ్గనిస్తాన్ కు చెందిన కాందహార్ ను తమ ఆధీనంలోకి తీసుకోవటానికి ప్రయత్నించారు.
కాందహార్ 10 సంవత్సరాల పాటు మొఘల్ సామ్రాజ్య అధీకారంలో ఉన్న తరవాత సఫావిడ్ సామ్రాజ్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. శీతాకాలం రావటంతో చివరికి మొఘల్ సామ్రాజ్యానికి నిరాశే లభించింది.
1653 వ సంవత్సరంలో షాజహాన్ పెద్దకొడుకు దారా షికో మూడో సారి ప్రయత్నించాడు కానీ ఫలితం లభించలేదు.
ఔరంగజేబు తిరిగి తన అన్న దారా షికో స్థానంలో డెక్కన్ యొక్క వైస్రాయ్ గా నియమించబడ్డారు. అన్న తన సొంత అవసరాల కోసం పరిస్తుతులను వాడుకుంటున్నాడని తెలుసుకున్నాడు.
ఆ సమయంలో డెక్కన్ పేద ప్రాంతం కావటంతో పాలన చేయటానికి మాల్వా మరియు గుజరాత్ నుంచి సహాయం తీసుకునేవారు.
ఇది గమనించిన షాజహాన్ నిరాశకు గురయ్యాడు. తన కొడుకును వ్యవసాయం పై దృష్టి సారించాలని పట్టుబట్టారు.
ఔరంగజేబు ముర్షిద్ ఖులీ ఖాన్ ను ఉత్తరంలో చేస్తున్న విధంగా సాగు పై పన్నులు వసూలు చేయాలనీ ఆదేశించారు.
విత్తనాలకు, పశువులకు, మౌలిక సదుపాయాలకు మరియు నీటి పారుదలకు లోన్లు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇలా చేసిన తరవాత డెక్కన్ ప్రాంతం పూర్వ వైభవం దక్కించుకుంది.
ఔరంగజేబు గోల్కొండ మరియు బీజాపూర్ ప్రాంతాలను కూడా తన అధీనంలో తీసుకోవాలని యుద్ధం చేసారు. సరిగ్గా గెలిచే సమయానికి అన్న దారా షికో మాటలు విని షాజహాన్ ప్రత్యర్థులతో సంధి జరపాలని నిర్ణయించారు.
వారసత్వ పోరు :
షాజహాన్ యొక్క నలుగురు కొడుకులు కూడా గవర్నర్ లుగా భాద్యతలు చేపట్టారు. రాజు మాత్రం పెద్ద కొడుకు అయిన దారా షికో ను తన తర్వాత రాజుగా ఎన్నుకోవాలనుకున్నారు.
ఈ విషయం విన్న మిగతా ముగ్గురు కుమారులకు కోపం వచ్చింది. మొఘల్ సామ్రాజ్యంలో మిగతా సామ్రాజ్యాల లాగా పెద్ద కొడుకునే రాజు ను చేయాలనే ఆచారం లేదా నియమం లేదు.
మొదట నలుగురి మధ్య మొదలైన వారసత్వ పోరు ఔరంగజేబు మరియు దారా షికో మధ్య వచ్చి ఆగింది. దీనికి గల కారణం సామ్రాజ్యం లోని ప్రముఖులు ఈ ఇద్దరికే మద్దతు తెలిపారు.
దారా షికో అక్బర్ రాజు లాగా ఉదారవాది (liberal) మరోవైపు ఔరంగజేబు సంప్రదాయ వాది (conservative).
షాజహాన్ తన తరవాత రాజు దారా షికో అని ప్రకటించిన తరవాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
బయటి ప్రపంచానికి మాత్రం షాజహాన్ రాజు చనిపోయారు అని పుకార్లు వ్యాపించాయి. ఫలితంగా షాజహాన్ యొక్క మిగతా కుమారులు తమ తమ ప్రాంతాల నుంచి తానే మొఘల్ సామ్రాజ్య రాజు అని ప్రకటించుకున్నారు.
షాజహాన్ రెండవ కుమారుడు షాహ్ షుజా తానే మోఘల్ సామ్రాజ్యానికి రాజు అని ప్రకటించి సైన్యంతో ఆగ్రా వైపు పయనమయ్యారు.
