లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియా యొక్క రెండవ ప్రధాన మంత్రి. చిన్న తనంలోనే దేశ భక్తిని పెంచుకొని గాంధీ జి తో పాటు పలు ఉద్యమాలలో పాల్గొన్నారు.
స్వాతంత్రం వచ్చిన తరవాత మంత్రి గా మరియు జవహర్ లాల్ నెహ్రు చనిపోయిన తరవాత ప్రధాన మంత్రి గా భద్యతలను చేపట్టారు.
Table of Contents
బాల్యం :
లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2 1904 సంవత్సరంలో శారదా ప్రసాద్ శ్రీవాస్తవ మరియు రామ్ దులారీ దేవి అనే దంపతులకు జన్మించారు.
శాస్త్రి గారు అమ్మమ్మ గారి ఇంటి వద్ద పుట్టిన తరవాత వారణాసి లో ఉండే జమీందారు అయిన తాతయ్య గారి ఇంట్లో ఒక సంవత్సరం ఉన్నారు.
శాస్త్రి గారి తండ్రి అలహాబాద్ లోని రెవిన్యూ ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేసేవారు, అమ్మ గారు మొగల్సరాయ్ లోని రైల్వే స్కూలు లో హెడ్ మాస్టర్ మరియు టీచర్ గా పనిచేసేవారు.
లాల్ బహదూర్ శాస్త్రి గారు కేవలం 6 నెలలు ఉన్నప్పుడు వీరి తండ్రి బుబోనిక్ ప్లేగు మహమ్మారి వల్ల చనిపోయారు. తండ్రి చనిపోయిన తరవాత శాస్త్రి గారి కుటుంబం అమ్మమ్మ ఊరికి వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ వీరి తాతయ్య హజారీ లాల్జీ గారు వీరి బాగోగులను చూసుకునే వారు. అమ్మమ్మ ఇంటి వద్ద శాస్త్రి గారికి ఒక చెల్లెలు కూడా పుట్టింది.
1908 సంవత్సరంలో శాస్త్రి తాతయ్య గారు కూడా చనిపోయారు. తాతయ్య గారు చనిపోయిన తరవాత మామయ్య దర్బరీ లాల్ వీరి బాగోగులను చూసుకునేవారు.
శాస్త్రి గారి చిన్న తనంలో ఇప్పటి లాగా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం ఉండేది కాదు. ఆ రోజులలో ఉర్దూ భాష లోనే చదువులు చెప్పేవారు ఎందుకంటే ఉర్దూ మరియు పర్శియన్ అప్పటి ప్రభుత్వం యొక్క అధికారిక భాషలు.
నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక మౌల్వి దగ్గర చదువును ప్రారంభించి ఆరవ తరగతి వరకు చదివారు. హరీష్ చంద్ర హై స్కూలు లో 7 వ తరగతి నుంచి చదవటం ప్రారంభించారు.
స్వాతంత్ర పోరాటంలో :
హరీష్ చంద్ర హై స్కూలు లో చదివేటప్పుడు గొప్ప దేశ భక్తుడు మరియు ఉపాధ్యాయుడు అయిన నిష్కమేశ్వర్ ప్రసాద్ మిశ్ర శాస్త్రి గారిని తన పిల్లలకు ట్యూషన్ లు చెప్పనిచ్చేవారు. ఫలితంగా శాస్త్రి గారికి ఆర్థికంగా సహాయం కూడా అందేది.
తన ఉపాధ్యాయుడికి ఉన్న దేశ భక్తికి ప్రభావితులైన శాస్త్రి గారు స్వాతంత్ర పోరాటంలో ఆసక్తి ని చూపించటం మొదలు పెట్టారు. ఇంతే కాకుండా స్వాతంత్రం కోసం పోరాడుతున్న స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ గారి గురించి చదవటం మొదలుపెట్టారు.
1921 వ సంవత్సరంలో శాస్త్రి గారు 10 వ తరగతి చదువుతున్నప్పుడు గాంధీజీ గారు మరియు పండిత్ మదన్ మోహన్ మాలవీయ నిర్వహించిన బహిరంగ సబ లో హాజరు అయ్యారు.
ఈ సభ లో గాంధీజీ ప్రభుత్వ స్కూళ్లను వదిలేయమని చెప్పగా శాస్త్రి గారు హరీష్ చంద్ర హై స్కూలు ను మానివేసి స్థానిక కాంగ్రెస్ పార్టీ లో వాలంటీర్ గా చేరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మరియు ప్రదర్శనలు చేయటం మొదలుపెట్టారు. ఫలితంగా అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు లో వేసారు కాని మైనర్ అవ్వటం వల్ల వదిలివేయడం జరిగింది.
లాల్ బహదూర్ శాస్త్రి లాగానే చాలా మంది యువకులు తమ చదువులను వదిలేసి స్థానిక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని గమనించిన J.B Kripalani ఈ యువత కు చదువు నేర్పించాలని నేషనలిస్ట్ ఎడ్యుకేషన్ ను ధనికుల సహాయం తో ప్రారంభించారు.
ఇలా ప్రారంభించిన కాలేజీ నుంచి 1925 సంవత్సరంలో ఫిలాసఫీ మరియు ఎథిక్స్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు. ఆ సమయంలో డిగ్రీ ను సంపాదించిన వారిని శాస్త్రి అని పిలిచేవారు. తరవాత శాస్త్రి అనే బిరుదు వీరి పేరు లో చివరిగా చేర్చబడింది.
చదువు పూర్తి చేసుకున్న తరవాత మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. శాస్రి గారు గాంధీజీ గారి ఉద్యమాలలో పాల్గొన్నందుకు పలు సార్లు జైలు పాలయ్యారు.
జైలు నుంచి తిరిగి వచ్చాక ఆనంద్ భవన్ లో ఉన్న జవహర్ లాల్ నెహ్రు ఇంటి నుంచి స్వాతంత్ర పోరాటం చేస్తున్న కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చేవారు.
రాజకీయ జీవితం :
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరవాత ఉత్తర ప్రదేశ్ లో పార్లమెంటరీ సెక్రటరీ గా నియమించబడ్డారు.
ఉత్తరప్రదేశ్ లో మొదటి ముఖ్యమంత్రి ని నియమించిన తరవాత రవాణా మరియు పోలీస్ శాఖా మంత్రి గా నియమించబడ్డారు. ఈ పదవి లో ఉన్నప్పుడు మొదటి సారిగా మహిళా కండక్టర్ లను నియమించారు.
ప్రధాన మంత్రి :
27 మే 1964 వ సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రు చనిపోయిన తరవాత అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కే.కామరాజ్ లాల్ బహదూర్ శాస్త్రి గారిని 9 జూన్ 1964 లో ప్రధాన మంత్రి గా నియమించారు.
శాస్త్రి గారు మొదలు పెట్టిన నినాదం “జై జవాన్ జై కిసాన్ ” ఈ రోజుకి కూడా వినిపిస్తూనే ఉంటుంది.
మరణం :
11 జనవరి 1966 సంవత్సరంలో శాస్త్రి గారు ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్ లో ఉన్నప్పుడు, ఇండో – పాకిస్తాన్ యుద్దాన్ని అంతం చేయటానికి శాంతి ఒప్పందం పై సంతకాలు చేసిన మరుసటి రోజు చనిపోవటం జరిగింది.
శాస్త్రి గారి మరణం పై చాలా మంది సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేసారు.
Source: Lal Bahadur Shastri – Wikipedia