Gurajada Apparao biography in Telugu – గురజాడ అప్పారావు జీవిత చరిత్ర

గురజాడ అప్పారావు గారు ఒక ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పరావు గారు చేసిన చాలా రచనలు ప్రఖ్యాతి చెందాయి.  తన రచనల ద్వారా సమాజంలో ఉన్న సమస్య అయిన కన్యాశుల్కం పై మార్పు కోసం ప్రయత్నించారు. వీరు చేసిన ” కన్యశల్కం ” నాటకం కూడా  ప్రజల మన్నన పొందింది.      

గురజాడ అప్పారావు 21 సెప్టెంబర్ 1862 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా లోని రాయవరం గ్రామం లో  వెంకట రామ దాసు మరియు కౌసల్యమ్మ అనే దంపతులకు జన్మించారు.  

గురజాడ అప్పారావు గారు చాలా వరకు తమ జీవితాన్ని విజయనగరం లోనే గడిపారు. గురజాడ గారు తన స్కూల్ చదువును చీపురు పల్లి అనే పట్టణం లో పూర్తి చేసుకున్నారు. 

తండ్రి చనిపోయిన తరవాత గురజాడ గారిని చంద్రశేఖర్ శాస్త్రి  అనే కాలేజీ ప్రిన్సిపల్ ఉచితంగా చదువును పూర్తి చేయటంలో సహాయం చేసారు.

చదువును పూర్తి చేసిన తరవాత 1894 సంవత్సరంలో M.R హై స్కూల్ లో ఉపాధ్యాయుడిగా చేరారు.    

1887 సంవత్సరంలో విజయనగరం లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించారు. పలు రకాల సామజిక కార్యక్రమాలలో  పాల్గొని 1888 సంవత్సరంలో విజయనగరం లోని వాలంటరీ సర్వీస్ కార్ప్స్ లో సభ్యుడిగా చేరారు.  

1889 సంవత్సరంలో ఆనంద్ గజపతి డిబేటింగ్ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు.1891 సంవత్సరంలో గురజాడ గారు లెక్చరర్ గా పదోన్నతి పొందారు.  

1911 సంవత్సరంలో మద్రాస్ యూనివర్సిటీ లో బోర్డ్ అఫ్ స్టడీస్ లో నియమించబడ్డారు. ఇదే సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ ను ప్రారంభించారు.  

గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం మరియు వేశ్యావృత్తికి పై చేసిన నాటకం ” కన్యాశుల్కం ” చాలా ప్రఖ్యాతి చెందింది.  

1913 సంవత్సరంలో పదవి విరమణ చేసారు, కొన్ని రోజులు అనారోగ్యం తో బాధపడి కేవలం 53 సంవత్సరాల వయస్సులో 1915 సంవత్సరం నవంబర్ 30 రోజున మరణించారు.    

గురజాడ గారు రాసిన గేయం ” దేశమును ప్రేమించుమన్నామంచి అన్నది పెంచుమన్నావొట్టి మాటలు కట్టిపెట్టవోయ్ గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ ” చాలా ప్రఖ్యాతి చెందింది. 

Source: Gurajada Apparao – Wikipedia

Leave a Comment