మరియా టెల్క్స్ హంగేరియన్ – అమెరికన్ జీవ భౌతిక శాస్త్రవేత్త (biophysicist) శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త. ఈమె సోలార్ ఎనర్జీ కి సంబంధించిన టెక్నాలజీ పై పనిచేసారు.
Table of Contents
బాల్యం :
మరియా హన్గేరి రాజధాని అయిన బుడాపెస్ట్ లో అలదార్ మరియు మరియా లాబన్ డి టెల్కేస్ అనే దంపతులకు జన్మించారు. తన స్కూల్ చదువును బుడాపెస్ట్ నుంచే పూర్తి చేసారు.
1920 వ సంవత్సరంలో బుడాపెస్ట్ యూనివర్సిటీ నుంచి భౌతిక రసాయన శాస్త్రం (physical chemistry) లో B.A చేసి తన గ్రాడ్యుయేషన్ డిగ్రీ ను సంపాదించారు. 1924 వ సంవత్సరంలో PHD ను పూర్తి చేసారు.
కెరీర్ :
1924వ సంవత్సరంలో మరియా అమెరికా కు వెళ్ళినప్పుడు ఒహాయో (Ohio) లోని క్లీవ్‌ల్యాండ్ లో హన్గేరీ కి చెందిన కాన్సుల్ మరియు తన బంధువును కలిసారు.
అక్కడ ఆమె క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ఫౌండేషన్‌లో పని చేయడానికి నియమించబడింది. ఈ ఫౌండేషన్ లో పనిచేస్తున్న సమయంలో జీవుల ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తిని పరిశోధించారు.
అక్కడ పనిచేస్తున్న సమయంలో జార్జ్ వాషింగ్టన్ క్రైల్ అనే సర్జన్ నాయకత్వంలో మెదడు తరంగాలను (Brain waves) రికార్డ్ చేయగల ఫోటోఎలెక్ట్రిక్ మెకానిజంను కనుగొన్నారు.
ఈ ఇద్దరు కలిసి Phenomenon of Life అనే పుస్తకాన్ని కూడా రాసారు.
టెల్క్స్ తరవాత వెస్టింగ్‌హౌస్‌లో జీవ భౌతిక శాస్త్రవేత్త గా పనిచేసారు. ఈమె వేడి ను విధ్యుత్ రూపంలో మార్చే థర్మోఎలెక్ట్రికల్ థర్మామీటర్ కోసం లోహాల యొక్క మిశ్రమాలను అభివృద్ధి చేసారు.
1939 వ సంవత్సరంలో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) తాను పనిచేస్తున్న కొత్త సోలార్ ఎనర్జీ ప్రోగ్రాం (సౌర శక్తి) గురించి లేఖ రాసారు. 1939లో నియమించబడి 1953 వరకు కొనసాగారు.
డీశాలినేషన్ మషీన్ (Desalination machine) :
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా ప్రభుత్వం టెల్క్స్ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి ఆఫీస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (OSRD) కి సివిలియన్ అడ్వైసర్ (పౌర సలహాదారురాలిగా) గా నియమించారు.
అక్కడ ఆమె సోలార్ పవర్ తో పనిచేసే డీశాలినేషన్ మషీన్ ను అభివృద్ధి చేసారు. 1942 లో దీనికి సంబంధించిన ఒక నమూనా(prototype) ను కూడా తయారు చేసారు.
డీశాలినేషన్ పద్దతి ద్వారా తాగడానికి అనుగుణంగా లేని నీటిని తాగటానికి పనికి వచ్చేలా చేయటం. ఉదాహరణకి సముద్రపు నీరు, ఉప్పునీరు మరియు మురుగునీరు ను డీశాలినేషన్ పద్దతి ద్వారా తాగటానికి పనికి వచ్చే నీటి లా తయారు చేయటం.
ఈ ఆవిష్కరణ ఈమె చేసిన ఆవిష్కరణలతో అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణగా మారింది. ఈ పద్దతి ద్వారా సైనికులు క్లిష్టమైన పరిస్తుతులలో స్వచ్ఛమైన నీటిని పొందారు. అలాగే US వర్జిన్ దీవులలో ఉన్న నీటి సమస్యను కూడా పరిష్కరించారు.
కానీ దీనిని అమామలులో తీసుకురావటానికి ఆలస్యం అయ్యింది. హోయ్ట్ సి. హోటల్ (Hoyt C. Hottel ) అనే MIT చెందిన ప్రొఫెసర్ తయారీ ఒప్పందాలపై పదేపదే జరిపినందున ఆలస్యం అయ్యింది.
పనిచేసే solar-heated ఇంటిని తయారు చేస్తున్న డిజైనర్లు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య సౌర శక్తిని స్టోర్ చేయకపోవటాన్ని టెల్క్స్ గమనించారు.
