బిపిన్ రావత్ indian armed forces కి చెందిన మొట్ట మొదటి చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS). ఇండియన్ ఆర్మీ కి చెందిన అన్ని ఫోర్సెస్ కి బిపిన్ రావత్ నాయకత్వం వహించేవారు.
బిపిన్ రావత్ యొక్క కుటుంబం తరాల నుంచి ఇండియన్ ఆర్మీ యొక్క సేవలలో పనిచేస్తుంది.
Table of Contents
బాల్యం :
బిపిన్ రావత్ 16 మార్చి 1958 వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ లోని పౌరి అనే పట్టణం లో జన్మించారు. బిపిన్ రావత్ గారి కుటుంబం కొన్ని తరాల నుంచి ఇండియన్ ఆర్మీ లో సేవలను అందిస్తూ వస్తుంది.
బిపిన్ రావత్ గారి తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఇండియా ఆర్మీ లో లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నారు. రావత్ గారి తల్లి ఉత్తరాక్షి నియోజక వర్గం యొక్క మాజీ MLA కూతురు.
బిపిన్ రావత్ గారు డెహ్రాడూన్ లోని కాంబ్రియన్ హాల్ స్కూల్ మరియు షిమ్లా లోని ఎడ్వర్డ్ స్కూల్ లో చదివారు.స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తరవాత ఖందఖ్వాసుల లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరారు. తరవాత డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ లో చేరారు.
ఇండియన్ మిలిటరీ అకాడమీ లో బిపిన్ రావత్ గారిని “Sword of honour ” గా బిరుదును ఇచ్చారు. రావత్ గ్రాడ్యుయేషన్ చదువును డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ నుంచి పూర్తి చేసారు.
అమెరికా లోని కన్సాస్ స్టేట్ లో హయ్యర్ కమాండ్ కోర్స్ ను United States Army Command and General Staff College లో పూర్తి చేసారు.
ఇంతేకాకుండా డిఫెన్స్ స్టడీస్ లో Mphil డిగ్రీ ను మరియు యూనివర్సిటీ అఫ్ మద్రాస్ నుంచి కంప్యూటర్ స్టడీస్ ను కూడా పూర్తి చేసారు.
ఇండియన్ ఆర్మీ :
1978 లో రావా 11 గోర్ఖ రైఫల్స్ కు చెందిన 5 వ బెటాలియన్ లో నియమించబడ్డారు. ఉరి మరియు జమ్మూ కాశ్మీర్ కు చెందిన మిలిటరీ యూనిట్ లకు నాయకత్వం వహించారు. తరవాత 11 గోర్ఖ రైఫల్స్ కు చెందిన 5 వ బెటాలియన్ కు కూడా నాయకత్వం వహించారు. బ్రిగేడియర్ గా పదోన్నతి కూడా పొందారు.
బ్రిగేడియర్ నుంచి మేజర్ జనరల్ గా పదోన్నతి పొందిన తరవాత 19th Infantry Division కి General Officer Commanding గా నియమించబడ్డారు.
లెఫ్టినంట్ జనరల్ గా III Corps కి కూడా నాయకత్వం వహించారు. జనవరి 2016 వ సంవత్సరంలో Army Commander grade గా పదోన్నతి పొందిన తరవాత General Officer Commanding-in-Chief గా నియమించబడ్డారు.
2016 వ సంవత్సరంలో దల్బీర్ సింగ్ రిటైర్మెంట్ తరవాత 27వ Chief of the Army Staff గా నియమించబడ్డారు.
1987 లో బిపిన్ రావత్ బెటాలియన్ Sumdorong Chu లోయ వద్ద చైనా ఆర్మీ కి వ్యతిరేకంగా నియమించబడ్డారు.
వ్యకిగత జీవితం :
1985 సంవత్సరంలో మధులిక రావత్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కృతిక మరియు తరిని అనే ఇద్దరు కుమార్తెలు పుట్టారు.
మరణం :
డిసెంబర్ 8, 2021 వ సంవత్సరంలో బిపిన్ రావత్ తన భర్య మరియు కొంత మంది ఆర్మీ జనరల్ తో Indian Air Force Mil Mi-17 అనే హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు తమిళనాడు లోని కూనూర్ లో హెలికాప్టర్ క్రాష్ అవ్వటం వల్ల మరణించారు.
ఈ ఘటన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ లో లెక్చర్ ఇవ్వటానికి వెళుతున్నప్పుడు జరిగింది. ఈ హెలికాప్టర్ ప్రమాదం లో బిపిన్ రావత్ తో పాటు తన భార్య మరియు 11 మంది మృతి చెందారు.
Source: Bipin Rawat – Wikipedia