టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర – Tanguturi Prakasam Biography in Telugu

టంగుటూరి ప్రకాశం పంతులు భ్రాతదేశానికి చెందిన న్యాయవాది, వలసవాద వ్యతిరేక జాతీయవాది,రాజకీయ నాయకుడు, మరియు సంఘ సంస్కర్త.

బ్రిటిష్ పాలన లో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ కి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు.

టంగుటూరికు ఆంధ్ర కేసరి (ఆంధ్ర సింహం) అనే బిరుదు కూడా ఉంది.

బాల్యం :

టంగుటూరి ప్రకాశం పంతులు 23 ఆగస్టు 1872 వ సంవత్సరంలో మదరాసు ప్రెసిడెన్సీ (ఇప్పటి ప్రకాశం జిల్లా), ఒంగోలు నగరం లోని వినోదరాయునిపాలెం అనే గ్రామంలో సుబ్బమ్మ మరియు గోపాలకృష్ణయ్య అనే దంపతులకు జన్మించారు.

11 సంవత్సరాల తండ్రి గోపాలకృష్ణయ్య మరణించటంతో ప్రకాశం తల్లి ఒంగోలులో వసతి గృహాన్ని నడిపేవారు. ఆ రోజులలో ఈ వృత్తిని చేసేవారిని చిన్నచూపు చూసేవారు.

చిన్న తనం నుంచే నాటకాలు బాగా వేసేవారు, అందంగా తెల్లగా ఉండటం కారణం తో ఆడ మగ రెండు వేషాలు వేసేవారు. చిన్న తనం నుంచే ప్రకాశానికి లాయర్ అవ్వాలనే కోరిక ఉండేది కానీ చేదు సావాసాల వల్ల మెట్రిక్యూలేషన్ లో పాస్ అవ్వలేకపొయ్యారు.

పాఠశాల టీచర్ హనుమంతరావు నాయుడు ప్రకాశాన్ని ఫీజు లేకుండా మెట్రిక్యూలేషన్ లో చేర్పించాడు.

ప్రకాశానికి మంచి విద్య అందించడానికి టీచర్ హనుమంతరావు నాయుడు తనతో పాటు రాజమండ్రికి తీసుకెళ్లారు.

తరవాత మద్రాస్ లో న్యాయశాస్త్రం చదవటానికి వెళ్లారు, సెకండ్ గ్రేడ్ ప్లీడర్ అయ్యారు. 1890 సంవత్సరంలో తన అక్క కూతురు హనుమాయమ్మను పెళ్లి చేసుకున్నారు.

ఒంగోలులో కొన్ని రోజులు లాయర్ గా పనిచేసి రాజమండ్రికి వెళ్లారు. న్యాయవాద వృత్తిలో బాగా పేరు మరియు సంపదను సంపాదించారు. 1904 వ సంవత్సరంలో రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు.

ప్రకాశం విద్యకు కావాల్సిన ఖర్చును జమీందారు కంచుమర్తి రామచంద్రరావు భరించారు. రామచంద్రరావు మరియు ప్రకాశం యొక్క రాజకీయలలో వేరు వేరు పక్షాలలో ఉన్న రామచంద్ర రావు ప్రకాశం ను బాగా సహకరించారు.

ఒకసారి మద్రాస్ లో కేసు గురించి వెళ్ళినప్పుడు, ప్రకాశం ప్రతిభను చూసిన ఒక బారిష్టర్ సెకండ్ గ్రేడ్ ప్లీడర్ నుంచి బారిష్టర్ గా అవ్వమని సలహా ఇచ్చాడు. సెకండ్ గ్రేడ్ ప్లీడర్ హై కోర్ట్ లలో వాదించలేరు

ఆ రోజులలో వేరేదేశాలకు వెళ్ళటం అనేది సాధారణ విషయం కాదు. వెళుతున్న సమయంలో తన తల్లి తో ఇంగ్లాండ్ వెళ్లిన తరవాత మాంసం, ధూమపానం మరియు మద్యానికి దూరంగా ఉంటానని మాటిచ్చారు.

న్యాయవాది గా ప్రకాశం :

1904 లో ఇంగ్లాండ్ కు చేరుకున్న తరవాత రాయల్ ఇండియన్ సొసైటీ లో చేరారు. లండన్ లో చదువును పూర్తిచేసుకొని తిరిగి మద్రాస్ హై కోర్ట్ కి వచ్చారు. తెలుగు ప్రజలలో బారిష్టర్ గా అయ్యిన మొట్ట మొదటి వ్యక్తి ప్రకాశం గారు. ఆ రోజుల్లో ఎక్కువ శాతం లాయర్లు తమిళులు లేదా యూరోపియన్లు ఎక్కువగా ఉండేవారు.

