సావిత్రి జీవిత చరిత్ర – Savitri biography in Telugu

సావిత్రి గణేశన్ భారత దేశానికి చెందిన నటి, ప్లే బ్యాక్ సింగర్, నర్తకి, దర్శకుడు మరియు నిర్మాత. సావిత్రి ముఖ్యంగా తెలుగు మరియు తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో పనిచేసారు. ఇవే కాకుండా కన్నడ, హిందీ, మలయాళం సినిమాలలో కూడా పనిచేసారు.

మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి 250 కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు. 1950, 60, 70 లలో ఎక్కువ పారితోషికం మరియు ఎక్కువ ప్రజాధారణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు.

ఈమెను మహానటి మరియు నడిగైయర్ తిలగం (నటులలో ప్రముఖ నటీమణి) అనే బిరుదులు కూడా లభించాయి.

బాల్యం :

నిస్శంకర సావిత్రి 6 డిసెంబర్ 1935వ సంవత్సరంలో గుంటూరు జిల్లా, చిర్రావూరు గ్రామం లో నిస్శంకర గురవయ్య మరియు నిస్శంకర సుభద్రమ్మ అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు సావిత్రి రెండవ సంతానం, ఈ దంపతుల మొదటి సంతానం మారుతి.

సావిత్రి ఆరు నెలల వయస్సు లో ఉన్నప్పుడు తండ్రి టైఫాయిడ్ తో చనిపోయారు. తండ్రి చనిపోయిన తరవాత తల్లి సావిత్రి మరియు మారుతి లను తీసుకొని విజయవాడ లో ఉన్న తన్న అక్క ఇంటికి వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరు కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్ లో చదువుకున్నారు.

స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఉన్న డాన్స్ స్కూల్ కూడా ఉండేది. రోజు ఆ స్కూల్ లో డాన్స్ చేయటాన్ని చూసి సావిత్రి కి కూడా అక్కడ చేరి సంగీతం మరియు శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్నారు. విజయవాడ లోనే తన నృత్య ప్రదర్శనలు చేసేవారు.

నాటకాలలో తన కళ్ళతో చేసే అభినయాన్ని అందరు మెచ్చుకునేవారు. సావిత్రి అనేక నాటకాలలో పాల్గొన్నారు. ఒకసారి ప్రిథ్వీరాజ్ కపూర్ సావిత్రి ను పూల దండ తో సత్కరించారు.

కెరీర్ :

సావిత్రి మొదటి సారి చెన్నై లోని విజయ వాహిని స్టూడియో లో సినిమాలలో అవకాశాల కోసం వెళ్ళినప్పుడు తిరస్కరించబడ్డారు.

ఇంకొక సారి అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు ఒక సినిమాలో ఒక పాత్ర కోసం అవకాశం లభించింది కానీ డైలాగ్స్ చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు మరియు హీరో ని చూసి విస్మయ పోయేవారు.

అదే సమయంలో తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి యొక్క ఫోటోలను తీసుకొని రెండు నెలల తరవాత రమ్మని చెప్పి పంపిస్తారు. చేసేదేం లేక సావిత్రి తిరిగి తన గ్రామానికి వెళ్లి నాటకాలను చేయటం ప్రారంభించారు.

ఒక రోజు సావిత్రి ఇంటికి ఒక వ్యక్తి సినిమా అవకాశం తీసుకొని వస్తాడు. అలా సావిత్రి యొక్క సినిమా జీవితం మొదలయ్యింది.

రూపావతి మరియు పాతాళ భైరవి సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేసారు. తరవాత సావిత్రి నటించిన పెళ్లి చేసి చూడు సినిమా కూడా విజయవంతం అయ్యింది. తరవాత దేవదాస్ మరియు మిస్సమ్మ లాంటి బ్లాక్ బాస్టర్స్ సినిమాలలో నటించారు.

దర్శకుడు PC రెడ్డి సావిత్రి గురించి మాట్లాడుతూ “ఆమె అందం మరియు ట్యాలెంట్ ముందు ఎవ్వరు పోటీ చేయలేరు. ఆమె ఇతరుల సలహాలను వినేది కాదు మరియు చాలా త్వరగా వివాహం చేసుకుంది. సెట్స్‌లో ఉన్నప్పుడు కూడా ఆమె మద్యపానానికి బానిసైందని నాకు గుర్తుంది. షూటింగ్ సమయంలో ఆమె నా చొక్కా పారేసింది. కానీ మరుసటి రోజు సావిత్రి నాకు కొత్త చొక్కా కొని తెచ్చింది. ఆమె చాలా ఉదారమైన స్త్రీ ” అని చెప్పారు.

సావిత్రి బాలీవుడ్ సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ లభించలేదు. 1973 సంవత్సరంలో చుజి (Chuzhi) అనే ఒకే ఒక్క మలయాళం సినిమాలో నటించారు.

1957 వ సంవత్సరంలో నటించిన మాయాబజార్ సినిమా ఆమె అభినయం సావిత్రి స్టార్‌డమ్‌కి ఆకాశానికెత్తేసింది. తరవాత సౌత్ ఇండియన్ సినిమాలో ఎక్కువగా పారితోషికం తీసుకున్న నటిగా నిలిచారు.

సావిత్రి తన ఆతిథ్యం, దాన గుణం కోసం ప్రసిద్ధి చెందారు. ఆస్తి మరియు నగలు కొనడానికి ఇష్టపడేవారు. సావిత్రి ఆమె తన ఖర్చుపై నియంత్రణ ఎక్కువగా చేయలేక పోయారు.

1960 వ సంవత్సరంలో చివరికు మిగిలేది అనే సినిమాకు గాను రాష్ట్రపతి అవార్డు (ఇప్పుడు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు) లభించింది.

1968 సంవత్సరంలో చిన్నారి పాపలు అనే సినిమాకు నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాకు Nandi Award for Best Feature Film లభించింది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఫలితంగా భారీ నష్టాలను చూడవలసి వచ్చింది, మద్యానికి కూడా బానిసయ్యారు.

1952 లో జెమినీ గణేశన్ ను సావిత్రి పెళ్లిచేసుకున్నారు. కుటుంబం వారు ఈ పెళ్ళికి వ్యతిరేకత తెలిపారు ఎందుకంటే అంతకు ముందే గణేశన్ కు పెళ్లి అయ్యింది మరియు నలుగురు కూతుళ్లు కూడా ఉన్నారు. అదే సమయంలో పుష్పవల్లి అనే నటితో కూడా రిలేషన్ లో ఉన్నారు. ఇవన్నీ లెక్కచేయకుండా సావిత్రి జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకుంది.

క్రమంగా ఆర్థికంగా సావిత్రి చాలా నష్టపోయారు. తన ఆర్థిక పరిస్థితి ను చూసిన దాసరి నారాయణ రావు గారు తన నిర్మించిన సినిమాలలో సావిత్రికి అవకాశాలను ఇచ్చారు.

మరణం :

సావిత్రి డయాబెటిస్ మరియు బ్లడ్ ప్రెషర్ బారిన పడ్డారు. 26 డిసెంబర్ 1981 సంవత్సరంలో 19 నెలలు కోమాలో ఉండి 46 సంవత్సరాల వయస్సులో సావిత్రి చనిపోయారు.

Source: Savitri (actress) – Wikipedia

Leave a Comment