ఎలన్ మస్క్ జీవిత చరిత్ర – Elon Musk biography in Telugu

ఎలన్ మస్క్ యొక్క పూర్తి పేరు ఎలన్ రీవ్ మస్క్. మస్క్ ఒక వ్యాపార దిగ్గజం, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు పెట్టుబడిదారుడు. 

మస్క్ స్పేస్ ఎక్స్ (SpaceX), టెస్లా, ద బోరింగ్ కంపెనీ (The Boring Company),  న్యూరాలింక్ (Neuralink), ఓపెన్ AI (OpenAI) కంపెనీలను స్థాపించారు. 

2022 వ సంవత్సరంలో ట్విట్టర్ కంపెనీ ను కొనుగోలు చేసి యజమాని మరియు సీఈఓ (CEO) అయ్యారు. 

2022 వ సంవత్సరంలో చేసిన అంచనా ప్రకారం ఎలన్ మస్క్ యొక్క నికర ఆదాయం (Net worth) $181 బిలియన్ల డాలర్లు.  2022 లోనే  చేసిన సర్వే ప్రకారం ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. 

బాల్యం :    

ఎలన్ మస్క్ జూన్ 28 1971 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా లోని ప్రిటోరియా అనే నగరంలో జన్మించారు. మస్క్ యొక్క తల్లి మాయె మస్క్ ఒక మోడల్ మరియు డైటీషియన్, కెనడా లో పుట్టి సౌత్ ఆఫ్రికా లో పెరిగారు. మస్క్ యొక్క తండ్రి ఎర్రోల్ మస్క్ సౌత్ ఆఫ్రికా కు చెందిన ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీర్, ప్రాపర్టీ డెవలపర్, పైలట్, నావికుడు మరియు కన్సల్టెంట్.

మస్క్ కి కింబాల్ అనే సోదరుడు మరియు టోస్కా అనే సోదరి ఉంది. మస్క్ యొక్క కుటుంబం ముందునుంచే ఒక ధనిక కుటుంబం. చిన్న తనంలో మస్క్ కలుపు గోలుగా ఉండేవారు కాదు. 500

10 సంవత్సరాల వయస్సులో మస్క్ కంప్యూటర్ల మీద మరియు వీడియో గేమ్స్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను కూడా రాయటం నేర్చుకున్నాడు.

12 సంవత్సరాల వయస్సులో బ్లాస్టర్ గేమ్ ను తయారు చేసి 500 డాలర్లకు అమ్మారు.

మస్క్ తన చదువును సౌత్ ఆఫ్రికా నుంచి పూర్తి చేసారు. యునైటెడ్ స్టేట్స్ లో నివసించడానికి మస్క్ తన తల్లి ద్వారా కెనడా పాస్ పోర్ట్ కోసం అప్లై చేసారు. కెనడా నుంచి అమెరికా కి వెళ్లి నివసించడం సులువు అని తెలిసి ఇలా చేసారు.

1989 సంవత్సరంలో మస్క్ కెనడా లో ఉన్న బంధువు వద్ద నివసించటం మొదలుపెట్టారు. కెనడాలో ఉన్న సమయంలో పొలం పనులు మరియు మిల్లు కు సంబంధించిన పనులను చేసేవారు.

1990 లో కెనడా లోని క్వీన్స్ యూనివర్సిటీ నుంచి మరియు 1992 లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ లో బ్యాచిలర్ అఫ్ ఆర్ట్స్ డిగ్రీ ను సంపాదించారు.

1995 లో ఎకనామిక్స్ లో బ్యాచిలర్ అఫ్ సైన్స్ డిగ్రీ ను సంపాదించారు. కాలేజీ ఫీజులను కట్టడానికి ఇంటి వద్ద టికెట్ పద్దతి ద్వారా పార్టీలను నిర్వహించేవారు. అలాగే ఒక ఎలక్ట్రానిక్ బుక్-స్కానింగ్ సర్వీస్ కంపెనీ కు బిసినెస్ ప్లాన్ ను రాసారు.

1994 లో మస్క్ పినాకిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు రాకెట్ సైన్స్ గేమ్స్ అనే స్టార్ట్ అప్ కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌లు చేసారు.

1995 సంవత్సరంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ లో పి.హెచ్.డి ను చేయాలనుకున్నారు కానీ చివరికి నెట్‌స్కేప్ కంపెనీ లో ఉద్యోగం కోసం అప్లై చేసారు. ఆ కంపెనీ నుంచి ఎలాంటి జవాబు రాలేదు.

బిసినెస్ జీవితం :

జిప్ 2 (Zip2): 

1995 వ సంవత్సరంలో మస్క్ మరియు తన సోదరుడు కింబాల్ మరియు గ్రెగ్ కౌరీ కలిసి Zip2 అనే కంపెనీ ను స్థాపించారు. మస్క్ యొక్క తండ్రి ఎర్రోల్ మస్క్ కంపెనీ కోసం 28,000 డాలర్ల ఫండింగ్ కూడా చేసారు. ఈ వెబ్ సైట్ లో  సిటీ గైడ్, మ్యాప్స్ , మరియు బిసినెస్ లకు సంబంధించిన వివరాలు ఉండేవి. 

