రాజేంద్ర ప్రసాద్ భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది, స్వాతంత్ర సమార యోధుడు, విలేఖరి మరియు పండితుడు. స్వాతంత్రం వచ్చిన తరవాత 1950 నుంచి 1962 వరకు భారత దేశానికి మొట్ట మొదటి రాష్ట్రపతి గా ఉన్నారు.
Table of Contents
బాల్యం :
రాజేంద్ర ప్రసాద్ 3 డిసెంబర్, 1884 లో బ్రిటిష్ రాజ్యం సమయంలో శివాన్ జిల్లాలోని జిరాడీ లో జన్మించారు.
ఈయన తండ్రి మహాదేవ్ సహాయ్ శ్రీవాస్తవ, సంస్కృతం మరియు పెర్షియన్ భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరి దేవి దైవ భక్తురాలు, తన కొడుకుకి రామాయణ మరియు మహాభారత కథలను చెప్పేవారు.
రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంలో అందరికన్నా చిన్న వారు. ఈయనకు ఒక అన్నయ్య మరియు ముగ్గురు అక్కలు ఉన్నారు. చిన్న తనంలోనే తన తల్లిని కోల్పోయారు తరవాత తన బాగోగులు అక్క చూసుకునేది.
చదువు :
ఎలిమెంటరీ చదువు పూర్తి చేసుకున్న తరువాత ఛాప్రా డిస్ట్రిక్ట్ స్కూల్ లో చేరారు. 1896 లో 12 సంవత్సరాల రాజేంద్ర ప్రసాద్ రాజవంశీ దేవి ను పెళ్లి చేసుకున్నారు.
రాజేంద్ర ప్రసాద్ తన సోదరుడు మహేంద్ర ప్రసాద్ తో కలిసి పాట్నా మరియు కలకత్తా లో చదివారు. అదే సమయంలో కలకత్తా విశ్వవిద్యాలయం లో 30 రూపాయల స్కాలర్ షిప్ ను పొందారు. 1905 వ సంవత్సరంలో తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.
తరవాత ఆర్ట్స్ లో మరియు ఎకనామిక్స్ లో M. A ను డిసెంబర్ 1907 లో పూర్తి చేసారు. కోల్కత్తాలో ఉన్న సమయంలో ది డాన్ సొసైటీ లో చేరారు.
తన కుటుంబ బాధ్యతల కారణంగా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ లో చేరలేకపోయారు. అదేసమయంలో తల్లి చనిపోయారు. అదే సమయంలో తన సోదరి యొక్క భర్త చనిపోవటం వల్ల పుట్టింటికి వచ్చింది.
1906వ సంవత్సరంలో బిహారి స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ ను స్థాపించటంలో కీలక పాత్ర వహించారు. మొదటి సారి ఇలాంటి కాన్ఫరెన్స్ ను తయారు చేయటం జరిగింది.
కెరీర్ :
రాజేంద్ర ప్రసాద్ పలు విద్యా సంస్థలలో టీచర్ గా పని చేసారు. MA ఎకనామిక్స్ చదువు పూర్తిచేసుకున్న తరువాత బీహార్ లోని ముజఫ్ఫర్ నగరంలోని లంగత్ సింగ్ కాలేజిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా చేరారు.
ప్రొఫెసర్ గా చేరి ప్రిన్సిపల్ గా ప్రమోట్ అయ్యారు. తరవాత ఈ కాలేజీ ను వదిలేసి లా (Law) చదువును చదవటానికి కోల్కత్తా లోని రిపన్ కాలేజ్ (ఇప్పుడు సురేంద్రనాథ్ లా కళాశాల) లో చేరారు.
1909 సంవత్సరంలో తన లా చదువును చదువుతున్న సమయంలో కలకత్తా సిటీ కాలేజీ లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా కూడా పనిచేసారు.
1915 వ సంవత్సరంలో లా లో మాస్టర్స్ చేయటానికి కోల్కత్త యూనివర్సిటీ నుంచి పరీక్ష రాసారు. ఈ పరీక్ష పాసై గోల్డ్ మెడల్ కూడా కూడా సంపాదించారు.
తరవాత అలహాబాద్ యూనివర్సిటీ నుంచి లా లో డాక్టరేట్ ను పూర్తి చేసారు. 1916 లో బీహార్ మరియు ఒరిస్సా హై కోర్ట్ లో చేరారు.
బీహార్ యొక్క సిల్క్ టౌన్ అయిన భాగల్ పుర్ లో న్యాయవాది గా ప్రాక్టీస్ చేసారు.
స్వాతంత్ర ఉద్యమంలో :
రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్రను పోషించారు. 1906వ సంవత్సరంలో చదువుకుంటున్న రోజులలో ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం సమయంలో పాల్గొన్నారు.
1911వ సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. 1916 లో జరిగిన లక్నో లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీ ను కలుసుకున్నారు.
ప్రసాద్ మహాత్మా గాంధీ తో కలిసి పనిచేయటం మొదలుపట్టిన తరవాత గాంధీ గారి అంకితభావం, ధైర్యం మరియు దృఢ నిశ్చయంతో ఎంతగానో ప్రభావితుడయ్యాడు.
