స్వాంటే పాబో జీవిత చరిత్ర – Svante Pääbo Biography in Telugu

స్వాంటే పాబో స్వీడన్ కు చెందిన జన్యు శాస్త్రవేత్త (geneticist). అతను పరిణామ జన్యుశాస్త్రం (evolutionary genetics) లో జన్యు శాస్త్రానికి చెందిన నిపుణుడు.  

పాలియోజెనెటిక్స్ ను స్థాపించిన వారిలో స్వాంటే పాబో కూడా ఒకరు.

2022 వ సంవత్సరంలో అంతరించిపోయిన హోమినిన్‌లు మరియు మానవ పరిణామం యొక్క జన్యువులను కనిపెట్టినందుకు గాను ఫిజియాలజీ లో నోబెల్ బహుమతి లభించింది.  

బాల్యం : 

 స్వాంటే పాబో  20 ఏప్రిల్, 1955 వ సంవత్సరం స్వీడన్ లోని స్టాక్‌హోమ్ నగరంలో జన్మించారు. ఇతని తల్లి కరిన్ పాబో ఒక కెమిస్ట్ మరియు తండ్రి సునే బెర్గ్‌స్ట్రోమ్ ఒక బయో కెమిస్ట్. 

తండ్రి బెర్గ్‌స్ట్రోమ్ 1982 వ సంవత్సరంలో బెంగ్ట్ I. శామ్యూల్సన్ మరియు జాన్ R. వాన్ తో పాటు కలిసి ఫిజియాలజీ లో నోబెల్ బహుమతి పొందారు. 

1986 వ సంవత్సరంలో అడెనోవైరస్ల E19 ప్రోటీన్ ఇమ్యూన్ సిస్టం ను ఎలా నియంత్రిస్తుంది అనే అంశం పై ఉప్ప్సల విశ్వవిద్యాలయం నుంచి  PhD చేసారు. 

1986 నుంచి 1987 వరకు పోస్ట్ డాక్టోరల్ పరిశోధన యూనివర్శిటీ ఆఫ్ జ్యూరిచ్ నుంచి చేసారు. 

1987 నుంచి 1990 వరకు పోస్ట్ డాక్టోరల్ పరిశోధన అమెరికాలోని  యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి బయోకెమిస్ట్రీ లో చేసారు. 

పాబ్లో పాలియోజెనెటిక్స్ ను స్థాపించారు. పోలియోజెనెటిక్స్ లో ప్రాచీన మరియు పురాతన మానవుల జెనెటిక్స్ గురించి చదవటం జరుగుతుంది.

పాబో తన అనుచరులతో కలిసి నియాండర్ లోయ లో క్లైన్ ఫెల్‌హోఫర్ గ్రోట్ గుహ లో దొరికిన నమునాను సేకరించారు. ఈ నమూనా 40,000 సంవత్సరాల క్రితం నివసించి అంతరించిపోయిన నియాండర్తల్ అనే మనుషులది. ఈ నమూనా ద్వారా అప్పటి మనుషుల మైటోకాన్డ్రియల్ DNA ను సీక్వెన్సింగ్ చేసారు.

Source: Svante Pääbo – Wikipedia

Leave a Comment