ఒక చిన్న రూమ్ లో ఆఫీస్ ను మొదలుపెట్టారు.  రాత్రి సమయంలో మస్క్ వెబ్ సైట్ కోసం కోడింగ్ చేసేవారు.

1999 సంవత్సరంలో కాంపాక్ అనే IT కంపెనీ Zip2 ను  $307 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కంపెనీ లో మస్క్ కు ఉన్న 7 శాతం వాటా ప్రకారం $22 మిలియన్ డాలర్లు వచ్చాయి.          

X.com మరియు పే పాల్ : 

1999 వ సంవత్సరంలో X.com స్థాపనలో కో ఫౌండర్ గా ఉన్నారు. ఈ కంపెనీ ఒక ఆన్ లైన్ బ్యాంకు. FDIC (Federal Deposit Insurance Corporation) ద్వారా భీమా చేయబడ్డ మొట్ట మొదటి బ్యాంకు.  

2000 సంవత్సరంలో X.com కన్ఫినిటీ అనే కంపెనీ కు చెందిన మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ పే పాల్ (Paypal) తో విలీనం చేయబడింది.   

2001 వ సంవత్సరంలో ఈ కంపెనీ Paypal పేరుతో కేవలం మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ పై దృష్టి సారించింది. 

2002వ సంవత్సరంలో ebay కంపెనీ PayPal ను కొనుగోలు చేసింది. ఆ సమయంలో మస్క్ 11.72% షేర్లతో ఎక్కువ షేర్లు కలిగి ఉన్నందుకు $175.8 మిలియన్ల డాలర్లు పొందారు. 

2017 వ సంవత్సరంలో paypal నుంచి మస్క్ x.com వెబ్ సైట్ ను తిరిగి కొనుగోలు చేసుకున్నారు. 2022 వ సంవత్సరంలో “X, the everything app” ను తయారు చేయాలనేది తన లక్ష్యం అని చెప్పారు. 

స్పేస్ X: 

2001 వ సంవత్సరంలో ఎలన్ మస్క్ మార్స్ సొసైటీ అనే ఒక నాన్ ప్రాఫిట్ సంస్థలో చేరారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మార్స్ పై కూడా మనుషులు నివసించే విధంగా వాతావరణం తయారు చేయటం. 

రష్యా నుంచి రాకెట్లను కొనుగోలు చేయాలని అనుకున్నారు కానీ అక్కడ ఒక్క రాకెట్ ఖర్చు 8 మిలియన్ల డాలర్లు అని తెలిసింది. ఒక్క రాకెట్ కోసం 8 మిలియన్ల డాలర్లు చాలా ఎక్కువ అనుకోని రాకెట్లు తయారు చేసే సొంత కంపెనీను తయారు చేసారు. 

2002 వ సంవత్సరంలో 100 మిలియన్ డాలర్ల తన సొంత డబ్బుతో space x పేరుతో కంపెనీ ను స్థాపించారు. 

Space x ద్వారా ముందుగా లాంచ్ చేసిన రెండు రాకెట్లు ఫెయిల్ అవ్వటంతో కంపెనీ దివాళా తీసే స్థాయికి వెళ్ళింది. 2008 సంవత్సరంలో స్పేస్ X లాంచ్ చేసిన Falcon 1 విజయవంతం అయ్యింది. ఫలితంగా నాసా నుంచి $1.6 బిలియన్ డాలర్ల కాంట్రాక్టు లభించింది. 

2015 సంవత్సరంలో స్పేస్ x  రాకెట్లను స్పేస్ లోకి పంపిన తర్వాత తిరిగి భూమి మీదకు రప్పించే టెక్నాలాజీ (reusable rockets) ను రూపొందించింది.                

 Falcon 9 (ఫాల్కన్ -9) అనే రాకెట్ మొట్ట మొదటి సారిగా విజయవంతంగా స్పేస్ కి వెళ్లి తిరిగి భూమి మీద ల్యాండ్ అయ్యింది. 

Falcon 9 స్థానంలో స్పేస్ x అనే స్టార్ షిప్ ను తయారు చేస్తుంది. ఈ షిప్ అత్యంత భారీ లోడ్ లను స్పేస్ కి మోసుకువెళ్ళే విధంగా తయారుచేస్తున్నారు.    

స్టార్ లింక్ (Starlink): 

2015 వ సంవత్సరంలో స్పేస్ x  సంస్థ స్టార్ లింక్ పేరుతో ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగించే విధానం మొదలుపెట్టుకుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ ను అమలు చేయడంలో స్పేస్ x  కు  $10 బిలియన్ల డాలర్ల ఖర్చు అయ్యింది. 

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం సమయంలో ఎలన్ మస్క్ స్టార్ లింక్ ద్వారానే ఉక్రెయిన్ దేశానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు.        

