వరలక్ష్మి శరత్ కుమార్ జీవిత చరిత్ర – Varalakshmi Sarath Kumar biography in Telugu

వరలక్ష్మి శరత్ కుమార్ భారతదేశానికి చెందిన నటి. ఈమె తమిళ, కన్నడ, తెలుగు మరియు మలయాళం సినిమాలలో నటిస్తారు.

పేరు వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)
ఇతర పేర్లు వరు
పుట్టిన తేదీ 5 మార్చి 1985 (వయస్సు  38)
పుట్టిన ప్రాంతం  బెంగుళూరు, కర్ణాటక, ఇండియా
చదువుహిందుస్థాన్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ (BSc), ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం (మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్)
వృత్తినటి
తల్లిదండ్రులుఆర్. శరత్‌కుమార్ (తండ్రి)రాధిక (సవతి తల్లి)

బాల్యం :

వరలక్ష్మి 5 మార్చి 1985 లో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో నటుడు శరత్ కుమార్ మరియు ఛాయా అనే దంపతులకు జన్మించారు.

వరలక్ష్మి సెయింట్ మైఖేల్ అకాడమీ నుంచి తన స్కూల్ చదువును పూర్తి చేసుకున్నారు. హిందూస్తాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి మైక్రో బయాలజీ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.

ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ (University of Edinburgh) నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చదివారు.

చదువును పూర్తి  చేసుకున్న తరవాత తన నటనా నైపుణ్యాన్ని మెరుగుచేసుకోవటానికి ముంబై లోని అనుపమ్ ఖేర్ కు చెందిన స్కూల్ లో చేరారు.

కెరీర్ :

వరలక్ష్మి 2003 లో విడుదల అయిన తమిళ సినిమా బాయ్స్ (Boys) కి ఆడిషన్ ఇచ్చినప్పుడు లీడ్ రోల్ లో యాక్టింగ్ చేయటానికి సెలెక్ట్ అయ్యారు. కానీ తండ్రి శరత్ కుమార్ వద్దు అని చెప్పి నప్పుడు వదిలేసారు. ఈ సినిమా లాగానే 2004 లో విడుదల అయిన కాదల్ ( Kaadhal) మరియు 2008 లో విడుదల అయిన సరోజ సినిమాను వదిలేసారు.

2012 లో విడుడల అయిన సినిమా పోదా పొడి ( Podaa Podi) కోసం వరలక్ష్మి ను 2008 లో ఎన్నుకోవటం జరిగింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల అవ్వటానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమాలో లండన్ కు చెందిన డాన్సర్ గా నటించటానికి అవకాశం లభించినందుకు ఆ పాత్ర చేయటానికి ఒప్పుకున్నారు.

ఈ సినిమా ద్వారా క్రిటిక్స్ యొక్క ప్రశంసలను అందుకుంది.కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు.

ఈ సినిమా తరవాత మధ గజ రాజ (Madha Gaja Raja) అనే మసాలా సినిమాలో హీరో విశాల్ తోపాటు కలిసి నటించారు కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా విడుదల అవ్వలేదు.

వరలక్ష్మి తన రెండవ సినిమా గా 2014 లో విడుదల అయిన మాణిక్య (Maanikya) లో నటించారు. ఆ సంవత్సరంలో విడుదలైన సినిమాలలో అత్యంత లాభదాయకమైన కన్నడ చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది.

2014 వ సంవత్సరంలో తరై తప్పట్టై (Tharai Thappattai) సినిమా యొక్క షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమా లో కరకట్టం డ్యాన్సర్ గా నటించడానికి 10 కిలోల బరువును తగ్గించుకున్నారు.

2017 లో వరలక్ష్మి విక్రమ్ వేద, నిబునన్, విస్మయ, సత్య, కట్టు మరియు మాస్టర్ పీస్ లాంటి విజయవంతమైన సినిమాలలో నటించారు.

2018 లో ఉన్నై అరిందాల్ TV షో లో హోస్ట్ గా కూడా నటించారు. ఇదే సంవత్సరం సండకోజి 2 మరియు సర్కార్ సినిమాలలో నటించారు.

