నిఖత్ జరీన్ జీవిత చరిత్ర – Nikhat Zareen biography in Telugu

నిఖత్ జరీన్ ఇండియా కు చెందిన ఒక బాక్సర్. ఒక దాని తరవాత మరొక అవార్డు గెలుస్తూ అమ్మాయిలు కూడా బాక్సింగ్ లో ఏ మాత్రం తీసి పోలేరు అని రుజువు చేసింది.

జరీన్ 1996 వ సంవత్సరం 14 వ జూన్ న తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మొహమ్మద్ జమీల్ అహ్మద్ మరియు పర్వీన్ సుల్తానా అనే దంపతులకు జన్మించారు.

నిఖత్ తన స్కూల్ చదువును నిజామాబాద్ లోని నిర్మల హృదయ గర్ల్స్ హై స్కూల్ నుంచి పూర్తి చేసారు. B.A డిగ్రీ చదువును హైదరాబాద్ లోని AV కాలేజీ నుంచి చదువుతున్నారు.

కెరీర్ :

జరీన్ కి బాక్సింగ్ ను మొట్ట మొదటిసారిగా పరిచయం చేసింది వారి తండ్రి మొహమ్మద్ జమీల్ అహ్మద్. తన తండ్రి వద్దే ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నారు.

నిఖత్ విశాఖపట్నం లోని స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా లో చేరి తన ట్రైనింగ్ ను మొదలుపెట్టారు. కొద్దీ కాలంలోనే బెస్ట్ బాక్సర్ గా పేరు తెచ్చుకున్నారు.

నిఖత్ జరీన్ గెలిచిన అవార్డులు :

2011 వ సంవత్సరంలో తుర్కీ లో జరిగిన AIBA ఉమెన్స్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తుర్కీ కు చెందిన బాక్సర్ ను ఓడించి గోల్డ్ మెడల్ గెలిచారు.

2014 వ సంవత్సరంలో బల్గేరియా లో జరిగిన యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ ను గెలిచారు.

2014 వ సంవత్సరంలోనే సెర్బియా లో జరిగిన నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు.

2015 వ సంవత్సరంలో అస్సాం లో జరిగిన సీనియర్ విమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో కూడా బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు.

2019 వ సంవత్సరంలో బ్యాంకాక్ జరిగిన థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో సిల్వర్ మెడల్ ను సంపాదించారు.

2019 సంవత్సరంలోనే బల్గేరియా లో జరిగిన స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో బంగారు పతాకం గెలిచారు.

2022 లో జరిగిన స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో నిఖత్ జరీన్ మరొక సారి మొదటి స్థానంలో నిలిచారు.

2022 వ సంవత్సరంలోనే ఇస్తాంబుల్ లో జరిగిన IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ లో గెలిచి గోల్డ్ మెడల్ ను గెలిచారు.

2022 వ సంవత్సరంలో బర్మింగ్‌హామ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ను సంపాదించారు.

Source: Nikhat Zareen – Wikipedia

Leave a Comment