మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు జీవిత చరిత్ర – Harnaaz sandhu Biography in Telugu

హర్నాజ్ కౌర్ సింధు ఇండియా కు చెందిన ఒక మోడల్ మరియు బ్యూటీ పీజెంట్ టైటిల్ గ్రహిత. ఇటీవల 2021 వ సంవత్సరంలో మిస్ యూనివర్స్ 2021 (Miss universe 2021) కిరీటాన్ని దక్కించుకున్నారు.

హర్నాజ్ సంధు కు ముందు 1994 సంవత్సరంలో సుస్మిత సేన్ మరియు 2000 ల సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు.  

బాల్యం : 

హర్నాజ్ కౌర్ సంధు 3 మార్చి 2000 సంవత్సరంలో చండీగఢ్ లోని ఒక సిక్కు కుటుంబంలో జన్మించింది. తన స్కూలు చదువును శివాలిక్ పబ్లిక్ స్కూలు నుంచి పూర్తి చేసింది. తన డిగ్రీ చదువును కూడా చండీగడ్ లోని ఒక గర్ల్స్ కాలేజి లో చదవటం జరిగింది. 

అందాల పోటి లో :

హర్నాజ్ యుక్త వయస్సు నుంచే అందాల పోటి లో పాల్గొనే వారు. 2017 వ సంవత్సరంలో  మిస్ చండీగడ్ 2017 (Miss Chandigarh 2017) ను మరియు 2018 వ సంవత్సరంలో  మిస్ మాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా 2018 ( Miss Max Emerging Star India 2018) టైటిల్ ను గెలుచుకున్నారు.

2019 వ సంవత్సరంలో  ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 ( Femina Miss India Punjab 2019) టైటిల్ ను గెలుచుకున్న తరవాత ఫెమినా మిస్ ఇండియా (Femina miss India) పోటీ లో పాల్గొన్నారు. ఈ పోటీలో గెలవక పోయిన 12 వ స్థానాన్ని దక్కించుకున్నారు.   

ఆగస్ట్ 2021 సంవత్సరంలో,  మిస్ దివా 2021 పోటీలో సంధు మొదటి 20 ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచారు.  

ఈ పోటీ లో ఆఖరి రౌండ్ లోకి చేరిన ఐదుగురికి ఒక్కొక్క అంశం పై మాట్లాడానికి అవకాశం ఇవవటం జరుగుతుంది. ఈ అంశాల యొక్క నిర్దారణ డ్రా పద్దతి ద్వారా చేయబడుతుంది. 

హర్నాజ్ సంధు కి  డ్రా లో  ” గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్ ” అనే అంశం వచ్చింది, ఈ విషయం పై మాట్లాడుతూ “మానవులే ప్రక్రుతి కి చాలా నష్టాన్ని చేకూర్చారని మన తప్పులను సరి చేయటానికి మనదగ్గర సమయం ఉంది. మనందరి దగ్గర ఉన్న ఏకైక సంపద ఈ భూమి, దీని పై నివసించే ఒక్కొక మనిషి తన వంతు కృషి చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చవచ్చు ” అని చెప్పటం జరిగింది.       

ఈ పోటీ లో హర్నాజ్ సంధు కిరీటాన్ని దక్కించుకున్నారు.  

మిస్ యూనివర్స్ 2021 :

డిసెంబర్ 12, 2021 వ సంవత్సరంలో ఇజ్రాయెల్ లోని ఈలాట్ నగరంలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. హర్నాజ్ సంధు 80 మంది పోటీదారులతో పోటీ చేసి మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 

దాదాపు 21 సంవత్సరాల తరవాత భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని మూడవ సారి తీసుక వచ్చిన మహిళ గా నిలిచారు.   

సంధు మిస్ యూనివర్స్ అవ్వటం వల్ల ఇకపై అమెరికా లోని న్యూయార్క్ నగరంలో నివసించి వివిధ సభ లలో పాల్గొంటారు.   

Source: Harnaaz Sandhu – Wikipedia

Leave a Comment