క్రిస్మస్ అంటే ఏమిటి – What is Christmas in Telugu?

క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం జీసస్ క్రైస్ట్ (యేసుక్రీస్తు) పుట్టిన రోజున జరుపుకుంటారు. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వ తారీఖున జరువుకుంటారు.

ఈ పండగను కొన్ని కోట్ల మంది క్రైస్తవులు జరుపుకుంటారు. మిగతా వారు ఒక కల్చరల్ (సాంస్కృతిక) వేడుకగా జరుపుకుంటారు.

క్రిస్మస్ (Christmas) అనే పేరు Cristes-messe నుంచి వచ్చింది. కాల క్రమేణా అది Christmas గా మారింది. కొందరు దీనిని Xmas అని కూడా పిలుస్తారు.

జీసస్ బెత్లెహెం నగరంలో వర్జిన్ లేదా కన్య అయిన మేరీ కి జన్మించారు. దైవ దూతలు ఇతనిని ప్రజల రక్షకుడిగా ప్రకటించారు మరియు గొర్రెల కాపరులు ఆయనను ఆరాధించటానికి వచ్చారు.

జీసస్ పుట్టిన తేదీని చాలా మంది వివిధ రకాలుగా చెబుతారు. రోమన్ లు చలి కాలంలో డిసెంబర్ 25 న జీసస్ పుట్టినట్లు గుర్తించారు. మొదటి సారి క్రిస్మస్ పండగను డిసెంబర్ 25, AD 336 రోజున జరిపారు. చాలా మంది చరిత్రకారులు కూడా డిసెంబర్ 25 నే జీసస్ తేదిగా భావిస్తారు.

చరిత్ర కారుల ప్రకారం మేరీ మార్చ్ 25 న గర్భం దాల్చారని అందుకే 9 నెలల తరవాత వచ్చే డిసెంబర్ లోనే జీసస్ పుట్టారని చెబుతారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ ను ఒక పబ్లిక్ హాలిడే గా మరియు ఒక ముఖ్య పండగగా జరుపుకుంటారు.

క్రైస్తవులు ఎక్కువగా లేని దేశాలలో కూడా క్రిస్మస్ ను గొప్పగా జరుపుకుంటారు.

ఉదాహరణకి జపాన్ లో క్రిస్మస్ చాలా ప్రముఖ పండుగా, ఈ దేశంలో చాలా తక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నా కూడా పండగను మాత్రం అందరు ఘనంగా జరుపుకుంటారు. గిఫ్టులు ఇవ్వటం, డెకరేషన్ చేయటం మరియు క్రిస్మస్ ట్రీ ను ఉంచటం లాంటి ఆచారాలను పాటిస్తారు.

అలాగే ముస్లిం దేశం అయిన టర్కీ లో కూడా క్రైస్తవులు తక్కువగా ఉన్న క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు.

1223వ సంవత్సరం నుంచి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి ద్వారా క్రిస్మస్ రోజు డెకరేషన్ చేయటం ప్రారంభమయ్యింది. తరవాత ఇది యూరోప్ అంతటా వ్యాపించింది.

క్రిస్మస్ డెకరేషన్ లో ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ మరియు గోల్డ్ రంగులను ఉపయోగిస్తారు.

ఎరుపు రంగు జీసస్ యొక్క రక్తానికి ప్రతీకగా, ఆకుపచ్చ రంగు శాశ్వత జీవితాన్ని మరియు ఎల్లప్పుడూ ఆకులు కోల్పోకుండా ఉండే చెట్టు కి ప్రతీకగా ఉంటుంది. గోల్డ్ రంగు రాచరికానికి ప్రతీకగా ఉంటుంది.

16 వ శతాబ్దంలో క్రిస్మస్ వేడుకలలో క్రిస్మస్ ట్రీ ను కూడా వినియోగించటం మొదలుపెట్టారు.మెక్సికోకు చెందిన స్థానిక మొక్క అయిన పోయిన్‌సెట్టియాను క్రిస్మస్ ట్రీ గా గుర్తించటం మొదలుపెట్టారు.

పురాతన కాలంలో పంటకోతల సమయంలో పాడే జానపద గీతాలు తరవాత క్రిస్మస్ లో పాడే కరోల్స్ గా మారాయి.

ఈ పండగ సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ కార్డులు ఇవ్వటం, మంచి భోజనం చేయటం మరియు ఒకరికొకరు గిఫ్టులు ఇస్తూ బిజీ గా రోజును గడుపుతారు.

Source: Christmas – Wikipedia

Leave a Comment