శ్రీ లీల భారతదేశానికి చెందిన నటి, ఈమె ప్రధానంగా తెలుగు మరియు కన్నడ సినిమాలలో నటిస్తారు.
బాల్యం :
శ్రీ లీల జూన్ 14, 2001 వ సంవత్సరంలో అమెరికా లోని తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. శ్రీ లీల తల్లి స్వర్ణలత ఒక గైనకాలజిస్ట్, తండ్రి సూరపనేని శుభాకరరావు ఒక ఇండస్ట్రియలిస్ట్.
ఈ దంపతులు విడిపోయాక శ్రీ లీల పుట్టారు. శ్రీ లీల బెంగళూరు లో పెరిగారు.
చిన్నప్పటి నుంచే శ్రీ లీల భరతనాట్యం లో ట్రైనింగ్ తీసుకునేవారు. 2021 నాటికి శ్రీ లీల MBBS ఆఖరి సంవత్సరంలో ఉన్నారు.
కెరీర్ :
డైరెక్టర్ A. P. Arjun సోషల్ మీడియా లో శ్రీ లీల ఫోటోలను చూసి 2019 వ సంవత్సరంలో కిస్ (KISS) అనే కన్నడ సినిమాలో నటించి సినిమా ఇండస్ట్రీ లో డెబ్యూ చేసారు.
ఈ సినిమా 2019 లో విడుదల అయ్యింది మరియు బాక్స్ ఆఫీస్ లో మంచి విజయాన్ని సాధించింది. ఇదే సంవత్సరం Bharaate అనే కన్నడ సినిమాలో నటించారు.
2021 వ సంవత్సరంలో Pelli SandaD అనే తెలుగు సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో డెబ్యూ చేసారు.
2022 వ సంవత్సరంలో By Two Love మరియు James అనే కన్నడ సినిమాలలో నటించారు. ఇదే సంవత్సరం Dhamaka అనే తెలుగు యాక్షన్ కామెడీ సినిమాలో నటించారు.
2023 వ సంవత్సరంలో Bhagavanth Kesari, Aadikeshava మరియు Extra Ordinary Man అనే సినిమాలలో నటించారు. (ఈ సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు)
2024 లో శ్రీ లీల నటించిన Guntur Kaaram, Ustaad Bhagat Singh మరియు Anaganaga Oka Raju అనే సినిమాలు విడుదల కాబోతున్నాయి.
వ్యక్తిగత జీవితం:
ఫిబ్రవరి 2022లో, లీల ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకున్నారు.
Source: Sreeleela – Wikipedia