గెరాల్డ్ ఆండర్సన్ లాసన్ అమెరికాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈయన ఫెయిర్‌చైల్డ్ ఛానల్ F వీడియో గేమ్ కన్సోల్ ను తయారు చేయటంలో ముఖ్య పాత్రను వహించారు.
వీడియో గేమ్ ప్రపంచం యొక్క రూపు రేఖలను మార్చిన వ్యక్తి గెరాల్డ్ ఆండర్సన్ లాసన్.
కమర్షియల్ వీడియో గేమ్ కాట్రిడ్జ్‌ను మొట్ట మొదటి సారి తయారు చేసిన బృందానికి నాయకుడిగా కూడా ఉన్నారు.
2022 లో అయన చేసిన కృషి కి గాను గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ డూడుల్ ద్వారా గౌరవించారు.
బాల్యం :
లాసన్ డిసెంబర్ 1, 1940 సంవత్సరంలో న్యూయార్క్ నగరం లోని బ్రూక్లిన్ పట్టణం లో జన్మించారు. ఈయన తండ్రి బ్లాంటన్ లేబర్ గా పనిచేసేవారు.లాసన్ తల్లి మానింగ్స్ లోకల్ స్కూల్ లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సంఘం లో పనిచేసేవారు.
లాసన్ యొక్క తాతయ్య ఒక భౌతిక శాస్త్రవేత్త అవ్వాలని అనుకున్నారు కానీ అవ్వలేకపోయారు. ఒక పోస్ట్ మాస్టర్ గా ఉద్యోగం చేసేవారు.
లాసన్ కి తల్లి తండ్రులు మంచి విద్యను అందించారు. లాసన్ అభిరుచులు అయిన రేడియో మరియు కెమిస్ట్రీ లను నేర్చుకోవటంలో కూడా ప్రోత్సహించారు.
చిన్న తనంలోనే లాసన్ టీచర్ కూడా బాగా ప్రోత్సహించేవారు, గొప్ప వ్యక్తి అవ్వాలని చెప్పేవారు. యవ్వన వయస్సులో టీవీ లను రిపేర్ చేసి డబ్బులను సంపాదించేవారు.
13 సంవత్సరాల వయస్సులో హామ్ రేడియో లైసెన్స్ ను సంపాదించి లోకల్ ఎలక్ట్రానిక్ దుకాణాల పార్ట్స్ ను కొని తన సొంతస్టేషన్ ను నిర్మించుకున్నారు.
కెరీర్ :
1970 వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కొ లోని ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్ కంపెనీ లో సేల్స్ విభాగంలో అప్లికేషన్స్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా పనిచేసేవారు.
అక్కడ పనిచేస్తున్న సమయంలో కాయిన్ ద్వారా నడిచే ఆర్కేడ్ గేమ్ Demolition Derby (డెమోలిషన్ డెర్బీ) ను తన గ్యారేజ్ లో తయారు చేసారు.
1975వ సంవత్సరంలో ఫెయిర్‌చైల్డ్ కంపెనీ యొక్క F8 మైక్రోప్రాసెసర్లను ఉపయోగించి పూర్తి చేసారు. Demolition Derby మైక్రోప్రాసెసర్ ద్వారా తయారు చేయబడ్డ మొట్ట మొదటి వీడియో గేమ్.
తరవాత లాసన్ చీఫ్ హార్డ్‌వేర్ ఇంజనీర్ గా మరియు ఫెయిర్‌చైల్డ్ యొక్క వీడియో గేమ్ విభాగానికి ఇంజినీరింగ్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్ గా ఎన్నుకోబడ్డారు.
అక్కడ పనిచేస్తున్న సమయంలో ఫెయిర్‌చైల్డ్ ఛానల్ F కన్సోల్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.
ఈ కన్సోల్ 1976 వ సంవత్సరంలో విడుదల చేయబడింది. ఈ కన్సోల్ ను ఉపయోగించి గేమ్ కాట్రిడ్జ్‌లను మర్చి ఆడవచ్చు.
