సోనియా గాంధీ జీవిత చరిత్ర – Sonia Gandhi biography in Telugu

సోనియా గాంధీ భారత దేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లో అత్యధికంగా ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా పనిచేసారు. తన భర్త మరియు ప్రధాన మంత్రి అయిన రాజీవ్ గాంధీ హత్య జరిగిన 7 సంవత్సరాల తరవాత అధ్యక్ష పదవిని చేపట్టారు.

1998వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షురాలిగా ఎక్కుకోబడ్డారు.

బాల్యం :

సోనియా మైనో డిసెంబర్ 9 1946 వ సంవత్సరంలో ఇటలీ లోని లూసియానా (Lusiana) అనే చిన్న పట్టణం లో స్టెఫానో మరియు పావోలా మైనో అనే దంపతులకు జన్మించారు. సోనియా కు నదియా మరియు అనౌష్క అనే ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.

సోనియా సాంప్రదాయ రోమన్ కాథలిక్ కుటుంబంలో పెరిగారు. సోనియా తన కౌమార దశ టురిన్ సమీపంలోని ఒర్బస్సనో పట్టణం లో గడిపారు. ఈమె స్థానికంగా ఉన్న రోమన్ కాథలిక్ పాఠశాలలలో తన ప్రాథమిక విష్యను పూర్తి చేసారు.

సోనియా తండ్రి స్టెఫానో ఒర్బస్సనో లోనే భవన నిర్మాణ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో స్టెఫానో హిట్లర్ మిలిటరీ తో కలిసి సోవియట్ మిలిటరీ కి వ్యతిరేకంగా పోరాడాడు. 1983 వ సంవత్సరంలో సోనియా తండ్రి చనిపోయాడు.

చదువు:

సోనియా 13 సంవత్సరాల వయస్సులో తన స్కూల్ చదువును పూర్తి చేసారు. తన స్కూల్ రిపోర్ట్ కార్డు లో తెలివైన, శ్రద్ధగల, నిబద్ధత గల అమ్మాయిగా రాసారు.

1964 వ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ లోని బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లాంగ్వేజ్ స్కూల్ లో చేరారు. అదే సమయంలో రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో తన ఇంజనీరింగ్ డిగ్రీ చదవటానికి చేరారు. ఒక సంవత్సరం తరవాత వర్సిటీ రెస్టారెంట్ లో సోనియా రాజీవ్ గాంధీ ను కాలుస్తారు.

సోనియా గాంధీ చదువుతో పాటు వర్సిటీ రెస్టారెంట్ లో పార్ట్ టైం వెయిట్రెస్ గా పనిచేసేవారు.

1965 వ సంవత్సరంలో కలిసిన ఈ జంట 1968 లో హిందూ సాంప్రదాయకం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తరవాత సోనియా తన అత్త మరియు ప్రధాన మంత్రి అయిన ఇందిరా గాంధీ ఇంట్లో ఉండసాగారు.

కెరీర్ :

సోనియా గాంధీ ప్రధాన మంత్రి కోడలైనప్పటికీ రాజకీయాలలో ఎక్కువగా పాల్గొనేవారు కాదు. పెళ్లి తరవాత రాజీవ్ గాంధీ పైలట్ గా పనిచేసేవారు, సోనియా గాంధీ గృహిణి గా ఇంట్లోనే ఉండేవారు.

ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజీవ్ గాంధీ కుటుంబం కొంత సమయం కోసం ఇతర దేశంలో ఉన్నారు.

రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ 1980 లో ప్లేన్ క్రాష్ లో చనిపోయిన తరవాత రాజీవ్ గాంధీ రాజకీయాలలో ప్రవేశించారు.

అత్త ఇందిరా గాంధీ హత్య తరవాత రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యిన తరవాత సోనియా గాంధీ ప్రజల ముందు రావటం మొదలుపెట్టారు.

ప్రధాన మంత్రి భార్యగా సోనియా గాంధీ పలు దేశాలకు తన భర్త తో కలిసి పర్యటించారు.

1984 వ సంవత్సరంలో తన భర్త కి వ్యతిరేకంగా పోరాడుతున్న సంజయ్ గాంధీ భార్య కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.

రాజీవ్ గాంధీ ఐదేళ్ల పాలన ముగిసే సరికి బోఫోర్స్ కుంభకోణం (Bofors scandal) బయటపడింది. ఈ కుంభకోణంలో ఒట్టావియో క్వాట్రోచి (Ottavio Quattrocchi) అనే ఇటలీకి చెందిన వ్యాపార వేత్త హస్తం ఉందని, ఈయన సోనియా గాంధీ మిత్రుడని మరియు ప్రధాన మంత్రి కార్యాలయనికి వచ్చి పోయే అనుమతి ఉండేదని కొంతమంది నమ్ముతారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా:

1991 లో రాజీవ్ గాంధీ హత్య తరవాత కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి అయ్యేందుకు నిరాకరించారు.

