కిరణ్ అబ్బవరం భారతదేశానికి చెందిన నటుడు, ఈయన ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తాడు.
బాల్యం:
కిరణ్ అబ్బవరం 15 జులై 1992 లో ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటి లో జన్మించారు. కిరణ్ ఒక బి.టెక్ గ్రాడ్యుయేట్. చదువు పూర్తి అయ్యిన తరవాత చెన్నై లో రెండున్నర సంవత్సరాలు నెట్వర్క్ కన్సల్టెంట్ గా పనిచేసారు.
జాబ్ చేస్తున్న సమయంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో పనిచేసారు. తరవాత తన కెరీర్ ను సినిమాలలో కొనసాగించాలని ఉద్యోగం వదిలేసారు.
కిరణ్ చేసిన షార్ట్ ఫిలిం Sreekaaram ను ఆధారం చేసుకొని Sreekaram అనే సినిమాను తీయటం జరిగింది.
కెరీర్:
సినిమాలలోకి రాక ముందు కిరణ్ పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.
సంవత్సరం | షార్ట్ ఫిలిం |
2015 (Youtube) | Gachibowli (గచ్చిబౌలి) |
2015 (Youtube) | Malli Modalaindhi Ala (మల్లి మొదలయింది అలా) |
2016 (Youtube) | Vaanara Sainyam (వానర సైన్యం) |
2016 (Youtube) | Sreekaaram (శ్రీకారం) |
2016 (Youtube) | Oo Manasa Raa Ila (ఊ మనసా రా ఇలా) |
2017 (Youtube) | Arjuna Phalguna (అర్జునుడు ఫాల్గుణ) |
2017 (Youtube) | Andharu Andhagathele (అందరు అందగాథేలే) |
2019 (Youtube) | Fear of Rejection |
2019 (Youtube) | Boys in school |
2019 (Youtube) | Girls in School |
కిరణ్ 2019 వ సంవత్సరంలో Raja Vaaru Rani Gaaru అనే తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
తన రెండవ తెలుగు సినిమా SR Kalyanamandapam 2021 లో విడుదల అయ్యింది. ఈ సినిమా ద్వారా కిరణ్ మంచి ప్రశంసలను అందుకున్నారు మరియు కిరణ్ నటనను కూడా మెచ్చుకున్నారు.
2022 లో Sebastian P.C. 524, Sammathame మరియు Nenu Meeku Baga Kavalsinavaadini అనే సినిమాలలో నటించారు.
2023 లో Vinaro Bhagyamu Vishnu Katha, Meter మరియు Rules Ranjann అనే సినిమాలలో నటించారు.
Source: Kiran Abbavaram – Wikipedia