చిల్డ్రన్స్ డే లేదా బాలల దినోత్సవంను ఇండియా లో ప్రతి సంవత్సరం జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు అయిన నవంబర్ 14 రోజున జరుపుకుంటారు.
ఈ రోజును పిల్లల హక్కులను, విద్య మరియు పిల్లల సంక్షేమం గురించి అవహగాన పెంచడానికి జరుపుకుంటారు.
చరిత్ర :
బాలల దినోత్సవం ను మొట్ట మొదటి సారిగా ఫ్లవర్ డే (Flower Day) గా 5 వ నవంబర్ 1948 సంవత్సరంలో జరుపుకున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW) కంటే ముందు ఉండే సంస్థ, United Nations Appeal for Children (UNAC) కోసం నిధులను సమకూర్చడానికి ఫ్లవర్ డే ను జరిపేవారు.
30 జులై, 1949 సంవత్సరంలో విస్తృతంగా చిల్డ్రన్స్ డే ను జరుపుకున్నారు. రేడియో, సినిమాలలో మరియు వార్త పత్రికలలో చర్చ జరగటం మొదలయ్యింది.
1951లో యునైటెడ్ నేషన్స్ సోషల్ వెల్ఫేర్ సభ్యుడు అయిన V. M. కులకర్ణి, యునైటెడ్ కింగ్డమ్ లో బాల్య నేరస్థుల పునరావాసంపై అధ్యయనం చేస్తున్నప్పుడు భారతదేశంలోని నిరుపేద పిల్లలను చూసుకునే వ్యవస్థ లేదని గ్రహించారు.
యునైటెడ్ కింగ్డమ్ లో క్వీన్ ఎలిజబెత్ II పుట్టిన రోజున “Save the Child Fund” అనే పేరు తో డబ్బు ను సేకరించేవారు.
Save the Child Fund నుంచి ప్రేరణ పొందిన కులకర్ణి భారతదేశంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజును ఫ్లాగ్ డే గా జరుపుకొని, చిన్న పిల్లల కోసం పనిచేసే NGO లు డబ్బులు సేకరించాలని అనుకున్నారు.
దీనికోసం నెహ్రు అనుమతి కోరగా ముందు ఇబ్బంది పడ్డారు, తరవాత అయిష్టంగానే ఒప్పుకున్నారు.
స్వాతంత్రం వచ్చిన తరవాత 1947 సంవత్సరం నుంచి నెహ్రు పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేవారు. పుట్టిన రోజు సందర్భంగా బహిరంగ సభలు మరియు పిల్లలకు ఆటలు నిర్వహించేవారు.
1954 వ సంవత్సరంలో మొదటిసారి నెహ్రు పుట్టిన రోజును బాలల దినోత్సవం (Children’s Day) గా జరుపుకోవటం మొదలుపెట్టారు.
1957 వ సంవత్సరంలో అధికారికంగా 14 నవంబర్ ను Children’s Day గా ప్రకటించారు.
పిల్లల పట్ల నెహ్రు అభిప్రాయం :
జవహర్‌లాల్ నెహ్రూను పిల్లలు చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకునేవారు. తనపై పిల్లలకు ఉన్న విశ్వాసం చాలా ఆనందాన్ని కలిగించేది.
1955 లో Children’s Film Society India ను నెహ్రు స్థాపించారు. నెహ్రు ప్రైవేట్ సెక్రటరీ M. O. మతై తాను రాసిన పుస్తకం My Days with Nehru లో ” జవహర్ లాల్ నెహ్రు పిల్లల అమాయకపు ముఖాలలో మరియు మెరిసే కళ్ళలో భారత దేశ భవిష్యత్తును చూసారు. పిల్లలు మరియు వారి తల్లులపై ఖర్చు చేసే డబ్బు ఎక్కువ కాదు, ఇది ఒక మంచి పెట్టుబడి అని నెహ్రు చెప్పేవారు” అని రాసారు.
1958 వ సంవత్సరంలో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” నేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారని మరియు మనం వారిని పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని నేను ఎప్పుడూ భావించాను.” అని చెప్పారు.
2018 వ సంవత్సరంలో బీజేపీ కి చెందిన 60 మంది ఎంపీలు 26 వ డిసెంబర్ ను చిల్డ్రన్ డే గా నియమించాలని ప్రధాన మంత్రి మోడీ కి అభ్యర్థించారు.
డిసెంబర్ 26వ రోజున 10 వ సిక్కు మత గురువు అయిన గురు గోవింద్ సింగ్ యొక్క చిన్న కొడుకులను సజీవంగా ఉన్న సమయంలో ఇటుకలతో నాలుగు వైపుల గోడలు కట్టారు. ఇలా ఈ ఇద్దరు వీర మరణం పొందారు.