B. R. Ambedkar Biography in Telugu – భీంరావ్ రాంజీ అంబేద్కర్ జీవిత చరిత్ర

బి. ఆర్. అంబేద్కర్ పూర్తి పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. కొందరు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు.  అంబేద్కర్ భారతదేశానికి చెందిన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త.  అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరవాత నియమించబడ్డ మొదటి న్యాయ శాఖ మంత్రి మరియు రాజ్యాంగ శిల్పి.  

అంబేద్కర్ అంటరానితనం మరియి కుల నిర్ములనకు వ్యతిరేకంగా పోరాడారు. 

బాల్యం : 

అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని Mhow జిల్లాలోని  మిలిటరీ కంటోన్మెంట్ లో పుట్టారు. ప్రస్తుతం Mhow ను డాక్టర్ అంబేద్కర్ నగర్ అని పిలుస్తారు. 

అంబేద్కర్ సుబేదార్ రాంజీ మలోజీ సక్పాల్ మరియు భీమాబాయి సక్పాల్ దంపతులకు పుట్టిన 14వ మరియు చివరి సంతానం. వీరి కుటుంబం మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినది.

అంబేద్కర్ మహర్ అనే కులానికి చెందిన వారు. ఆ రోజుల్లో కొన్ని కులాల వారిని అంటురాని వారుగా పరిగణించేవారు. మహర్ కులం కూడా అంటురాని కులాలలో ఒకటి. 

అంబేద్కర్ యొక్క వంశానికి చెందిన వారు బ్రిటిష్ ప్రభుత్వ ఆర్మీ లో పనిచేసేవారు. 

ఆ రోజులలో తక్కువ కులాల వారు కూడా చదువుకునేవారు కానీ క్లాస్ లోపల కాకుండా బయట కూర్చునేవారు. టీచర్ల నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ మరియు సహాయం ఉండేది కాదు. 

తక్కువ కులం వారు నీళ్లు తాగాలన్న ఉన్నత కులం వారి సహాయం తీసుకోవాలి, వారు పోస్తేనే తాగాలి. తక్కువ కులం వారు నీటి గ్లాస్ ను ముట్టుకునే అనుమతి ఉండకపోయేది. 

అంబేద్కర్ స్కూల్ చదువుతున్న సమయంలో అంబేద్కర్ కి స్కూల్ ప్యూన్ నీళ్లు పోసేవాడు. స్కూల్ ప్యూన్ స్కూల్ లో లేని సమయంలో అంబేడ్కర్ కి నీళ్లు లభించేవి కావు. 

స్కూల్ లో కూర్చోవటానికి కూడ ఇంటిదగ్గర నుంచే గోనె సంచి తీసుకొని వెళ్లేవారు. 

చదువు :

1894 వ సంవత్సరంలో రాంజీ సక్పాల్ రిటైర్ అయ్యిన తరవాత అంబేద్కర్ సతారా లో నివసించసాగారు. 

అంబేడ్కర్ యొక్క తోబుట్టువులలో అంబేద్కర్ మాత్రమే పాస్ అయ్యి హై స్కూల్ లో చేరారు. 

హైస్కూల్ లో చేర్పించేటప్పుడు తండ్రి ఇంటిపేరు ను సక్పాల్ కి బదులుగా వారి ఊరు అంబదావే పేరు మీదుగా అంబదావేకర్ అని పెట్టారు. 

హై స్కూల్ లో చదువుతున్న సమయంలో కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ అనే టీచర్ అంబదావేకర్ ను అంబేద్కర్ గా మార్చారు. అప్పటినుంచి అంబేద్కర్ ఇంటిపేరుగా మారింది. 

1897 వ సంవత్సరంలో అంబేద్కర్ కుటుంబం ముంబైలో నివసించటం మొదలుపెట్టారు. అక్కడ ఎల్ఫిన్‌స్టోన్ హై స్కూల్ లో అంబేద్కర్ చేరారు. అంటురాని కులం వారి నుంచి కేవలం అంబేద్కర్ మాత్రమే చేరారు. 

1907 వ సంవత్సరంలో మెట్రిక్యూలేషన్ ను పూర్తిచేసుకొని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ లో చేరారు. 

1912 వ సంవత్సరంలో బాంబే యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ మరియు ఎకనామిక్స్ లో  డిగ్రీ ను పూర్తి చేసారు. 

1913 వ సంవత్సరంలో అంబేద్కర్ కు న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు కోవడానికి బరోడా స్టేట్ స్కాలర్‌షిప్ లభించింది.       

1916 వ సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేయటానికి వెళ్లారు.  1921 వ సంవత్సరంలో తన మాస్టర్స్ డిగ్రీ ను పూర్తి చేసారు. 

అంటరానితనం పై పోరాటం : 

చదువు పూర్తిచేసుకున్న తరవాత ట్యూషన్ మాస్టర్ గా, అకౌంటెంట్ గా మరియు వ్యాపార సలహాదారుడిగా (investment consulting business) చేసారు, కానీ ఇవన్నీ విఫలం చెందాయి. అంబేద్కర్ అంటరానివాడు అని తెలుసుకున్న వెంటనే దూరం గా ఉంచేవారు.   

1918 వ సంవత్సరంలో ముంబై లోని సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాలేజీ లో పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్ గా చేరారు. 

