సుఖేష్ చంద్ర శేఖర్ ఒక కాన్ మ్యాన్ (తెలివైన మోసగాడు) మరియు ఒక వ్యాపార వేత్త. చంద్ర శేఖర్ చేసిన మోసగాళ్లను చూసిన తరవాత ప్రజలు ఇతనిని మోసగాళ్లకు మోసగాడు అని అంటారు.
వివిధ డబ్బు ఉన్న వ్యక్తులను తన మాటల ద్వారా కోట్ల రూపాయల మోసం చేసాడు. చేసిన మోసాలకు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు.
జైలు లో ఉన్న తర్వాత కూడా మోసాలకు పాల్పడేవాడు. ఇటీవల శివీందర్ అనే వ్యాపార వేత్త భార్య అధితి సింగ్ ను 200 కోట్ల మోసం చేసాడు.
సుఖేష్ చంద్ర శేఖర్ యొక్క దోపిడీలు :
బెంగళూరు కు చెందిన చంద్ర శేఖర్ చిన్న తనం నుంచే విలాసవంత మైన జీవితం కావాలనుకున్నాడు. కేవలం 17 సంవత్సరాల వయస్సు లో పలు మోసాలకు పాల్పడ్డాడు.
చంద్ర శేఖర్ కి పలు భాషలు మాట్లాడటానికి రావటం, ఎదుటివారిని మాటల ద్వారా నమ్మించటం చేసేవాడు. చంద్ర శేఖర్ ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులు మరియు రాజకీయ నేతల సన్నిహితుడిగా చెప్పి మోసాలు చేసేవాడు.
బెంగళూరు నుంచి చెన్నై కి వెళ్లి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి 100 మంది ని మోసం చేసాడు. ఈ 100 మందికి తాను ఒక రాజకీయ వేత్త యొక్క బంధువు అని చెప్పి 75 కోట్లు దోచుకున్నాడు.
చంద్ర శేఖర్ చేసిన మోసాల కారణంగా 2011 సంవత్సరంలో జైలు పాలు అయ్యారు. బెయిల్ మీద బయటికి వచ్చిన తరవాత కూడా మోసాలను చేయటం ఆపలేదు.
ఒక న్యూస్ రిపోర్ట్ ప్రకారం కొచ్చి కి చెందిన బట్టల వ్యాపారి యొక్క వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి కత్రినా కైఫ్ తీసుకువస్తానని చెప్పి 20 లక్షలు తీసుకున్నాడు.
2017 సంవత్సరంలో AIADMK పార్టీ లీడర్ నుంచి 50 కోట్ల మోసానికి పాల్పడ్డాడు.
200 కోట్ల మోసం చేసిన కథ :
తీహార్ జైలు లో చంద్ర శేఖర్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్ద పెద్ద పేరు గాంచిన నేరగాళ్లతో పరిచయం ఏర్పడింది. అదే సమయంలో శివీందర్ సింగ్ అనే వ్యాపార వేత్త డబ్బుల అవకతవకల విషయం లో అరెస్ట్ అయ్యాడు. శివీందర్ బెయిల్ కోసం చాలా ప్రయత్నించేవాడు.
ఈ విషయాన్ని గమనించిన చంద్ర శేఖర్ శివీందర్ సింగ్ యొక్క భార్య అధితి సింగ్ ను టార్గెట్ చేసాడు. తీహార్ జైలు లో ఉన్న పోలిసులకు కూడా లంచం ఇచ్చి తన కోసం ఒక ప్రత్యేక రూమ్ తీసుకున్నాడు. తనకు కావాల్సిన ప్రతి వస్తువును తెప్పించుకునేవాడు. తానే ఉండే రూమ్ లో CCTV లను బ్లాక్ చేయించాడు.
మొట్టమొదటి సారి శివీందర్ యొక్క భార్య కు ఫోన్ చేసి నేను న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పి మీ భర్త లాంటి వ్యాపార వేత్తలు మా ప్రభుత్వానికి చాలా అవసరం అని చెప్పారు.
మీ భర్త ను మేము బెయిల్ మీద బయటికి తీసుకువస్తా అని చెప్పి కేసు యొక్క వివరాల కోసం మళ్లీ కాల్ చేస్తానని చెప్పడం జరిగింది.
చంద్ర శేఖర్ ఈ సారి హోమ్ మినిస్ట్రీ నుంచి ఫోన్ చేస్తున్న అని చెప్పి కేసు వివరాలు తీసుకున్నాడు. అధితి సింగ్ ను నమ్మించటానికి ట్రూ కాలర్ లో చెక్ చేసుకోమని చెప్పాడు,అధితి సింగ్ చెక్ చేసినప్పుడు ఒకసారి హోమ్ మినిస్ట్రీ అని ఇంకోసారి PMO అని రావటం తో నమ్మింది.
చంద్రశేఖర్ ఒక ఆప్ ద్వారా తన నెంబర్ ను హోమ్ మినిస్ట్రీ గా మరియు PMO గా మార్చాడు. ఇదంతా జైలు లో కూర్చొని నాలుగు గోడల మధ్య నుంచి వ్యవహారం నడిపాడు.
అధితి సింగ్ నమ్మకం గెలుచుకున్న తరవాత మీ భర్త ను తప్పకుండ బయటికి తీసుకువస్తాను కానీ అందుకు మీరు పార్టీ ఫండ్ కోసం 20 కోట్లు జమ చేయాలి అని చెప్పాడు.
చంద్ర శేఖర్ మాటలు నమ్మి 20 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తుంది. 20 కోట్లతో మొదలైన వ్యవహారం క్రమ క్రమంగా 200 కోట్ల వరకు వెళ్ళింది.
200 కోట్లు ఇచ్చినా భర్త బెయిల్ మీద బయటికి రాకపోవటం తో చంద్ర శేఖర్ ని అడగగా భయపెట్టడం మొదలు పెట్టారు. ఇలా అయితే లాభం లేదని గ్రహించిన అధితి పోలీసు లను ఆశ్రయించింది.
మొదట పోలీసులు 200 కోట్ల విషయం తెలుసుకున్నప్పుడు అవాక్కయిన అధితి సింగ్ సహాయం తో సుఖేష్ చంద్ర శేఖర్ వరకు చేరారు.
చంద్ర శేఖర్ తీహార్ జైలు లోనే ఉన్న విషయం గ్రహించిన పోలీసులు అక్కడికి వెళ్లి విచారించగా అక్కడున్న పోలీసులే చంద్ర శేఖర్ కి ప్రతి విషయం లో సహాయం చేసేవారని తెలిసింది. ఫలితంగా కోట్ల రూపాయలు పోలీసు లకు ఇచ్చేవాడు.
చంద్ర శేఖర్ మరియు హీరోయిన్లు :
ఇటీవల చంద్ర శేఖర్ జాక్లిన్ ఫెర్నాండెస్ కు 9 లక్షల పిల్లి ని మరియు 52 లక్షల గుర్రాన్ని బహుమతి గా ఇచ్చాడని వార్తలు రావటం జరిగింది. వీరిద్దరి ఒక ఫోటో కూడా సోషల్ మీడియా లో చర్చ గా మారింది.
నోరా ఫతేహి కి కూడా చంద్ర శేఖర్ నుంచి ఒక ఖరీదైన గిఫ్ట్ తీసుకున్నట్లు ఒక సమాచారం. (1) (2)