రాణి లక్ష్మి బాయ్ భారత దేశం లోని ఝాన్సీ రాజ్యానికి చెందిన రాణి మరియు మహారాజ గంగాధర్ రావు యొక్క భార్య. మహారాజు చనిపోయిన తరవాత లక్ష్మి బాయ్ ఝాన్సీ రాణి గా రాజ్యాన్ని పాలించారు.
బ్రిటిష్ రాజ్యానికి లొంగకూడదు అని తమకు స్వాతంత్రం కావాలని యుద్ధం చేసి తీవ్రంగా గాయపడి చనిపోయారు.
Table of Contents
బాల్యం:
రాణి లక్ష్మిబాయ్ 19 నవంబర్ 1828 వ సంవత్సరంలో వారణాసి లో మోరోపంత్ తాంబే మరియు బఘీరతి సప్రె అనే దంపతులకు జన్మించారు. రాణి పుట్టినప్పుడు మణికర్ణికా తాంబే అని పేరు పెట్టారు, ముద్దు గా మను (manu) అని పిలిచే వారు.
లక్ష్మి బాయ్ మరాఠీ కర్హడే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు, వీరి తల్లి తండ్రులు మహారాష్ట్ర కు చెందిన వారు. నాలుగు సంవత్సరాల వయస్సులోనే లక్షి బాయ్ అమ్మ చనిపోయింది. తండ్రి అప్పటి రాజు అయిన పేష్వా బాజీ రావు 2 వద్ద పనిచేసేవారు.
లక్ష్మి బాయ్ యొక్క బాల్యం ఇతర పిల్లల కంటే కాస్త బిన్నంగా ఉండేది. ఇంటి దగ్గరే చదవటం మరియు రాయటం నేర్చుకున్నారు. చదువు తో పాటు గుర్రపు సవారీ, కత్తి సాము లాంటి విద్యలను కూడా నేర్చుకున్నారు.
ఝాన్సీ రాణి :
మే 1847 వ సంవత్సరంలో ఝాన్సీ యొక్క మహారాజు గంగాధర్ రావు నేవల్కర్ తో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరవాత తన పేరును మణికర్ణికా నుంచి లక్ష్మీబాయి గా మార్చటం జరిగింది. మహారాష్ట్ర లో పెళ్లి తర్వాత ఆడవారి పేరు మార్చే ఆచారం ప్రకారం హిందూ దేవత పేరు మీద లక్ష్మి బాయ్ అని పేరు పెట్టడం జరిగింది.
1851 సంవత్సరంలో లక్ష్మీబాయి మరియు గంగాధర్ దంపతులకు ఒక కుమారుడు పుట్టడం జరిగింది. ఈ కుమారుడికి దామోదర్ రావు అని పేరు పెట్టారు. దురదృష్ట వశాత్తు కేవలం 4 నెలల వ్యవధి లోనే దామోదర్ రావు చనిపోయాడు.
మహారాజు చనిపోయే ముందు తన కజిన్ యొక్క కుమారుడు ఆనంద్ రావు ను దత్తత తీసుకున్నారు. మహారాజు అనారోగ్యం కారణంగా చనిపోయే ముందు తన కుమారుడిని దామోదర్ రావు గా నామకరణం చేసారు. తన కుమారుడిని గౌరవంగా చూసుకోవాలి అని, తాను చనిపోయిన తరవాత తన రాజ్యం లక్ష్మిబాయ్ కి చెందుతుందని చెప్పారు.
బ్రిటిష్ రాజ్యం లోని ఉన్న నియమాల ప్రకారం ఏదైనా రాజ్యం యొక్క రాజు మగ సంతానం లేకుండా చనిపోతే ఆ రాజ్యం రాజు కి చెందదు. ఈ విషయం విన్న తరవాత లక్ష్మిబాయ్ ” నేను నా ఝాన్సీ రాజ్యాన్ని అప్పగించను” అని చెప్పారు.
బ్రిటిష్ రాజ్యం తో యుద్ధం :
బ్రిటిష్ రాజ్యం లో తుపాకుల గోలీలలపై పంది మరియు గోవుల మాంసం పూయటం తో హిందువుల మరియు ముస్లిం ల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని తిరుగుబాటు మొదలయ్యింది.
ఝాన్సీ రాణి మొదట బ్రిటిష్ రాజ్యం తో యుద్ధం వద్దు అనుకున్నారు కానీ తిరుగుబాటు దారులు ఝాన్సీ ను ఆక్రమించి అక్కడున్న సంపదను దోచుకున్నారు. దోచుకోవటమే కాకుండా దాదాపు 60 దాకా యూరోపియన్ ఆఫీసర్ లను వారి భార్య పిల్లలను చంపారు.
ఈ విషయం ఝాన్సీ రాణి బ్రిటిష్ అధికురాలకు తెలియ జేయగా తాము వచ్చే వరకు అక్కడి పరిస్తుతులను చూసుకోమని చెప్పారు.
ఈ దాడి తరవాత సమీపంలో ఉన్న కొన్ని రాజ్యాలు ఝాన్సీ పై దాడి చేయాలని వచ్చారు. ఝాన్సీ రాణి తమకు సహాయం చేయమని బ్రిటిష్ అధికురాలతో కోరగా తిరుగుబాటు దారులు చేసిన దాడి లో లక్ష్మి బాయ్ హస్తం ఉందని తెలిసి ఝాన్సీ రానికి సహాయం చేయలేదు.
ఝాన్సీ రాణి మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఆ వచ్చిన సైన్యాలను తిప్పి కొట్టారు. మరోవైపు బ్రిటిష్ వారు పంపిస్తామని చెప్పిన సైన్యం కూడా రానందుకు ఝాన్సీ రాణి సహచరులు ఇక తాము స్వాతంత్రం కోసం పోరాడాలని నిశ్ఛయించుకున్నారు.
Hugh Rose అనే బ్రిటిష్ అధికారి ఝాన్సీ కి సైన్యం తో రాగా అక్కడి ప్రజలు తమకు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కావాలని కోరారు.
1958 సంవత్సరంలో బ్రిటిష్ వారికి మరియు ఝాన్సీ రాణి కి మధ్య యుద్ధం జరిగింది. ఝాన్సీ లో పరిస్థితులు చేయి జారటంతో అక్కడి నుంచి తన కుమారుడిని తీసుకొని కల్పి కి వెళ్లారు.
కల్పి లో కూడా ఝాన్సీ రాణి కి ఓటమిని చూడాల్సి వచ్చింది, అక్కడినుంచి రాణి యొక్క సేన గ్వాలియర్ కి చేరుకున్నారు.
మరణం :
గ్వాలియర్ లో జరిగిన యుద్ధంలో ఝాన్సీ రాణి వీరత్వం తో పోరాడి తీవ్రంగా గాయపడి చనిపోయారు. తన శరీరాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వకూడదు అని చెప్పటం తో అక్కడి ప్రజలు ఝాన్సీ రాణి శవాన్ని దహనం చేసారు.
ఈ మొత్తం యుద్ధం లో ఝాన్సీ రాణి కుమారుడు బతుకుతారు కానీ అక్కడి నుంచి దూరంగా వెళ్లి బతుకుతారు.
Source: Rani of Jhansi – Wikipedia