ఆ రోజులలో చాలా గేమ్స్ సిస్టం లోని హార్డ్ వేర్ లోనే ఇన్స్టాల్ అయ్యి ఉండేవి. వీటిని తొలగించడం కానీ లేదా మార్చటం కానీ సాధ్యమయ్యేది కాదు.
కానీ లాసన్ ఆ సమయంలో ఉన్న టెక్నాలజీ ను మెరుగుపరిచి గేమ్స్ లను ఒక సాఫ్ట్ వేర్ రూపంలో ఇన్స్టాల్ చేసే రోమ్ కాట్రిడ్జ్‌లను తయారు చేసారు.
ఈ కాట్రిడ్జ్‌లను సులువుగా తొలగించను వచ్చు మరియు మార్చు కోవచ్చు కూడా.
ఇలా కాట్రిడ్జ్‌లను తయారు చేసిన తరువాత గేమ్స్ ఇష్టపడేవారు తమకు నచ్చిన గేమ్స్ లను ఒకే దగ్గర జమ చేసుకొని ఉంచేవారు.
ఫెయిర్ చైల్డ్ కంపెనీ లో పనిచేస్తున్న సమయంలో లాసన్ మరియు రాన్ జోన్స్ హోమ్బ్రూ కంప్యూటర్ క్లబ్ లో చేరిన ఏకైక నల్ల జాతీయులు. ఈ క్లబ్ లో కంప్యూటర్స్ మీద ఇష్టం ఉన్న వారు చేరేవారు.
ప్రముఖ వ్యక్తులైన మరియు ఆపిల్ సంస్థపుకులైన స్టీవ్ జాబ్స్ మరియు స్టీవ్ వోజ్నియాక్ ఇదే క్లబ్ కు చెందిన వారు.
ఫెయిర్ చైల్డ్ లో చేరటానికి ఆపిల్ ఫౌండర్ వోజ్నియాక్ ఇంటర్వ్యూ ఇవ్వగా అతనిని సెలెక్ట్ చేసుకోలేదు.
1980 వ సంవత్సరంలో లాసన్ ఫెయిర్ చైల్డ్ ను వదిలేసి వీడియో సాఫ్ట్ అనే కంపెనీను ప్రారంభించారు. ఈ కంపెనీ Atari 2600 అనే వీడియో కంప్యూటర్ సిస్టం కోసం సాఫ్ట్ వేర్ ను తయారు చేసేవారు. 5 సంవత్సరాల తరవాత కంపెనీ మూట పడిపోయింది.
2011 వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ గేమ్ డెవలపర్స్ అసోసియేషన్ (IGDA) ద్వారా గేమ్ కాట్రిడ్జ్ కాన్సెప్ట్‌పై చేసిన కృషికి గాను లాసన్‌ను ఇండస్ట్రీ యొక్క మార్గదర్శకుడిగా గౌరవించారు.
2019 వ సంవత్సరంలో జరిగిన ఇండిపెండెంట్ గేమ్స్ ఫెస్టివల్ లో లాసన్ కాట్రిడ్జ్ గేమ్ కన్సోల్ ను తయారు చేసినందుకు గాను ID@Xbox గేమింగ్ హీరోస్ అవార్డు తో గౌరవించారు.
ది స్ట్రాంగ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ప్లే లో గేమింగ్ ఇండస్ట్రీ లో తాను చేసిన కృషికి గాను The World Video Game Hall of Fame లో శాశ్వత డిస్పాల్య్ ను ఉంచారు.
మరణం :
2003 వ సంవత్సరంలో డయాబెటిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చటంతో ఒక కాలు మరియు ఒక కంటి ను కోల్పోయారు. ఏప్రిల్ 9,2011 వ సంవత్సరంలో డయాబెటిస్ సమస్యల ద్వారా మరణించారు.