నో నట్ నవంబర్ (No Nut November) అనేది 2010వ సంవత్సరంలో మొదలైన ఒక ఇంటర్నెట్ ఛాలెంజ్.
2017వ సంవత్సరంలో సోషల్ మీడియా ద్వారా ఈ ఛాలెంజ్ కి పబ్లిసిటీ లభించింది.
నో నట్ నవంబర్ అంటే ఏమిటి ?
నో నట్ నవంబర్ అంటే ఒక నెల మొత్తం శృంగారానికి దూరంగా ఉండటాన్ని అంటారు.
ఇంగ్లీష్ భాష యొక్క యాసలో శృంగారానికి బదులు NUT అనే పదాన్నివినియోగిస్తున్నారు.
ఈ ఛాలెంజ్ లో పాల్గొనే వారు నవంబర్ నెల మొత్తం 30 రోజులు, స్వయం తృప్తి లేదా శృంగారం లో పాల్గొనకూడదు. ఒక్కసారి అయిన ఛాలెంజ్ తప్పితే ఛాలెంజ్ నుంచి అవుట్ అయినట్లే.
ఈ ఛాలెంజ్ ను ఎవ్వరు కూడా నిర్వహించరు తమకు తాము స్వతహాగా చేసే ఛాలెంజ్.
ఈ ఛాలెంజ్ మొదలైనప్పుడు పాల్గొన్న వారు ఎదో కామెడీ కోసం మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా అనుకోకుండా పాపులర్ అయ్యింది.
ముందుగా ఈ ఛాలెంజ్ ను ప్రారంభించిన వారు నీలి చిత్రాల నుంచి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది అని చెప్పారు.
డిసెంబర్ (Not Recommended*):
నో నట్ నవంబర్ లో గెలిచిన వారు డిసెంబర్ లో ఇష్టమైనంత స్వయంతృప్తి మరియు శృంగారంలో పాల్గొన వచ్చని అంటారు.
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో మరియు ట్విట్టర్ లో ఈ ఛాలెంజ్ గురించి చాలా పోస్టులు కనిపిస్తున్నాయి.
గమనిక : ఈ ఆర్టికల్ లో ఇచ్చిన సమాచారం కేవలం మీకు ఈ విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే. ఈ వెబ్ సైట్ ఎలాంటి ప్రకారమైన ఛాలెంజ్ లను ప్రోత్సహించదు.
Source: No Nut November – Wikipedia