1920 వ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో మంచి సంపాదన ఉన్న న్యాయవాది ఉద్యోగాన్ని మరియు యూనివర్సిటీ లో విధులను వదిలేసి ఉద్యమంలో చేరారు.
పాశ్చాత్య విద్యా సంస్థలను బహిష్కరించాలని గాంధీ పిలుపును ఇచ్చినప్పుడు ప్రసాద్ కొడుకు మృత్యుంజయ ప్రసాద్ ను సాంప్రదాయ భారతీయ నమూనా కాలేజి అయిన బీహార్ విద్య పీట్ లో చేర్పించారు. ఈ కాలేజి ను రాజేంద్ర ప్రసాద్ మరియు తన సహోద్యుగులు కలిసి ప్రారంభించారు.
స్వాతంత్ర ఉద్యమం సమయంలో ప్రసాద్ రాహుల్ సాంకృత్యాయన్ అనే రచయిత మరియు బహు శాస్త్రజ్ఞుడి ను కలిసారు. సాంకృత్యాయన్ ప్రసాద్ యొక్క మేధో శక్తులచే బాగా ప్రభావితమయ్యాడు మరియు ప్రసాద్ ను తన మార్గదర్శి మరియు గురువుగా గుర్తించారు.
1914 లో బీహార్ మరియు బెంగాల్ లో వచ్చిన వరదల కారణంగా ప్రభావితమైన ప్రజలకు సహాయాన్ని అందించారు. 1934 వ సంవత్సరంలో బీహార్ లో వచ్చిన భూకంపం సమయంలో ప్రసాద్ జైలు లో ఉన్నారు. జైలు నుంచే భూకంపం ద్వారా ప్రభావితులైన ప్రజలకు సహాయం చేసారు.
1935 వ సంవత్సరంలో క్వెట్టా లో భూకంపం వచ్చినప్పుడు ప్రభుత్వం అక్కడికి వెళ్లవద్దని Quetta Central Relief Committee పేరుతో సహాయాన్ని అందించారు.
1934 వ సంవత్సరంలో బాంబే లో జరిగిన సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు అయ్యారు. 1939 లో సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరవాత తిరిగి అధ్యక్షుడి గా ఎన్నుకోబడ్డారు.
ఆగస్ట్ 8, 1942 సంవత్సరంలో బాంబే లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అనేక నాయకులు అరెస్ట్ అయ్యారు. సదఖత్ ఆశ్రమం వద్ద ప్రసాద్ ను కూడా అరెస్ట్ చేసి బంకీపూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.
3 సంవత్సరాల నిర్బంధనలో ఉన్న తరవాత 15 జూన్ 1945 వ సంవత్సరం విడుదల అయ్యారు.
సెప్టెంబర్ 2 1946 సంవత్సరంలో జవహర్ లాల్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నుకోబడ్డారు.
11 డిసెంబర్ 1946 సంవత్సరంలో రాజ్యాంగ సభ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు.
17 నవంబర్ 1947 వ సంవత్సరంలో మూడవ సారి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు.
రాష్ట్రపతి :
స్వాతంత్రం వచ్చిన రెండున్నర సంవత్సరాల తరవాత భారత రాజ్యాంగం ఆమోదించబడింది. ప్రసాద్ భారత దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు.
భారత రాష్ట్రపతిగా, ప్రసాద్ రాజ్యాంగం అనుసారం వ్యవహరించారు మరియు ఏ రాజకీయ పార్టీకి పక్షం చూపకుండా లేకుండా ఉన్నారు. ప్రసాద్ భారతదేశ రాయబారిగా ప్రపంచం అంతటా పర్యటించారు. ఇతర దేశాలతో దౌత్యపరమైన (diplomatic) సంబంధాలను ఏర్పరిచారు.
ప్రసాద్ వరుసగా రెండు సార్లు 1952 మరియు 1957 సంవత్సరాలలో రాష్ట్రపతి గా ఎన్నికయ్యారు.భారత రాష్ట్రపతి లలో ప్రసాద్ ఒక్కరే ఇలా ఎన్నికయ్యారు.
ప్రసాద్ రాజ్యకీయాలతో సంభందం లేకుండా స్వాతంత్రంగా పనిచేసారు. Hindu code bill సమయంలో జరిగిన తగాదా లో మరింత చురుకుగా పనిచేసారు.
12 సంవత్సరాలు రాష్ట్రపతిగా ఉన్న తరవాత 1962లో పదవి విరమణ చేసారు. రాజేంద్ర ప్రసాద్ కు దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వటం జరిగింది.
మరణం :
28 ఫిబ్రవరి 1963 వ సంవత్సరంలో 78 సంవత్సరాల రాజేంద్ర ప్రసాద్ తన తుడు శ్వాస ను విడిచారు. పాట్నాలో ఉన్న రాజేంద్ర స్మృతి సంగ్రహాలయం ఆయనకు అంకితం చేయబడింది.
Source: Rajendra Prasad – Wikipedia