టెల్క్స్ యొక్క ప్రత్యేకతలలో ఒకటి దశ-మార్పు పదార్థాల పై పనిచేయటం. ఈ పదార్థాలు అవి ఘన నుండి ద్రవంగా మారినప్పుడు వేడిని గ్రహిస్తాయి లేదా విడుదల చేస్తాయి.
సౌర శక్తిని నిల్వ ఉంచడానికి కరిగిన లవణాలు లాంటి దశ-మార్పు పదార్థాలను ఉపయోగించవచ్చు అని ఆశించారు.
ఈ పద్దతిలో ఆమె ఎంచుకున్న పదార్థాలలో ఒకటి గ్లాబర్స్ సాల్ట్ (సోడియం సల్ఫేట్).
MIT లో సోలార్ ఎనర్జీ కి చైర్మన్ గా ఉన్న హోటల్, టెల్క్స్ ను ప్రోత్త్సహించారు కానీ ఆయన టెల్క్స్ పనిచేస్తున్న ఐడియా కన్నా సోలార్ పవర్ మీద ఈకువ ఆసక్తి ఉండేది.
MIT సభ్యులలో టెల్క్స్ ఒక్కరే మహిళ కావటంతో హోటెల్ మరియు టెల్కేస్ మధ్య వ్యక్తిత్వ ఘర్షణలు ఉండేవి.
ఫలితంగా టెల్క్స్ సౌర శక్తిపై పనిచేస్తున్న ప్రాజెక్ట్ నుంచి తొలగించబడ్డారు. ప్రాజెక్ట్ ను ఫండ్ చేస్తున్న గాడ్‌ఫ్రే లోవెల్ కాబోట్ మాత్రం టెల్క్స్ స్వతంత్రంగా ఆ ప్రాజెక్ట్ పై చేయమని కోరారు.
మొదటి ప్రయత్నం :
1948వ సంవత్సరంలో టెల్క్స్ solar-heated డోవర్ సన్ హౌస్ (Dover Sun House) పై పనిచేయటం మొదలుపెట్టారు.
ఆర్కిటెక్ట్ ఎలియనోర్ రేమండ్ మరియు నిధులను సమకూర్చిన అమేలియా పీబాడీ తో కలిసి పనిచేయటం మొదలుపెట్టారు.
ఈ తయారు చేసిన సిస్టం ప్రకారం గ్లాబర్ ఉప్పు (Glauber’s salt ) సూర్యుడి వేడి వల్ల కరిగి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. సూర్యుడు లేని సమయంలో గ్రహించిన ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదల అయిన వేడి లేదా ఉష్ణం ఇంటిని వేడిగా ఉంచేది.
మొదటి రెండు సంవత్సరాలు టెల్క్స్ యొక్క ఆవిష్కరణ చాలా పబ్లిసిటీ పొందింది. కానీ మూడవ సంవత్సరం ఉప్పు ఘనంగా మరియు ద్రవముగా లయేర్లలో ఏర్పడటం మరియు ఉప్పు ఉన్న కంటైనర్లు తుప్పు పట్టి లీక్ అవ్వటం వల్ల ఇంటి యజమానులు పరికరాన్ని తెసివేసారు.
1953 లో MIT చేసిన ఒక రివ్యూ ప్రకారం టెల్క్స్ MIT నుంచి తొలగించబడ్డారు.
సౌర శక్తి ఓవెన్ :
1953 వ సంవత్సరం లోనే టెల్క్స్ న్యూయార్క్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చేరారు.
ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి మారుమూల ప్రాంతాలలో ఉండే వారి కోసం సోలార్ పవర్ తో నడిచే ఓవెన్ ను తయారు చేయటానికి $45,000 డాలర్ల ఫండింగ్ లభించింది.
ఈ పద్దతిని టెక్నాలజీ అంతగా లేని ప్రాంతాల వారు సులువుగా ఉపయోగించవచ్చు. ఈ ఓవెన్ సమర్థవంతంగా పనిచేయాలంటే దీని ఉష్ణోగ్రత 350 డిగ్రీల వరకు చేరుకోవాలి. అనుకున్న దాని కంటే ఈ ఓవెన్ మంచి ఫలితాలను ఇచ్చింది. మారుమూల ప్రాతాలవారికి చాలా ఉపయోగపడింది.
ఇదే టెక్నాలజీ ను ఉపయోగించి రైతులు తమ పంటలను ఆరబెట్టుకోవచ్చు అని కూడా కనుగొన్నారు. తరవాతి సంవత్సరాలు సోలార్ ఎనర్జీ యొక్క డైరెక్టర్ గా పనిచేసారు.
“అసాధ్యం అనుకున్న విషయాలే నాకు ఆసక్తిని కలిగిస్తాయి. వారు చేయలేని పనులు చేయడం నాకు ఇష్టం.” (“It is the things supposed to be impossible that interest me. I like to do things they say cannot be done.”) మరియా టెల్క్స్