వినాయక్ దామోదర్ సావర్కర్ జీవిత చరిత్ర – Vinayak Damodar Savarkar Biography in Telugu

వినాయక్ దామోదర్ సావర్కర్ భారత దేశానికి చెందిన రాజకీయ నాయుడు, కార్యకర్త మరియు రచయిత. సదాశివ రాజారాం రానాద్ 1924 వ సంవత్సరంలో సావర్కర్ జీవితచరిత్ర రాస్తున్నప్పుడు స్వతంత్ర వీర్ అని కొనియాడారు. సావర్కర్ అనుచరులు కూడా పేరుకు ముందు ” వీర్ ” అని పెట్టి పిలిచేవారు.

1922 వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని రత్నగిరి జైలులో బందీగా ఉన్నపుడు హిందుత్వా రాజకీయ సిద్ధాంతాలను హిందూ జాతీయవాది గా ఏర్పాటు చేసుకున్నారు.

బాల్యం :

వినాయక్ దామోదర్ సావర్కర్ 28 మే 1883 వ సంవత్సరంలో, మహారాష్ట్రలోని నాసిక్ నగరం, భాగుర్ గ్రామంలోని దామోదర్ మరియు రాధాబాయి అనే మరాఠీ బ్రాహ్మణ దంపతులకు జన్మించారు.

సావర్కర్ కు ముగ్గురు తోబుట్టువులు గణేష్, నారాయణ్ మరియు చెల్లెలు మైన. హై స్కూల్ లో చదువుతున్న సమయంలోనే కార్యకర్త గా పనిచేయటం మొదలుపెట్టారు.

12 సంవత్సరాల వయస్సులో హిందూ – ముస్లిం సముదాయాల మధ్య అల్లర్లు జరిగినప్పుడు, తన తోటి విద్యార్థులతో కలిసి గ్రామంలో ఉన్న మసీదును ద్వంసం చేసి ” మా హృదయ పూర్వకంగా మసీదును ద్వంసం చేసాము” అని చెప్పారు.

1903 వ సంవత్సరంలో తన తమ్ముడు గణేష్ సావర్కర్ తో కలిసి ఒక రహస్య విప్లవ సంస్థ అభినవ్ భారత్ సొసైటీ ను ప్రారంభించారు.

ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం బ్రిటిష్ ప్రభుత్వాన్ని గద్దె దించటం మరియు హిందువుల యొక్క ఆత్మ గౌరవాన్ని పునరుద్దరించటం.

కార్యకర్త :

పూణే లోని ఫెర్గూసన్ కాలేజీ లో చదువుతున్న సమయంలో రాజకీయ కార్యకర్త గా ఉన్నారు. రాడికల్ జాతీయ వాది అయిన లోకమాన్య తిలక్ ద్వారా సావర్కర్ చాలా ప్రభావితులయ్యారు.

సావర్కర్ కార్యకర్త గా పనిచేస్తున్న తీరును చూసిన తిలక్ మెచ్చుకున్నారు. 1906 వ సంవత్సరంలో సావర్కర్ కు లండన్ లో లా చదువు కోసం స్కాలర్ షిప్ సంపాదించటం లో సహాయం చేసారు.

లండన్ లో ఉన్న సమయంలో ఇండియా హౌస్ మరియు ఫ్రీ ఇండియా సొసైటీ అనే సంస్థలలో చేరారు.

భారత దేశానికి స్వాతంత్రం కేవలం విప్లవం ద్వారానే వస్తుందని సమర్ధించారు, ఇదే విషయం పై పుస్తకాలు కూడా రాసారు.

సావర్కర్ ప్రచురించిన పుస్తకం “The Indian War of Independence ” ను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించారు.

సావర్కర్ ఇటలీకి చెందిన జాతీయవాద నాయకుడు అయిన గియుసేప్ మజ్జిని ద్వారా చాలా ప్రభావితుడయ్యాడు. లండన్ లో ఉన్న సమయం లోనే అతని జీవిత చరిత్ర ను మరాఠీ భాషలో అనువాదం చేసారు.

లండన్ లో ఉంటున్న సమయంలోనే మదన్‌లాల్ ధింగ్రా అనే తోటి స్టూడెంట్ యొక్క ఆలోచన విధానం తో కూడా చాలా ప్రభావితుడయ్యాడు.

