షిహాబ్ చొట్టూర్ 1993 వ సంవత్సరంలో ఇండియా, కేరళ రాష్ట్రం లోని వలంచరీ పట్టణంలోని చొట్టూర్ లో జన్మించారు. 2022 వ సంవత్సరం జులై నెలలో షిహాబ్ కేరళ నుంచి సౌదీ అరేబియా దేశానికి నడుచుకుంటూ హజ్ యాత్రను పూర్తి చేయటానికి ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
29 సంవత్సరాల వయస్సులో షిహాబ్ కేరళ నుంచి మక్కా 8,640 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేయబోతున్నాడు. ప్రతి రోజు 25 కిలోమీటర్లు నడుస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
షిహాబ్ ఇండియా నుంచి ప్రయాణం మొదలుపెట్టి పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ మరియు కువైత్ గుండా వెలుతూ సౌదీ అరేబియా కి 2023 వ సంవత్సరంలో చేరుకుంటాడు.
ఇండియా నుంచి సౌదీ అరేబియా నడుచుకుంటూ ప్రయాణం చేయడానికి 280 రోజులు పడుతుంది. చాలా సంవత్సరాల క్రితం సరైన సవారీలు లేకేపోవటం వల్ల చాలా మంది హజ్ యాత్ర కి నడుచు కుంటూ వెళ్లేవారు.
ఇలా నడుచుకుంటూ వెళ్లిన వారి కథల గురించి విన్న తరవాత షిహాబ్ ప్రేరణ పొంది తానూ కూడా నడుచుకుంటూ హజ్ యాత్రను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.
షిహాబ్ కుటుంబం కూడా ఈ ప్రయాణానికి సంతోషంతో మద్దతు తెలిపారు. ఈ ప్రయాణంలో షిహాబ్ తో పాటు తన ముగ్గురు స్నేహితులు కూడా తోడుగా బయలు దేరారు.
కర్ణాటక నుంచి మరో ఆరుగురి సభ్యుల బృందం కూడా షిహాబ్ తో ప్రయాణంలో తోడుగా బయలుదేరారు. నడుచుకుంటూ ప్రయాణం చేయటానికి పలు దేశాల సరిహద్దులు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. దేశాల యొక్క సరిహద్దులు దాటాలంటే వీసా యొక్క అవసరం పడుతుంది.
ప్రతి దేశం యొక్క వీసా యొక్క డాక్యూమెంట్స్ ను సంపాదించడానికి 9 నెలల వ్యవధి పట్టింది. షిహాబ్ ప్రయాణం చేస్తున్న దారి లో చాలా మంది పువ్వులు చల్లుతూ, స్వాగతం పలుకుతున్నారు.
ఇస్లాం మతంలో స్తొమత ఉన్న ముస్లింలు జీవిత కాలంలో ఒక్క సారి హాజ్ చేయాలి. కరోనా వైరస్ కారణంగా రెండు సంవత్సరాలు హజ్ యాత్ర చేయలేకపోయినా ముస్లింలకు తిరిగి హజ్ యాత్ర చేసే అవకాశం లభించింది (1).