ద్రౌపది ముర్ము జీవిత చరిత్ర – Droupadi Murmu biography in Telugu

ద్రౌపది ముర్ము 20 జూన్ 1958 వ సంవత్సరంలో జన్మించారు. 25 వ జులై 2022 వ సంవత్సరంలో భారత దేశం యొక్క 15 వ రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు. ప్రతిభ పాటిల్ తరవాత రెండవ మహిళా రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు. గిరిజన సంఘానికి చెందిన మహిళా రాష్ట్రపతి గా మొదటి సారిగా ఎన్నుకోబడ్డారు.

బాల్యం :

ద్రౌపది ముర్ము 20 వ జూన్ 1958 వ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో రైరంగాపూర్ సిటీ లో ఉపరబేద అనే గ్రామంలో సంతలి కుటుంబంలో జన్మించారు.

ద్రౌపది గారి యొక్క తండ్రి బిరంచి నారాయణ్ తుడు వృత్తిపరంగా ఒక రైతు. ద్రౌపది గారి యొక్క తండ్రి మరియు తాత గారు గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ గా కూడా ఉన్నారు. చిన్న తనంలో ద్రౌపది గారి పేరు పుతి తూడు అని పెట్టడం జరిగింది కానీ స్కూల్ లో తన టీచర్ తన పేరు ను ద్రౌపది గా మార్చారు.

ముర్ము గారి ప్రాథమిక విద్య ఉపరబేద ప్రైమరీ స్కూల్ నుంచి పూర్తి చేసారు. కేవలం 5 సంవత్సరాల వయస్సులో పై చదువుల కోసం భుబనేశ్వర్ నగరానికి వెళ్లారు మరియు రమా దేవి మహిళా కళాశాల నుంచి B.A లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.

కెరీర్ :

కేవలం 21 వ సంవత్సరాల వయస్సులో 1979 నుంచి 1983 వరకు ఒరిస్సా ప్రభుత్వం లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగాన్ని ప్రారంభించారు.

1994 నుంచి 1997 వరకు రైరంగపూర్ లోని శ్రీ ఆరోబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో టీచర్ గా పనిచేసారు. ఇక్కడ పనిచేస్తున్న సమయంలో హిందీ, జియోగ్రఫీ, మాథ్స్ మరియు ఒడియా లో పాఠాలు చెప్పేవారు. టీచర్ గా పనిచేస్తున్న సమయంలో ముర్ము జీతం తీసుకోకుండానే పని చేసేవారు.

1997 సంవత్సరంలో రాయరంగపూర్ నగర్ పంచాయితీ లో ఇండిపెండెంట్ కాండిడేట్ గా పోటీ చేసి మహిళలకు రిజర్వు చేసిన సీట్ ద్వారా కౌన్సిలర్ గా ఎన్నుకోబడ్డారు. కౌన్సిలర్ గా పనిచేస్తున్న సమయంలో ముర్ము గారు స్వయంగా వెళ్లి పారిశుధ్య కార్యక్రమాలను చూసేవారు. కౌన్సిలర్ గా ద్రౌపది ముర్ము గారు ఎన్నుకోబడ్డ తరవాత BJP పార్టీ లో చేరారు.

ఒరిస్సా లో 2000 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో మొట్ట మొదటి సారి పోటీ చేసి వరుసగా రెండుసార్లు MLA గా గెలిచారు. బీజేపీ మరియు బీజేడీ పార్టీ ల మధ్య జరిగిన కూటమి సమయంలో 2000 సంవత్సరం నుంచి 20002 వ సంవత్సరం వరకు వాణిజ్యం మరియు రవాణా మంత్రిగా ఎన్నుకోబడ్డారు. 2002 వ సంవత్సరం నుంచి 2004 వ సంవత్సరం వరకు ఫిషరీస్ మరియు జంతు వనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా ఎన్నుకోబడ్డారు.