1909 వ సంవత్సరంలో మదన్‌లాల్ ధింగ్రా కర్జన్-వైలీ అనే బ్రిటిష్ ఆఫీసర్ ను హత్య చేసారు. ఈ హత్యకు ఉపయోగించిన తుపాకీ మరియు మదన్‌లాల్ ధింగ్రా చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు సావర్కర్ అందించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటన తరవాత గాంధీజీ లండన్ వెళ్ళినప్పుడు సావర్కర్ తో కలిసారు. అక్కడ సావర్కర్ మరియు ఇతర జాతీయవాదులతో చర్చించారు. స్వాతంత్రం కోసం అహింసా మార్గాన్ని ఎన్నుకోవటం వ్యర్థం అని గాంధీజీ చెప్పారు.

1909 వ సంవత్సరంలోనే భారతదేశంలో ఉన్న సావర్కర్ తమ్ముడు గణేష్ సావర్కర్ మోర్లీ-మింటో సంస్కరణలకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు.

ఈ తిరుగుబాటు వెనక సావర్కర్ ఉన్నారని తెలుసుకొని అరెస్ట్ చేయాలనుకున్నారు. అరెస్ట్ అయ్యే విషయం తెలుసుకొని సావర్కర్ మొదట పారిస్ తరవాత లండన్ కి వెళ్లారు.

లండన్ లో సావర్కర్ ను కుట్ర మరియు ఆయుధాల సేకరణ మరియు పంపిణీ ఆరోపణల కారణంగా అరెస్ట్ చేసారు.

లండన్ నుంచి ఇండియా కు తీసుకువచ్చిన తరవాత సావర్కర్ ను పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైలు లో ఉంచటం జరిగింది.

నాసిక్ కలెక్టర్ జాక్సన్ హత్యను ప్రేరేపించినందుకు గాను మరియు రాజు కి వ్యతిరేకంగా కుట్ర చేసినందుకు గాను 28 సంవత్సరాల సావర్కర్ కు 50 సంవత్సరాల జైలు శిక్షను విదించారు.

1911 వ సంవత్సరం జులై 11 వ తారీఖున అండమాన్ నికోబార్ జైలు కి పొలిటికల్ ప్రిజనర్ గా తరలించారు.

అండమాన్ :

అండమాన్ లో ఉన్న సమయంలో సావర్కర్ 1911 వ సంవత్సరంలో, 1913 వ సంవత్సరంలో, 1917 వ సంవత్సరంలో మరియు 1920 వ సంవత్సరంలో క్షమా బీక్ష పెటిషన్ చేసారు.

అన్ని సార్లు సావర్కర్ యొక్క పెటిషన్ ను రద్దు చేయటం జరిగింది.

హిందూ మహాసభ :

1921 వ సంవత్సరం మే 2 వ తారీఖున సావర్కర్ ను రత్నగిరి జైలుకు తరలించటం జరిగింది.

1922 వ సంవత్సరంలో రత్నగిరి జైలులో హిందూత్వ ఆవశ్యకతల గురించి రాసారు. ఇదే హిందుత్వ సిద్ధాంతానికి దారి తీసింది.

1924 వ సంవత్సరంలో సావర్కర్ ను విడుదల చేసారు కానీ రత్నగిరికి మాత్రమే పరిమితం చేసారు.

బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ కోసం రత్నగిరి లోనే ఒక బంగ్లా ఇచ్చింది. సావర్కర్ ను కలుసోవాలనుకునేవారిని కూడా అనుమతించింది. మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ మరియు నాథూరామ్ గాడ్సే ను బంగ్లా లో కలుసుకున్నారు.

అక్కడ ఉంటున్న సమయంలో హిందూ సమాజం యొక్క ఏకీకరణ కోసం పనిచేయటం మొదలుపెట్టారు.

1937 వ సంవత్సరం తరవాత జరిగిన ఎన్నికలలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సావర్కర్ ను విడుదల చేసింది.

1937 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ మరియు హిందూ మహాసభ ను ఓడించారు.

సావర్కర్ ముస్లిం లీగ్ లీడర్లతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించారు

హిందూ మహాసభ ప్రెసిడెంట్ గా అయిన తరవాత రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. ఈ యుద్ధం లో పాల్గొనటం వల్ల మిలిటరీ యొక్క ట్రైనింగ్ మరియు యుద్ధ విద్యలు నేర్చుకోవచ్చని చెప్పారు.

అదే సమయంలో (1942) జరుగుతున్న క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనవద్దని చెప్పారు. ఎవరు ఏ పదవిలో ఉన్నారో అలాగే ఉంటూ యుద్ధంలో పాల్గొనాలని చెప్పారు.

గాంధీజీ :

1948 సంవత్సరం, జనవరి 30 వ రోజు నాథూరామ్ గాడ్సే గాంధీజీ ని హత్య చేయటం జరుగుతుంది.  నాథూరామ్ గాడ్సే హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడిగా ఉన్నాడు. 