లాయర్ గా క్రిమినల్ మరియు సివిల్ కేసులను వాదించేవారు. తిరునెల్వేలి కలెక్టర్ రాబర్ట్ ఆషే ను చంపిన వాంచినాథన్ కు తక్కువ శిక్ష పడేలా చేసారు.

అదే సమయంలో ప్రకాశం ఉండే ప్రాంతంలో బిపిన్ చంద్ర పాల్ జాతీయవాదం పై ప్రసంగాలు చేసేవారు. తరవాత బిపిన్ చంద్ర పాల్ ప్రసంగాలకు అధ్యక్షత కూడా వహించారు.

అప్పటి ప్రభుత్వం ప్రకారం బిపిన్ ప్రసంగాలు దేశద్రోహముగా పరిగణించేబడేవి అందుకే ప్రసంగాలకు అధ్యక్షత వహించడానికి ఎవ్వరు కూడా ముందుకువచ్చే వారు కాదు.

లక్నో ఒప్పందం తరవాత కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు అయ్యేవారు. అక్టోబర్ 1921 లో సాథారహ ప్రతిజ్ఞ కూడా చేసారు.

మంచి లాభదాయకమైన న్యాయవాద వృతిని వదిలేసి స్వరాజ్య అనే వార్త పత్రిక కు ఎడిటర్ గా పనిచేయటం మొదలుపెట్టారు. ఈ వార్త పత్రిక తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ మూడు భాషలలో కూడా ప్రచురించబడేది.

ప్రకాశం జాతీయ పాఠశాల మరియు ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నడిపేవారు. డిసెంబర్ 1921 లో అహ్మదాబాద్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఏ ప్రాంతంలోనైనా అల్లర్లు జరిగితే ప్రకాశం అక్కడికి చేరుకొని ప్రజలను ఓదార్చేవారు. పంజాబ్ లో ఆకలి సత్యాగ్రహ సమయంలో మరియు ముల్తాన్ లో జరిగిన హిందూ ముస్లింల అల్లర్ల సమయంలో ఆయా ప్రాంతాలను పర్యవేక్షించారు.

1922వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమ సమయంలో గుంటూరులో 30,000 మంది కాంగ్రెస్ వాలంటీర్లతో ప్రదర్శనలు నిర్వహించారు.

ఆంధ్రకేసరి : 

సైమన్ కమిషన్ ఇండియా లో సందర్శించినప్పుడు ప్రజలు “Simon, go back” అనే నినాదంతో బహిష్కరించారు.

ఈ బహిష్కరణ వెనక ఉన్న ముఖ్య కారణం కమిషన్ లో ఒక్క భారతీయుడు కూడా ఉండకపోవటం.

3 ఫిబ్రవరి 1928వ సంవత్సరంలో సైమన్ కమిషన్ మద్రాస్ కి వెళ్ళినప్పుడు ప్రకాశం “Go back Simon Commission” అనే నినాదం తో బహిష్కరణ చేసారు.

ప్రకాశం అధ్యక్షత వహిస్తున్న ప్రజలు మద్రాస్ హైకోర్టు వద్ద ఎక్కువ సంఖ్యలో గుమికూడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. జనాలను చెల్లా చెదురు చేయటానికి జరిపిన పోలీసుల కాల్పులలో పార్థ సారథి అనే యువకుడుఅక్కడికక్కడే మరణించాడు.

ఆ మృతదేహానికి ఎవరైనా దగ్గరికొస్తే కాలుస్తామని హెచ్చరించగా ప్రకాశం కోపంతో తన రొమ్మును చూపించి ధైర్యముంటే కాల్చమని సవాలు చేసారు.

ప్రకాశం చూపించిన ధైర్య సాహసాలకు ఆంధ్ర కేసరి (ఆంధ్ర సింహం) అని బిరుదు ఇచ్చారు.

ముఖ్యమంత్రి :

1946 లో జరిగిన ఎన్నికలలో ప్రకాశం ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ ప్రకాశం ప్రభుత్వం 11 నెలలు మాత్రమే అధికారంలో ఉంది.

స్వాతంత్రం వచ్చిన తరవాత మరియు తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో టంగుటూరి ప్రకాశం మొదటి ముఖ్యమంత్రి గా ఎనుకోబడ్డారు.

రాజకీయ నాయకులే కాకుండా ప్రజలు కూడా ప్రకాశం ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు.

అవినీతి ఆరోపణలు మరియు కమ్యూనిస్టుల నుండి వ్యతిరేకత కారణంగా కేవలం ఒక సంవత్సరం తరవాత ప్రకాశం ప్రభుతం పడిపోయింది.

Source: Tanguturi Prakasam – Wikipedia

Leave a Comment