పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జీవిత చరిత్ర – Jawaharlal Nehru biography in Telugu

జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి చెందిన మొట్ట మొదటి ప్రధాని, స్వాతంత్ర పోరాట నాయకుడు, పండితుడు, చరిత్రకారుడు మరియు రచయిత. 

బాల్యం : 

జవహర్ లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889 సంవత్సరంలో బ్రిటిష్ రాజ్యంలో ఉన్న అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్ రాజ్) జిల్లాలో జన్మించారు. 

నెహ్రు మోతిలాల్ నెహ్రూ మరియు స్వరూప్ రాణి తుస్సు అనే దంపతులకు జన్మించారు. నెహ్రూ తండ్రి ఒక న్యాయవాది, నెహ్రు తల్లి తండ్రులు కాశ్మీర్ లోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు.       

ముగ్గురు తోబుట్టువులలో నెహ్రూ పెద్దవారు. ఈయనకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఒక చెల్లెలు విజయ లక్ష్మి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క మొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నారు.

 రెండవ చెల్లెలు కృష్ణ హుతీసింగ్ తన సోదరుడు నెహ్రూ పై పుస్తకాలు రాసి ప్రముఖ రచయిత్రి అయ్యింది.  

నెహ్రూ చిన్నతనం నుంచే ధనిక కుటుంబంలో పెరిగారు. తండ్రి నెహ్రూను ఇంటి వద్దనే ట్యూషన్ టీచర్ల ద్వారా చదువు చెప్పించే వారు.

చిన్న తనంలో తనకు పాఠాలు చెప్పే టీచర్ ద్వారా నెహ్రూకు సైన్స్ మరియు థియోసఫీ మతం పై చాలా ఆసక్తి ఉండేది. ఫ్యామిలి ఫ్రెండ్ అయిన అన్నీ బెసెంట్ సలహా మేరకు 13 సంవత్సరాల వయస్సులో థియోసాఫికల్ సొసైటీలో చేరారు.

టీచర్ నుంచి చదువు మానేసిన తరవాత థియోసాఫికల్ సొసైటీను కూడా వదిలేసారు.

థియోసఫీ మతం పై ఉన్న ఆసక్తి బౌద్ధ మరియు హిందూ గ్రంధాలను అధ్యయనం చేసేలా చేసింది.

ఈ మతాలను చదవటం వల్ల భారతదేశం యొక్క మతం మరియు సంస్కృతీ యొక్క మూలాలను తెలుసుకున్నారు.

ఇవే తరవాత నెహ్రూను The Discovery of India అనే పుస్తకం రాయటంలో సహాయపడ్డాయి.

అక్టోబర్ 1907 వ సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ చేయటానికి కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కాలేజీలో చేరారు. 1910 లో natural science నుంచి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.

కేంబ్రిడ్జ్ లో ఉన్న సమయంలో రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర మరియు సాహిత్యం గురించి చదివారు.

1912 లో ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత తన తండ్రి లాగా న్యాయవాది అవ్వాలనుకున్నారు కానీ రాజకీయాల మీద ఉన్న ఆసక్తి వల్ల న్యాయవాద వృత్తిని వదిలేసారు.

ఉద్యమం:

బ్రిటన్ లో ఉన్నప్పుడే రాజకీయల మీద ఆసక్తి పెంచుకున్న నెహ్రూ ఇండియా కి వచ్చిన తరవాత 1912 లో పాట్నాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో హాజరు అయ్యారు.

నెహ్రూ కాంగ్రెస్ లో చేరినప్పుడు పార్టీ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడేవారి మరియు ఉన్నత వర్గాల వారికి చెందినది గా ఉండేది.

ఇదంతా చూసిన తరవాత కూడా నెహ్రూ మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా లో చేస్తున్న భారత పౌర హక్కుల ఉద్యమం కు మద్దతు తెలిపారు.

1916 వ సంవత్సరంలో అన్నీ బిసెంట్ నేతృత్వంలో స్వపరిపాలన కోసం పోరాడారు.

1917లో బ్రిటిష్ ప్రభుత్వం అన్నీ బిసెంట్ ను అరెస్టుచేయటం జరిగింది. ఈమె ను విడుదల చేయకపోతే నిరసనలు చేస్తామని చెప్పగా బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది.

నెహ్రూ 1920 నుంచి 1927 వరకు సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ వ్యవధి లో రెండు సార్లు జైలు పాలు కూడా అయ్యారు.

1930 సంవత్సరంలో నెహ్రూ ఉప్పు సత్యగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. 14 ఏప్రిల్ 1930 లో నెహ్రూను అరెస్ట్ చేసి 6 నెలల జైలు శిక్షను విధించారు.

1940 లో జిన్నా ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం ఉండాలని ప్రతిపాదిస్తూ Pakistan Resolution ను మొదలుపెట్టారు. దీని ప్రకారం ముస్లింలకు పాకిస్తాన్ అనే దేశం ఉండాలని ప్రతిపాదించారు.

1947 లో స్వాతంత్రం వచ్చిన తరవాత నెహ్రు 18 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రి గా ఉన్నారు.

మరణం :

నెహ్రూ 74 సంవత్సరాల వయస్సులో 27 మే 1964 వ సంవత్సరంలో గుండెపోటు కారణంగా మరణించారు. నెహ్రూ చనిపోయిన తరవాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు.

Leave a Comment