అక్కడ పనిచేసున్న సమయంలో కూడా తోటి ప్రొఫెసర్లు అంబేద్కర్ నీళ్ల జగ్ ను ఉపయోగించటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. 

1926 సంవత్సరంలో ముగ్గురు బ్రాహ్మణేతర నాయకుల తరపు నుంచి వాదించారు. బ్రాహ్మణులు భారతదేశాన్ని నాశనం చేస్తున్నారని వాదించి గెలిచారు. 

బాంబే హైకోర్టులో లా (Law) ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటరాని వాళ్ల కోసం చదువు అందాలని మరియు సామజిక- ఆర్థిక ఎదుగుదల కోసం కృషి చేసారు. 

దళితుల హక్కుల కోసం మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, మరియు సమానత్వ జంట అనే పత్రికలను ప్రారంభించారు. 

 1925 సంవత్సరంలో సైమన్ కమిషన్ లో భవిష్యత్తు భారత రాజ్యాంగం లో మార్పుల కోసం సలహాలు ఇచ్చారు. 

1927 వ సంవత్సరంలో అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు మరియు పాదయాత్రలు చేసారు. ప్రజలందరికి నీళ్ల సౌకర్యం మరియు మందిరాలలో ప్రవేశం కోసం పోరాడారు. 

రాయగడ్ జిల్లాలోని మహాద్ నగరంలో అంటరాని వారికి వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తీసుకొనే సదుపాయం కలిగించాలని సత్యాగ్రహం కూడా చేసారు. 

1927 వ సంవత్సరంలో జరిగిన సమావేశంలో అంబేద్కర్, మనుస్మృతి లో కుల వివక్షత మరియు అంటరానితనం గురించి ఉందని చెప్పి సాంప్రదాయబద్ధంగా మనుస్మృతి కాపీలను ను కాల్చారు. 

25 డిసెంబర్ 1927 వ సంవత్సరంలో వేల మంది అంబేద్కర్ అనుచరులు  మనుస్మృతి కాపీలను కాల్చారు.  అంబేద్కర్ అనుచరులు డిసెంబర్ 25 ను మనుస్మృతి దహన్ దినోత్సవంగా జరుపుకుంటారు. 

1930 వ సంవత్సరంలో 15,000 మంది తో కాలారం దేవాలయ ఉద్యమం ను  కాలారం దేవాలయం వద్ద సమావేశమయ్యారు. 

ఆడ మరియు మగ క్రమశిక్షణతో దేవుడిని చూడాలని అక్కడికి చేరుకున్నారు. ఆలయం ద్వారం వద్ద చేరుకున్న తర్వాత బ్రాహ్మణ అధికారులు ద్వారమును మూసి వేసారు. 

1932 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం తక్కువ కులాల వారి కోసం విడిగా ఎలెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విషయం తెలుసుకున్న గాంధీజీ ఇలా చేయటం వల్ల హిందూ సముదాయం రెండు వర్గాలుగా విడిపోతుందని వ్యతిరేకత తెలిపారు. 

యర్వాడ జైలులో ఉన్న గాంధీజీ  నిరాహార దీక్ష చేసారు. గాంధీజీ ఆరోగ్యం బాగా క్షిణించటంతో అంబేద్కర్ (తక్కువ కులాల తరపు నుంచి ) మరియు మదన్ మోహన్ మాలవియ (ఇతర హిందువువల తరపు నుంచి) మధ్య సంధి జరిగింది. దీనినే పూనా పాక్ట్ అని కూడా అంటారు. 

1936 వ సంవత్సరంలో Independent Labour Party ను స్థాపించారు. ముస్లింల కోసం పాకిస్తాన్ దేశం ను సమర్ధించారు.  

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరవాత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు అంబేద్కర్ ను భారత రాజ్యంగం నిర్మాణం కోసం ఆహ్వానించారు. 

ఈ రాజ్యాంగం లో అంటరాని తనం ను రద్దు చేయటం మరియు అన్ని రకాల వివక్షతలను చట్ట విరుద్ధం చేసారు. 

వ్యక్తిగత జీవితం :

1906 వ సంవత్సరంలో 9 సంవత్సరాల రమాబాయి అనే అమ్మాయి ను పెళ్లి చేసుకున్నారు. 1935 వ సంవత్సరంలో రమాబాయి అనారోగ్యం కారణంగా చనిపోయారు. 

భారత రాజ్యాంగ నిర్మాణం తరవాత  అంబేద్కర్  తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం ముంబై వెళ్లినప్పుడు శారదా కబీర్ ను కలిసారు. 15 ఏప్రిల్ 1948 వ సంవత్సరంలో అంబేద్కర్ శారదా కబీర్ ను పెళ్లి చేసుకున్నారు. తన చివరి రోజులలో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 

మరణం : 

1948 సంవత్సరం నుంచే డయాబెటిస్ రోగం నుంచి భాదపడుతున్న అంబేద్కర్ మంచం పైనే ఉండేవారు. 

6 డిసెంబర్ 1956 వ సంవత్సరంలో నిద్రలోనే అంబేద్కర్ తన తుది శ్వాసను విడిచారు.

Source: B. R. Ambedkar – Wikipedia    

1 thought on “B. R. Ambedkar Biography in Telugu – భీంరావ్ రాంజీ అంబేద్కర్ జీవిత చరిత్ర”

Leave a Comment