సరోజినీ నాయుడు జీవిత చరిత్ర – Sarojini naidu biography in Telugu

సరోజినీ నాయుడు భారతదేశానికి చెందిన ఒక గొప్ప రాజకీయ కార్యకర్త మరియు ఒక కవయిత్రి. సరోజినీ నాయుడు గారు స్వాతంత్ర పోరాటం లో ముఖ్యమైన పాత్రను పోషించారు. మహాత్మా గాంధీజీ గారు సరోజినీ నాయుడు ను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఇచ్చారు.

బాల్యం :

సరోజినీ నాయుడు 13 ఫిబ్రవరి 1879 వ సంవత్సరంలో హైదరాబాద్ లోని అఘోరేనాథ్ ఛటోపాధ్యాయ మరియు వరద సుందరి దేవి అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు మొత్తం ఎనిమిది మంది పిల్లలు, వీరిలో సరోజినీ నాయుడు గారు అందరికంటే పెద్దవారు. నాయుడు గారి తల్లి తండ్రులు బాంగ్లాదేశ్ కి చెందిన వారు.

నాయుడు గారి తండ్రి బెంగాల్ కు చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. స్కాట్లాండ్ లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం లో డాక్టరేట్ ను పూర్తిచేసుకొని నిజాం కాలేజీ లో ప్రిన్సిపాల్ గా పనిచేసేవారు. నాయుడు గారి తల్లి ఒక కవయిత్రి బెంగాలీ భాషలో కవిత్వాలు రాసేవారు.

సరోజినీ నాయుడు గారి యొక్క సోదరుడు వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ కూడా స్వాతంత్ర పోరాటంలో చాలా కృషి చేసారు.

చదువు :

12 సంవత్సరాల వయస్సులో సరోజినీ నాయుడు గారు మెట్రిక్యులేషన్ పరీక్ష లో మంచి ర్యాంక్ సంపాదించారు. హైదరాబాద్ నిజాం నుంచి స్కాలర్ షిప్ లభించిన తరవాత ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో కింగ్స్ కాలేజీ మరియు కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో తన చదువును పూర్తి చేసుకున్నారు.

రాజకీయ జీవితం :

సరోజినీ నాయుడు గారు కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఒక మంచి వక్త గా పేరు సంపాదించారు. స్వాతంత్ర పోరాటం కోసం, మహిళా హక్కులు మరియు మహిళల హక్కుల కోసం తరచుగా మాట్లాడేవారు. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవటంలో కూడా సరోజినీ నాయుడు గారు ముందు ఉండేవారు. 1911 వ సంవత్సరంలో నాయుడు గారు చేసిన సామజిక సేవకు గాను కైసరే హింద్ మెడల్ సంపాదించారు.

1909 సంవత్సరంలో ముత్తులక్ష్మి రెడ్డి అనే సంఘ సంస్కర్త తో పరిచయం ఏర్పడింది. రెడ్డి గారి తో కలిసి 1917 వ సంవత్సరంలో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ను ప్రారంభించారు. 1914 వ సంవత్సరంలో సరోజినీ నాయుడు గారు మహాత్మా గాంధీని కలుసుకున్నారు.

నాయుడు గారు తన సహోద్యోగి అయిన అన్నీ బిసెంట్ తో కలిసి జాతి, మత మరియు డబ్బు భేదాలు లేకుండా ఓటు హక్కు అందరికి ఉండాలని పోరాటం చేశారు.

నాయుడు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండవ మహిళ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నుకోబడ్డారు. సరోజినీ నాయుడు గారు ప్రముఖ స్వాతంత్ర పోరాట సమర యోధులైన గాంధీజీ, గోపాల్ కృష్ణ గోఖ్లే, రాబిన్ద్ర నాథ్ టాగోర్, సరళా దేవి తో కలిసి పనిచేసారు.

1917 వ సంవత్సరంలో గాంధీజీ గారు చేస్తున్న సత్యాగ్రహం లో కూడా పాల్గొన్నారు. నాయుడు గారు ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమం లో కూడా పాల్గొన్నారు. 1925 వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్ట మొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు.

1927 వ సంవత్సరంలో అఖిల భారత మహిళా సదస్సు ను సరోజినీ నాయుడు గారు ప్రారంభించారు. 1930 సంవత్సరంలో గాంధీజి గారు చేస్తున్న ఉప్పు సత్యాగ్రహం లో మహిళలు పాల్గొన వద్దని చెప్పారు. మహిళలు పాల్గొని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిరాకరించారు.

నాయుడు గారు మాత్రం తనతో పాటు ఇతర మహిళా ఉద్యమ కారులతో కలిసి ఉద్యమం లో పాల్గొన్నారు. గాంధీజీ గారు అరెస్ట్ అయిన తరవాత సరోజినీ నాయుడు ను ఉద్యమం యొక్క నాయకురాలిగా నియమించారు. భారతదేశానికి మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనక పోయిన రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సరోజినీ నాయుడు గారు మరియు ఇతర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

భారతదేశానికి స్వాతంత్రం లభించిన తరవాత ఉత్తరప్రేదేశ్ గవర్నర్ గా ఎన్నుకోబడ్డారు. సరోజినీ నాయుడు గారు భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరవాత ఎన్నుకోబడ్డ మొట్ట మొదటి మహిళా గవర్నర్.

కవయిత్రి :

నాయుడు గారు కేవలం 12 సంవత్సరాల వయస్సు నుంచే రాయటం మొదలుపెట్టారు. 1905 వ సంవత్సరంలో ద గోల్డెన్ త్రెషోల్డ్ (Teh Gloden Threshold), 1912 వ సంవత్సరంలో Teh Bird of Time: Songs of Life, Death & teh Spring, 1917 వ సంవత్సరంలో Teh Broken Wing మరియు Teh Song of teh Palanquin Bearers లాంటి పుస్తకాలను రాసారు.

నాయుడు గారు కవితలకు గాను “నైటింగేల్ అఫ్ ఇండియా” అనే బిరుదును కూడా ఇవ్వటం జరిగింది. మహిళల హక్కు కోసం చేసిన కృషి కి గాను సరోజినీ నాయుడు గారు పుట్టిన తేదీ అయిన 13 ఫిబ్రవరి ను మహిళా దినోత్సవం గా జరుపుకుంటారు.

మరణం:

15 ఫిబ్రవరి రోజున ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరవాత డాక్టర్లు తనను రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు. నాయుడు తన అధికారిక మీటింగ్ లను రద్దు చేసారు.

క్రమంగా నాయుడు ఆరోగ్యం క్షీణించ సాగింది. మార్చి 1 వ తారీఖున తీవ్రమైన తలనొప్పి తో బాధపడ్డారు. దగ్గుతూ నాయుడు కుప్ప కూలిపోయారు. తన బాగోగులను చూస్తున్న నర్సుతో తనతో కలిసి పాట పాడమని కోరి ఆ పాటను వింటూ నిద్ర పోయారు.

2 మార్చి 1949 వ సంవత్సరంలో గుండెపోటు కారణంగా లక్నో లోని ప్రభుత్వ భవనం లో మరణించారు.

నాయుడు అంత్య క్రియలు గోమతి నది వద్ద జరిగాయి.

Source: Sarojini Naidu – Wikipedia

Leave a Comment