2009 వ సంవత్సరంలో బీజేపీ మరియు బీజేడీ కూటమి ముగిసిన కారణంగా ముర్ము గారు ఎన్నికలలో ఓడిపోయారు. 2013 వ సంవత్సరంలో ముర్ము ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నుకొన్నారు తరవాత జిల్లా అధ్యక్షరాలిగా 2015 వ సంవత్సరం వరకు పనిచేసారు.

2015 వ సంవత్సరంలో జార్ఖండ్ యొక్క మొట్ట మొదటి మహిళా గవర్నర్ గా ఎన్నుకోబడ్డారు. జార్ఖండ్ లో గవర్నర్ గా ఉన్న సమయంలో గిరిజన సంఘాలకు చెందిన రెండు చట్టాలను మార్పులు చేయడానికి అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.

ముందు ఉన్న చట్టం ప్రకారం గిరిజనులు తమ భూమిని కేవలం గిరిజనులకే అమ్మాలి కానీ కొత్త చట్టం ప్రకారం గిరిజనులు తమ భూమిని ప్రభుత్వానికి లేదా ఇతరులకు కూడా విక్రయించవచ్చు. ఈ బిల్లు ను ఆమోదించడానికి ముర్ము వద్దకి తీసుకువెళ్లడం జరిగింది. ముర్ము ఒక గిరిజన సంఘానికి చెందిన వారు కావటం వల్ల ప్రజల వైపు తన ఆమోదం తెలుపుతారని గిరిజన సంఘం వారు అనుకున్నారు కానీ ముర్ము మాత్రం పోలీసులు చెప్పిన విధంగా వినమని గిరిజన ప్రజలకు సలహా ఇచ్చారు.

పోలీసులకు మరియు గిరిజన సంఘానికి మధ్య జరిగిన ఘర్షణలో ఒక గిరిజన సంఘానికి చెందిన వ్యక్తి మరణించటం కూడా జరిగింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకత తెలపటం వల్ల ముర్ము గారు ఈ బిల్లు కు ఆమోదం తెలపలేదు.

రాష్ట్రపతి :

2022 వ సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ను నామినేట్ చేయటం జరిగింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హా ను రాష్ట్రపతి కాండిడేట్ గా నామినేట్L చేసారు.

ఎన్నికలకు ముందు ద్రౌపది ముర్ము గారు పలు రాజకీయ పార్టీల పెద్దలతో కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. శివ సేన, బహుజన్ సమాజ్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, బిజూ జనతా దళ్, జంట దళ్ మరియు YSRCP పార్టీలు ఎన్నికలకు ముందే ద్రౌపది ముర్ము గారికి మద్దతు తెలిపారు.

21 వ జులై 2022 వ సంవత్సరంలో 676,803 ల ఓట్లు గెలిచి యశ్వంత్ సిన్హా ను ఓడించి రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు.

వ్యక్తిగత జీవితం :

1980 వ సంవత్సరంలో బ్యాంకు ఉద్యోగి అయిన శ్యామ్ చరణ్ ముర్ము ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు.

2009 నుంచి 2015 వ సంవత్సరం మధ్యలో ద్రౌపది ముర్ము యొక్క భర్త, కొడుకు మరియు తల్లి అనుకోని కారణాల వల్ల మరణించారు.

కుటుంబ సభ్యులు మరణించిన తరవాత ద్రౌపది ముర్ము డిప్రెషన్ లోకి వెళ్లారు. కానీ తన జీవితం లో వచ్చిన వడి దుడుకులను బలంగా ఎదుర్కొన్నారు.

ద్రౌపది ముర్ము బీజేపీ యొక్క సిద్ధాంతాలను గట్టిగా నమ్ముతారు. హిందీ భాషను జాతీయ భాషగా, హిందుత్వ సిద్ధాంతాన్ని మరియు గో మూత్రం ద్వారా కలిగే లాభాలను కూడా అంగీకరిస్తారు. BJP ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాన్ని కూడా అంగీకరిస్తారు.

ముర్ము గారు దేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు ను మరియు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహాత్మా గాంధీ ను మరియు డాక్టర్ B. R అంబేద్కర్ ను ప్రశంసిస్తారు (1).

Source: Droupadi Murmu – Wikipedia

Leave a Comment