సోనియా గాంధీ నిరాకరించిన తరవాత పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా ఎన్నుకోబడ్డారు. కొన్ని సంవత్సరాల తరవాత కాంగ్రెస్ పార్టీ లో కలిగిన విభేదాల వల్ల 1996లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయాన్ని చూసింది.

ఆ సమయంలో సీతారాం కేస్రీ ను పార్టీ యొక్క ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ లోని ముఖ్య నాయకులు వ్యతిరేకత తెలిపి పార్టీను వీడసాగారు.

కుంగిపోతున్న పార్టీను కాపాడటానికి 1997 లో ప్రాథమిక సభ్యురాలిగా మరియు 1998 లో పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డారు.

1999 వ సంవత్సరంలో పార్టీ లోని సీనియర్ నాయకులు శరద్ పవార్, P. A. సంగ్మా, మరియు తారిఖ్ అన్వర్ సోనియా గాంధీ ప్రధానమంత్రి అవ్వటాన్ని వ్యతిరేకించారు. ఈ ముగ్గురు కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ను స్థాపించారు.

1999 లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కర్ణాటక లోని బళ్లారి మరియు ఉత్తరప్రదేశ్ లోని అమెతీ నుంచి పోటీ చేసి రెండు స్థానాలలో గెలిచారు. కానీ అమెతీ కె ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నారు.

1999 సంవత్సరంలో సోనియా ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నుకోబడ్డారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోసం జరిగిన ఎన్నికలలో జితేంద్ర ప్రసాద ను ఓడించి 97% భారీ మెజారిటీ తో గెలిచారు.

2004 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందరూ సోనియా గాంధే ప్రధానమంత్రి అవుతారు అని అనుకున్నారు. ఎందుకంటే సాధారణంగా పార్టీ ప్రెసిడెంటే ప్రధాన మంత్రి గా ఎన్నుకోబడుతారు.

ఇదే సంవత్సరం మే 16 న 15 పార్టీల కూటమి తో ఏర్పడిన United Progressive Alliance (UPA) యొక్క నాయకురాలిగా ఎన్నుకోబడ్డారు.

సోనియా ప్రధాన మంత్రి అవ్వకూడదని, ఆమె ఇటలీ కి చెందిన వారు అని NDA (National Democratic Alliance) సీనియర్ నాయకురాలు సుష్మ స్వరాజ్ వ్యతిరేకత తెలిపారు.

తరవాత NDA, సోనియా గాంధీ ప్రధాన మంత్రి అవ్వకపోవటం వెనక చట్టపరమైన కారణాలు ఉన్నాయని తెలిపారు.

ఎన్నికలు జరిగిన కొన్ని రోజుల తరవాత సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ను ప్రధాన మంత్రి గా ప్రకటించారు.

జాతీయ సలహా కమిటీ (National Advisory Committee) అధ్యక్షురాలి గా ఉంటూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (National Rural Employment Guarantee Scheme), సమాచార హక్కు చట్టం (Right to Information Act) చట్టంగా మార్చడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది.

2009 లో జరిగిన ఎన్నికలలో కూడా 206 లో లోక్ సభ సీట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1991 తరవాత అంత మెజారిటీ తో గెలవటం అదే తొలిసారి.

2009 లో కూడా మన్మోహన్ సింగ్ ను ప్రధాన మంత్రిగా ఎన్నుకోవటం జరిగింది.

2013 లో 15 సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డ నాయకురాలిగా సోనియా గాంధీ నిలిచారు. ఇదే సంవత్సరం ఎల్‌జిబిటి హక్కులను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సోనియా ఖండించారు.

2014 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చూసింది. 2017వ సంవత్సరంలో సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు.

రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2019 లో జరిగిన ఎన్నికలలో కూడా ఓడిపోయింది.

2022 వ సంవత్సరంలో రాహుల్ గాంధీ స్థానంలో మల్లికార్జున్ ఖర్గే ను కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు.

వ్యక్తిగత జీవితం :

సోనియా గాంధీ మరియు రాజీవ్ గాంధీకి ఇద్దరు సంతానం. కొడుకు రాహుల్ గాంధీ మరియు కూతురు ఫ్రీయంక గాంధీ.

ఆగస్ట్ 2011 వ సంవత్సరంలో గర్భాశయ క్యాన్సర్ కు విజయవంతమైన శస్త్రచికిత్స చేయించుకుంది. సెప్టెంబర్9 వ తారీఖున ఇండియా తిరిగి వచ్చారు.

సోనియా గాంధీ 2004 నుండి 2014 వరకు భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా ఉన్నారు. అలాగే మ్యాగజైన్‌లలో కూడా అత్యంత శక్తివంతమైన వ్యక్తులు మరియు మహిళల జాబితాలలో పేర్కొనబడ్డారు.

Source: Sonia Gandhi – Wikipedia

Leave a Comment