అవతార్: ద వే ఆఫ్ వాటర్ (Avatar: The Way of Water) అనేది అమెరికా కు చెందిన మరియు పెద్ద ఎత్తున నిర్మించబడ్డ సైన్స్ ఫిక్షన్ సినిమా.
2009 వ సంవత్సరంలో విడుదల అయిన అవతార్ సినిమా యొక్క సీక్వెల్. ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కు జేమ్స్ కామెరూన్ మరియు జోన్ లాండౌ నిర్మాతలుగా ఉన్నారు.
2006 వ సంవత్సరంలో కామెరాన్ మాట్లాడుతూ అవతార్ సినిమా విజయవంతం అయితే సీక్వెల్ సినిమాలు తీయలనుకుంటున్నాను అని చెప్పారు.
అవతార్ సినిమా 2009 లో విడుదల అయ్యి మంచి సక్సెస్ ను పొందిన తరవాత 2010వ సంవ్సతరంలో కామెరాన్ ఈ సినిమాకు సీక్వెల్స్ తప్పకుండా ఉంటాయని ప్రకటించారు.
2104 మరియు 2105 లో ఈ సీక్వెల్ సినిమాలను విడుదల చేయాలని అనుకున్నారు. తరవాత వచ్చే సీక్వెల్ పండోరా లోని సముద్రం పై మరియు దట్టమైన అడవిపై ఆధారపడి ఉంటుంది.
సీక్వెల్ సినిమాలో ఫ్రేమ్ రేట్ ను కూడా ఎక్కువగా ఉంచాలని అనుకున్నారు. సాధారణంగా సినిమాలలో 24 ఫ్రేమ్ పర్ సెకండ్ ఉంటుంది కానీ ఈ సినిమాలో దానికన్నా ఎక్కువ ఫ్రేమ్ రేట్ ను ఉంచి మంచి అనుభూతి ని కలిగించాలని అనుకున్నారు.
2013 లో కామెరాన్ ఈ సినిమాలన్నింటిని న్యూజీలాండ్ లో షూట్ చేయాలనీ నిరణయించుకున్నారు. 2014 లో పర్ఫార్మెన్స్ కాప్చర్ (performance capture) టెక్నాలజీ ను, లైవ్ ఆక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ను కూడా ఉపయోగించాలనుకున్నారు. న్యూజిలాండ్ తో కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రకారం సినిమాలను అక్కడే షూట్ చేయాలనుకున్నారు. ఫలితంగా 15% to 20% 2013 వరకు పన్ను పై రాయితీ కూడా కలిగిస్తాం అన్నారు.
స్క్రిప్ట్ చాలా మార్పులు చేయటం వల్ల సినిమా యొక్క సీక్వెల్ ఇంకా ఆలస్యం అయ్యింది.
ఏప్రిల్ 2016 వ సంవత్సరంలో సినిమా కాన్ ఈవెంట్ లో అవతార్ సినిమాకు 4 సీక్వెల్ సినిమాలు ఉంటాయని ఒక్కో సినిమా ఖర్చు 2000కోట్లు మరియు 4 సినిమాల ఖర్చు 10,000 కోట్లు ఉంటుందని చెప్పారు.
Avatar: The Way of Water సినిమా యొక్క షూటింగ్ ఆగస్ట్ 15, 2017 కాలిఫోర్నియా లోని మాన్హాటన్ బీచ్ లో ప్రారంభించారు. ఇదే సినిమాతో పాటు అవతార్ 3 షూటింగ్ కూడా ప్రారంభించారు.
అదే సంవత్సరంలో performance capture టెక్నాలజీ ను ఉపయోగించి నీటి లోపల షూటింగ్ ను చేసారు. ఈ షూటింగ్ కోసం సినిమాలో పనిచేసే నటులు పలు టెస్ట్ లు కూడా చేయించుకున్నారు.
2019 వ సంవత్సరంలో అవతార్ 2 & 3 యొక్క లైవ్ ఆక్షన్ ను షూట్ చేయటం ప్రారంభించారు. కరోనా వైరస్ పాండెమిక్ కారణంగా షూటింగ్ ను నిలిపి వేయాల్సి వచ్చింది.
జూన్ 16, 2020 వ సంవత్సరంలో లాండౌ మరియు కామెరాన్ ఇంస్టాగ్రామ్ ద్వారా సినిమాను మళ్ళీ మొదలుపెట్టారు. ఇదే సంవత్సరం జూన్ లో షూటింగ్ యొక్క వీడియో ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
నీటి లోపల తీసిన షూటింగ్ కోసం ఉపయోగించిన performance capture టెక్నాలజీ ఇంతకూ ముందు ఎప్పుడు ఉపయోగించలేదు. దీనిని అమలు చేయడానికి ఏడాదిన్నర సమయం పట్టింది.
నవంబర్ 23, 2022 వ సంవత్సరంలో ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తి అయ్యింది.
అక్టోబర్ 2022 లో వచ్చిన సమాచారం ప్రకారం సినిమా 190 నిమిషాల పొడవు (3 hours and 10 minutes) ఉన్నటుందని చెప్పారు.
Avatar: The Way of Water సినిమా డిసెంబర్ 16, 2022వ సంవత్సరంలో విడుదల అవ్వనుంది.
అవతార్ సినిమా నిర్మాతలు 4 సీక్వెల్ సినిమాలు తీయాలని అనుకున్నారు. Avatar: The Way of Water సినిమా ఈ సీక్వెల్ లో మొదటిది. అవతార్ 2 తో పాటు అవతార్ 3 స్పీమా షూటింగ్ కూడా మొదలయ్యింది.
సినిమా నిర్మాతల ప్రకారం అవతార్ 2 మరియు అవతార్ 3 సినిమాలు విజవంతం అయితే అవతార్ 4 మరియు అవతార్ 5 ను విడుదల చేస్తారు.