టెస్లా : 

2003 వ సంవత్సరంలో మార్టిన్ ఎబర్‌హార్డ్ మరియు మార్క్ టార్పెనింగ్ అనే ఇద్దరు ఇంజినీర్లు టెస్లా మోటర్స్ అనే కంపెనీ ను ప్రారంభించారు. కంపెనీ అభివృద్ధికి ఇద్దరు చాలా కృషి చేసారు. 

2004 వ సంవత్సరంలో ఎలన్ మస్క్ $6.5 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్ చేసి కంపెనీ లో ఎక్కువ షేర్లు కలిగిన వాటాదారుడు అయ్యారు.టెస్లా యొక్క బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ సభ్యుడు కూడా అయ్యారు. 

ఆ సమయంలో జరుగుతున్న రోడ్ స్టర్ కారు యొక్క ఉత్పత్తిను మరియు డిజైన్ ను చురుకుగా పర్యవేక్షించారు.  

2008 లో జరిగిన ఆర్థిక సంక్షోభంలో ఎబర్‌హార్డ్ కంపెనీ నుంచి తొలగించబడ్డారు. ఇదే సంవత్సరం మస్క్ కంపెనీ యొక్క CEO గా ఎన్నుకొబడ్డారు. 

మస్క్ ఆధ్వర్యంలో పలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసారు. అక్టోబర్ 2021వ సంవత్సరంలో టెస్లా $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు చేరుకుంది. అమెరికా చరిత్ర లో ఇలా చేరుకున్న కంపెనీలలో టెస్లా ఆరవది. 

సోలార్ సిటీ : 

ఎలన్ మస్క్ సలహా మేరకు మస్క్ కజిన్స్ పీటర్ మరియు లిండన్ రైవ్ 2006 వ సంవత్సరంలో సోలార్ సిటీ ను స్థాపించారు. 2013 వరకు ఈ సంస్థ అమెరికా లోనే రెండవ అతిపెద్ద సోలార్ పవర్ సిస్టం గా ఎదిగింది. 

2014 సంవత్సరంలో సోలార్ సిటీ ను తయారు చేయాలనే తన ఆలోచనను తెలియచేసారు. న్యూయార్క్ లోని బఫెలో నగరంలో ఇంతకు  ముందు ఉన్న అతిపెద్ద సోలార్ ప్లాంట్ కన్నా మూడు రేట్లు పెద్ద పవర్ ప్లాంట్ ను నిర్మించడం ప్రారంభించారు. 2017 లో ఈ నిర్మాణం ముగిసింది. 

2016 వ సంవత్సరంలో మస్క్  $2 బిలియన్ డాలర్లతో సోలార్ సిటీ సంస్థ ను కొనొగోలు చేసారు. ఈ సంస్థను తన బ్యాటరీ యూనిట్ తో విలీనం చేసి టెస్లా ఎనర్జీ ను స్థాపించారు. 

న్యూరాలింక్ : 

2016 వ సంవత్సరంలో  Neuralink అనే స్టార్ట్ అప్ కంపెనీను ప్రారంభించటంలో కో ఫౌండర్ గా ఉన్నారు. 100 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ తో మొదలైన ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం మనిషి మెదడును ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (A.I) తో అనుసంధానం చేయటం.  

ది బోరింగ్ కంపెనీ : 

2017 వ సంవత్సరంలో ఎలన్ మస్క్ బోరింగ్ కంపెనీ ను స్థాపించారు. ఈ  కంపెనీ యొక్క ముఖ్య లక్ష్యం నగరాలలో ఉండే ట్రాఫిక్ సమస్యను అధిగమించటానికి టన్నెల్ లను తయారు చేయటం. ఎలన్ మస్క్ ప్రకారం ఈ టన్నెల్స్ ద్వారా గంటకి 240 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 

ట్విట్టర్ :

జనవరి 2022 వ సంవత్సరంలో మస్క్ ట్విట్టర్ యొక్క షేర్లను కొనుగులు చేయటం ప్రారంభించారు. ఏప్రిల్ నెలలో 9% షేర్లు కొని కంపెనీ లో అతిపెద్ద వాటా దారుడు అయ్యారు. 

ఇదే నెలలో  $43 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని ట్విట్టర్ కి ఆఫర్ చేసాడు. 

తరవాత ట్విట్టర్ లో స్పామ్ అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయని డీల్ ను రద్దు చేసారు. ఫలితంగా ట్విట్టర్ యొక్క షేర్స్  10% వరకు పడిపోయాయి. 

ట్విట్టర్ ఎలన్ మస్క్ పై లీగల్ గా  కేసు నమోదు చేసింది. అక్టోబర్ 2022 లో మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసారు. 

ట్విట్టర్ ను కొనుగోలు చేసిన వెంటనే ట్విట్టర్ CEO అయిన పరాగ్ అగర్వాల్ ను పదవి నుంచి తొలగించారు. మస్క్ స్వయంగా కంపెనీ యొక్క CEO అయ్యారు. 

ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్న వాళ్ళందరూ నెలకి 8 డాలర్లు కట్టాలనే కొత్త నియమాన్ని తీసుకువచ్చారు.      

Source: Elon Musk – Wikipedia             

Leave a Comment