సిరివెన్నెల సీతారామ శాస్త్రి 20 మే 1955 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లో జన్మించారు. శాస్త్రి గారు మొదటిసారిగా 1986 సంవత్సరంలో వచ్చిన సిరివెన్నెల సినిమాకి పాటలు రాసారు. ఈ సినిమాలో “విధాత తలపున”, “ఆదిభిక్షువు వాడినేది కోరేది” “ఈ గాలి ఈ నేల” రాసిన పాటలు ఉత్తమ గీత రచయితకు గాను నంది అవార్డు వచ్చింది.
1987 సంవత్సరంలో శ్రుతిలయలు అనే సినిమాలో రాసిన “తెలవారదేమో స్వామి” అనే పాటకు రెండవ సారి నంది అవార్డు వచ్చింది. 1978 సంవత్సరంలో వచ్చిన స్వర్ణ కమలం అనే సినిమాలో “అందెల రావమిది పదములదా” అనే పాటకు కూడా నంది అవార్డు లభించింది.
శాస్త్రి గారు నంది అవార్డు మూడు సార్లు వరుసగా గెలుచుకున్న మొట్ట మొదటి వ్యక్తిగా నిలిచారు.
1993 వ సంవత్సరంలో వచ్చిన గాయం సినిమా లోని “సురాజ్యమవలేని” అనే పాటకు కూడా నంది అవార్డు వచ్చింది.
1994 వ సంవత్సరంలో వచ్చిన సినిమా శుభమంగళం అనే సినిమాకు మరియు 1996 సంవత్సరంలో విడుదల అయిన శ్రీకారం అనే సినిమాకు కూడా ఐదవ మరియు ఆరవ సారి నంది అవార్డు వచ్చింది.
1997 వ సంవత్సరంలో విడుదల అయిన సింధూరం అనే సినిమాకు రాసిన పాట “అర్థ శతాబ్దపు” మరియు 1999 సంవత్సరంలో వచ్చిన ప్రేమ కథ సినిమా లో రాసిన పాట “దేవుడు కరుణిస్తాడని” అనే పాటకు కూడా నంది అవార్డు వచ్చింది.
2005 లో రిలీజ్ అయిన చక్రం సినిమా లో ” జగమంతా కుటుంబం ” అనే పాటకు తొమ్మిదవ నంది అవార్డు వచ్చింది. 2008 లో విడుదల అయిన గమ్యం అనే సినిమా నుంచి ” ఎంత వరకు ” అనే పాటకు పదవ నంది అవార్డు వచ్చింది.
సీతారామ శాస్త్రి గారు ఇలా 3000 పాటలకు తన కలం ద్వారా పాటలకు అందాన్ని చేకూర్చారు.
సీతారామ శాస్త్రి గారు 30 నవంబర్ 2021 వ సంవత్సరంలో లంగ్ కాన్సర్ వల్ల చనిపోయారు.