గాడ్సే Agrani – Hindu Rashtra అనే మరాఠీ దిన పత్రిక యొక్క ఎడిటర్ పనిచేసేవారు. ఈ పత్రికను The Hindu Rashtra Prakashan Ltd అనే కంపెనీ నడిపేది. ఈ కంపెనీ లో సావర్కర్ కూడా 15000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. 

సావర్కర్ హిందూ మహాసభ మాజీ ప్రెసిడెంట్ అవ్వటం వల్ల గాంధీజీ హత్య, హత్య కోసం కుట్ర చేయటం మరియు హత్య చేయటానికి ప్రేపించటం లాంటి ఆరోపణలతో సావర్కర్ ను అరెస్ట్ చేయటం జరిగింది. 

అరెస్ట్ అయిన ఒక రోజు ముందు ఈ హత్యకు వ్యతిరేకంగా మాట్లాడారు.  ఒక నవజాత దేశంగా ఉన్న భారతదేశం యొక్క ఉనికిని ప్రమాదంలో పడేస్తుంది అని చెప్పారు. 

సావర్కర్ వద్ద హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవటం వల్ల  ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (Preventive Detention Act) కింద అరెస్ట్ చేసారు. 

గాంధీజీ హత్య తరవాత దాదర్ లో ఉన్న సావర్కర్ ఇంటిపై చాలా మంది రాళ్లతో దాడి చేసారు.  

ఆధారాలు లేని కారణంగా సావర్కర్ ను విడుదల చేయటం జరిగింది. జైలు నుంచి బయటికి వచ్చిన తరవాత హిందూ జాతీయవాద ప్రసంగాలు చేయటం తో మళ్ళీ అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదల అయ్యాక  హిందూ జాతీయవాద ప్రసంగాలు చెయ్యను అనే ఒప్పందం పై సావర్కర్ ను విడుదల చేసారు. 

తన పై  నిషేధం విధించిన తరవాత కూడా హిందుత్వాకు సంబంధించిన సామజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడేవారు. 

సావర్కర్ అనుచరులు మరియు RSS కార్యకర్తలు సావర్కర్  కు సన్మానాలు చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ నాయకుల యొక్క సంభందాలు హిందూమహాసభ తో కానీ లేదా సావర్కర్ తో కానీ   అంతగా బాగుండేవి కావు.  

సావర్కర్ పై ఉన్న నిషేధం నిర్ములించిన  తరవాత  తన రాజకీయ కార్యాచరణాలు మొదలుపెట్టారు.  

వ్యక్తిగత జీవితం :

సావర్కర్ తనను తాను నాస్తికుడు అని చెప్పుకున్నప్పటికీ హిందూ  ఫిలాసఫీ ను అనుసరించేవారు. రత్నగిరి జైలు లో ఉన్నప్పుడు  Hindutva: Who is a Hindu? అనే పుస్తకం కూడా రాసారు. సావర్కర్ కుల వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడేవారు.    

 చరిత్రకారుల ప్రకారం సావర్కర్ హిందూ జాతీయవాదం కోసం ముస్లింల కు వ్యతిరేకంగా రాసేవారు. 

భారతదేశంలోని మిలిటరీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ముస్లింలు దేశ ద్రోహులు అవ్వొచ్చు అని చెప్పేవారు. మిలిటరీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో  ముస్లింలను ఉంచొద్దు అని సావర్కర్ సలహా ఇచ్చేవాడు. 

గాంధీజీ ముస్లింల గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారని విమర్శించేవారు. 1940 వ సంవత్సరంలో మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన విధంగా దేశాన్ని రెండుగా విడదీయాలని సావర్కర్ సమర్ధించాడు. 

సిక్కులు కూడా Sikhistan పేరుతో వేరుగా దేశం తయారు చేసుకోవాలని చెప్పారు. 

మరణం : 

1963 వ సంవత్సరంలో సావర్కర్ భార్య యమునా బాయ్ చనిపోయిన తర్వాత 1966 వ సంవత్సరం నుంచి సావర్కర్ ఆహారాన్ని మరియు మందులను తీసుకోవటం త్యజించాడు. 

తాను ఆత్మార్పన్ చేస్తున్నానని చెప్పి చనిపోయేవరకు ఆహారం ముట్టనని ప్రతిజ్ఞ చేసాడు. తన జీవిత లక్ష్యం ఇక పూర్తి అయ్యిందని అందుకే ఇలా చేస్తున్నాని చెప్పాడు. 

26 ఫిబ్రవరి 1966 వ సంవత్సరంలో తీవ్ర అనారోగ్యం కారణంగా ముంబై లోని తన నివాసం లో తుది శ్వాస విడిచారు.               

Source: Vinayak Damodar Savarkar – Wikipedia

Leave a Comment