సిల్క్ స్మిత జీవిత చరిత్ర – Silk Smitha biography in Telugu

సిల్క్ స్మిత భారతదేశానికి చెందిన నటి మరియు డాన్సర్. ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ సినిమాలలో నటించింది. 1980లలో విడుదలైన సినిమాలలో సిల్క్ స్మిత చేసిన ఐటెం సాంగ్ లు మంచి విజయాన్ని సాధించాయి.

టచ్-అప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సిల్క్ స్మిత ఐటెం సాంగ్ లను చేసి మంచి గుర్తింపు పొందారు.

బాల్యం :

స్మిత యొక్క అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి కానీ సినిమాలలోకి వచ్చిన తరవాత పేరును మార్చుకున్నారు. స్మిత డిసెంబర్ 2 1960 వ సంవత్సరంలో ఏలూరు జిల్లా, దెందులూరు మండలం లోని కొవ్వలి గ్రామం లో జన్మించారు. స్మిత కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కేవలం 4 వ తరగతి వరకే చదివారు.

చిన్నతనం నుంచే అందంగా ఉండటం మరియు ఆకర్షణీయంగా ఉండటం వల్ల చాలా మంది ఆమె వెంటపడేవారు. ఫలితంగా స్మిత కు చిన్న వయస్సులోనే పెళ్లి చేసేసారు. పెళ్లి తరవాత స్మిత యొక్క భర్త మరియు అత్తమామలు సరిగా చూసుకోక పోవటంతో అక్కడినుంచి పారిపోయారు.

సినిమా జీవితం :

టచ్ అప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి న స్మిత కు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయటం మొదలుపెట్టారు.

ఆంథోనీ ఈస్ట్‌మన్ దర్శకత్వం వహించిన మలయాళ సినిమా ఇనాయె తేది (Inaye Thedi) లో హీరోయిన్ గా నటించారు. ఆంథోనీ నే స్మిత అనే పేరును ఇచ్చారు.

తమిళ డైరెక్టర్ విను చక్రవర్తి ద్వారా తమిళ సినీ ప్రపంచంలో మంచి అవకాశాలను పొందారు. విను చక్రవర్తి యొక్క భార్య స్మిత కు ఇంగ్లీష్ మాట్లాడటం మరియు డాన్స్ చేయటం నేర్పించారు.

అందంగా మరియు ఆకర్షణీయంగా ఉన్న స్మిత క్యాబరే డాన్సర్ గా మరియు నెగటివ్ రోల్స్ లలో నటించటం ప్రారంభించారు.

1979 లో విడుదల అయిన సినిమా వండిచక్రం సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా తరవాత స్మిత కు మంచి గుర్తింపు లభించింది. ఫలితంగా ఆ సినిమాలో తన పాత్ర పేరు అయిన సిల్క్ ను నిజ జీవితంలో కూడా ఉపయోగించటం మొదలుపెట్టారు. ఇలా విజయలక్ష్మి వడ్లపాటి నుంచి సిల్క్ స్మిత గా మారారు.

ఈ సినిమాలో తన పాత్ర మంచి ఆదరణ పొందటం మరియు సినిమా హిట్ కావటంతో తన మిగతా కెరీర్ కూడా స్మిత అలాంటి పాత్రలనే చేయటం కొనసాగించారు.

స్మిత క్రమ క్రమంగా తమిళ్ , తెలుగు, మలయాళం, కన్నడ మరియు కొన్ని హిందీ సినిమాలలో నటించటం ప్రారంభించారు. సిల్క్ స్మిత చేసిన ఐటెం సాంగ్స్ మరియు బోల్డ్ యాక్టింగ్ కారణంగా సౌత్ సినిమా ప్రపంచంలో ఒక గ్లామర్ తార గా వెలిగిపోయారు.

సినిమాలకు రివ్యూలు ఇచ్చే కొంత మంది సిల్క్ స్మిత ను సాఫ్ట్ పోర్న్ నటి అని అన్నారు. తాను చేసిన చాలా సినిమాలలో బికినీలు ధరించటం మరియు అందాలను ప్రదర్శించటం కారణంగా ఆ రోజులలో అలాంటి సినిమాలను సాఫ్ట్‌కోర్ మూవీస్ గా పరిగణించేవారు.

సిల్క్ స్మిత రొమాంటిక్ పాత్రలే కాకుండా కొన్ని సినిమాలలో మంచి నటనను కూడా చేసి క్రిటిక్స్ చేత ప్రశంసలు అందుకున్నారు.

1989 లో నటించిన లాయనం అనే శృంగారభరిత డ్రామా సినిమా భారతదేశ అడల్ట్ ఇండస్ట్రీ లో చాలా పాపులర్ అయ్యింది. హిందీ లో ఇదే సినిమా Reshma Ki Jawani రేష్మ కి జవానీ అనే పేరు తో రిలీజ్ అయ్యింది.

మరణం :

సిల్క్ స్మిత సూసైడ్ చేసుకొని 23 సెప్టెంబర్ 1996 సంవత్సరంలో చనిపోయారు. స్మిత నమ్మి ప్రేమించిన వ్యక్తి ద్రోహం చేయటం మరియు అవకాశాలు లభించక పోవటం. అలాగే సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యేవారు.

చనిపోయే ఒక రోజు ముందు కూడా తన స్నేహితురాలు మరియు డాన్సర్ అయిన అనురాదాకు కాల్ చేసారు. అనురాధ బిజీ గా ఉండటం వల్ల సిల్క్ స్మిత ను కలవలేకపోయారు.

సిల్క్ స్మిత ఇంట్లో ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది, దాంట్లో రాసిన విషయాలు సరిగా లేకపోవటం వల్ల అర్తం చేసుకోవటం కష్టమైంది.

పోస్టుమార్టం తరవాత సిల్క్ స్మిత సూసైడ్ ద్వారా చనిపోయిందని మరియు చనిపోయే ముందు ఎక్కువగా మద్యం సేవించారని తెలిసింది.

Source: Silk Smitha – Wikipedia

Leave a Comment