వారణాసి వద్ద షాహ్ షుజా సైన్యాన్ని ఎదుర్కోవడానికి దారా షికో కొడుకు సులైమాన్ షుకో మరియు రాజా జై సింగ్ ఢిల్లీ నుంచి బయలు దేరారు.
మరోవైపు అందరికంటే చిన్న కుమారుడు మురాద్ బక్ష్ కూడా తానే రాజు అని ప్రకటించాడు.
షాజహాన్ ఆరోగ్యం మెరుగైన తరవాత పెద్ద కొడుకు దారా షికో జరిగిన సంగతి చెప్పి షాహ్ షుజా మరియు మురాద్ బక్ష్ ను ఎదుర్కోవటానికి సైన్యాన్ని పంపించాలని కోరారు.
1658 వ సంవత్సరంలో బనారస్ వద్ద షాహ్ షుజా ఓడిపోయాడు. ఇక చిన్న కుమారుడు మురాద్ బక్ష్ తో పోరాడటానికి పంపించిన సైన్యం అక్కడికి చేరి ఆశ్చర్యానికి గురయ్యింది.
అక్కడ మురాద్ బక్ష్ తో పాటు ఔరంగజేబు కూడా తన సైన్యం తో కలిసి ఉన్నారు. ఈ ఇద్దరు సోదరులు యుద్ధం తరవాత మొఘల్ సామ్రాజ్యాన్ని చెరీ సగం పంచుకోవాలని పథకం వేసారు.
1658 వ సంవత్సరంలో ధర్మాత్ (Dharmat) వద్ద రెండు సైన్యాలు తలపడ్డాయి.
వారసత్వం కోసం సోదరులలో జరిగిన సముగర్ యుద్ధంలో ఔరంగజేబు గెలిచారు. యుద్ధం గెలిచిన తరవాత తండ్రి మరియు రాజు అయిన షాజహాన్ ను నిర్బంధించారు.
మరోవైపు తమ్ముడు మురాద్ కి సగం సామ్రాజ్యం ఇస్తానని అన్న ఔరంగజేబు ఇవ్వటానికి నిరాకరించాడు. మొత్తం సామ్రాజ్యానికి తానే రాజు అని చెప్పి మురాద్ ను నిర్బంధించి 4 డిసెంబర్ 1661 వ సంవత్సరంలో ఉరి తీసారు. మురాద్ గుజరాత్ యొక్క దివాన్ ను చంపినందుకు షరియా చట్టం ప్రకారం ఔరంగజేబు మురాద్ ను ఉరి తీసారు.
షాజహాన్ రెండవ కొడుకు అయిన షాహ్ షుజా ను బెంగాల్ గవర్నర్ చేస్తాను అని ఔరంగజేబు అనగా, షాహ్ షుజా మాత్రం తానే రాజు అని ప్రకటించాడు.
ఇది చూసిన ఔరంగజేబు సేన తో వెళ్లి షాహ్ షుజా ను ఓడించారు. షాహ్ షుజా అర్కాన్ ఇప్పటి బర్మా కి పారిపోయాడు. అక్కడి రాజులు షాహ్ షుజా ను ఉరి తీసారు.
ఔరంగజేబు తో యుద్ధం ఓడిపోయిన దారా షికో ఇతర సామ్రాజ్యాలతో కలిసి ఔరంగజేబు సైన్యంతో యుద్ధం చేయసాగాడు.
దారా షికో ఇక ఇస్లాం మతం లో లేడని మరియు మొఘల్ సామ్రాజ్య ముఖ్య అధికారిని విషం ఇచ్చి చంపేసాడని రుజువు అయిన తరవాత దారా షికో ను కూడా తన అనుచరుల తో చంపించేసాడు.
మరణం :
ఔరంగజేబు 3 మార్చి 1707 వ సంవత్సరంలో, 88 సంవత్సరాల వయస్సులో అహ్మద్ నగర్ దగ్గరలో భింగర్ లో సైనిక శిబిరంలో చనిపోయారు.
Source: Aurangzeb – Wikipedia