2019 లో తెలుగు లో తన మొట్ట మొదటి సినిమా తెనాలి రామకృష్ణ BA. BL లో నటించారు. 2020 లో విడుదల అయిన డానీ (Danny) సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించారు.

వరలక్ష్మి నటించిన సినిమాలు: 

సంవత్సరం (Year)సినిమా (Film)భాష (Language)
2012Podaa Podi – పోదా పొడిTamil
2014Maanikya – మాణిక్యKannada
2015Ranna – రన్నKannada
2016Kasaba – కసబాMalayalam
2016Tharai Thappattai – తరై తప్పట్టైTamil
2017Vikram Vedha – విక్రమ్ వేదTamil
2017Nibunan – నిబునన్Tamil
2017Vismaya – విస్మయKannada
2017Sathya – సత్యTamil
2017Kaattu – కట్టుMalayalam
2017Masterpiece – మాస్టర్ పీస్Malayalam
2018Mr. Chandramouli – శ్రీ చంద్రమౌళిTamil
2018Echcharikkai – ఎచ్చరిక్కైTamil
2018Sandakozhi 2 – సండకోజి 2Tamil
2018Sarkar – సర్కార్Tamil
2018Maari 2 – మారి 2Tamil
2019Neeya 2 – నీయా 2Tamil
2019Tenali Ramakrishna BA. BL – తెనాలి రామకృష్ణ BA. BLTelugu
2020Velvet Nagaram – వెల్వెట్ నగరంTamil
2020Danny – డానీTamil
2020Kanni Raasi – కన్ని రాసిTamil
2021Krack – క్రాక్Telugu
2021Naandhi – నాందిTelugu
2021Ranam – రణంKannada
2021Chasing – వెంటాడుతోందిTamil
2021Singa Paarvai – సింగ పార్వైTamil
2022Pakka Commercial – పక్కా కమర్షియల్Telugu
2022Iravin Nizhal – ఇరవిన్ నిజాల్Tamil
2022Poikkal Kuthirai – పొయిక్కల్ కుత్తిరైTamil
2022Kaatteri – కట్టేరిTamil
2022Yashoda – యశోదTelugu
2023V3 – V3Tamil
2023Veera Simha Reddy – వీర సింహ రెడ్డిTelugu
2023Michael – మైఖేల్Telugu
2023Kannitheevu – కన్నితీవుTamil
2023Kondraal Paavam – కొండ్రాల్ పావంTamil
2023Agent – ఏజెంట్Telugu
2023Maruthi Nagar Police Station – మారుతీ నగర్ పోలీస్ స్టేషన్Tamil
2023Kota Bommali PS – కోట బొమ్మాళి PSTelugu
2024Hanu Man  – హను మాన్ Telugu
2024*Colors  – రంగులు Malayalam
2024*Sabari  – శబరి Telugu
 

 అవార్డులు:

సంవత్సరం (Year)Award (అవార్డు)
2012Vijay Award for Best Debut Actress – ఉత్తమ తొలి నటిగా విజయ్ అవార్డు
2012Edison Award for Best Debut Actress – ఉత్తమ తొలి నటిగా ఎడిసన్ అవార్డు
20166th South Indian International Movie Awards for Best Actress (Critics) – 6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్)
2016Behindwoods Gold Medals – బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్
2017Edison Award for Best Character Role – Female – ఎడిసన్ అవార్డ్ ఫర్ బెస్ట్ క్యారెక్టర్ రోల్ – ఫిమేల్
20177th South Indian International Movie Awards for Best Supporting Actress – ఉత్తమ సహాయ నటిగా 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
2018Behindwoods Gold Medals – బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్
2018Ananda Vikatan Cinema Awards for Best Villain – Female – ఉత్తమ విలన్ – స్త్రీకి ఆనంద వికటన్ సినిమా అవార్డులు
20198th South Indian International Movie Awards – 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
201917th Santosham Film Awards – 17వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్

Source: Varalaxmi Sarathkumar – Wikipedia

1 thought on “వరలక్ష్మి శరత్ కుమార్ జీవిత చరిత్ర – Varalakshmi Sarath Kumar biography in Telugu”

Leave a Comment