రాకేష్ ఝున్‌జున్‌వాలా జీవిత చరిత్ర – Rakesh Jhunjhunwala biography in Telugu

రాకేష్ ఝున్‌జున్‌వాలా ఇండియా కు చెందిన స్టాక్ ట్రేడర్ మరియు ఇన్వెస్టర్ మరియు ఒక బిలియనీర్. ఝున్‌జున్‌వాలా భారతదేశానికి చెందిన 36 వ ధనవంతుడు. ఇతని ఆస్తి విలువ $5.5 బిలియన్ డాలర్లు. 2022 వ సంవత్సరంలో తక్కువ ధర కలిగిన విమాన సంస్థ అయిన Akasa Air ను స్థాపించాడు.

రాకేష్ ఝున్‌జున్‌వాలా 1960 వ సంవత్సరం జులై 5 వ తారీఖున జన్మించారు. ఝున్‌జున్‌వాలా యొక్క పూర్వికులు రాజస్థాన్ కి చెందిన ఝుంఝును కు చెందిన వారు అందుకే తన పేరు లో ఝున్‌జున్‌వాలా అని పెట్టుకున్నారు.

ఝున్‌జున్‌వాలా యొక్క తండ్రి ముంబైలో ఇన్కమ్ టాక్స్ కమీషనర్ గా ఉండటం వల్ల అక్కడే రాజస్థాన్ ఫ్యామిలీ లో పెరిగారు. సిడెన్‌హామ్ కాలేజీ లో తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు. తరవాత Institute of Chartered Accountants of india లో చార్టెడ్ అకౌంట్స్ కోర్స్ ను పూర్తి చేసారు.

కెరీర్ :

తన తండ్రి స్నేహితులతో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు విని మార్కెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు. ఝున్‌జున్‌వాలా ఆసక్తి చుసిన తండ్రి తనకు మార్కెట్ గురించి వివరించేవాడు. తన తండ్రి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయటానికి ఎలాంటి డబ్బు సహాయం చేయలేదు. స్నేహితులను కూడా డబ్బు అడిగి తీసుకోవద్దని చెప్పటంతో తాను జమ చేసుకున్న డబ్బులనే కాలేజీ లో చదువుతున్న సమయంలో 1985 సంవత్సరంలో 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టాడు.

ఝున్‌జున్‌వాలా యొక్క స్టాక్ మార్కెట్ లో ఉన్న చాతుర్యాన్నిమరియు అంచనాలను చూసి బిగ్ బుల్ అఫ్ ఇండియా మరియు కింగ్ అఫ్ బుల్ మార్కెట్ అని అంటారు. ఝున్‌జున్‌వాలా 1986 సంవత్సరం నుంచి 1989 మధ్యలో 20 నుంచి 25 లక్షల భారీ లాభాన్ని అర్జించారు.

ఝున్‌జున్‌వాలా ఎక్కువగా టైటాన్ కంపెనీ లో ఇన్వెస్ట్ చేసారు. దాదాపు 7200 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ టైటాన్ కంపెనీ లో చేసారు. కంపెనీ లో ఇన్వెస్ట్ చేయటం తో పాటు ఆకాశ ఎయిర్ అనే కంపెనీ ను మాజీ జెట్ ఎయిర్వేస్ CEO వినయ్ దూబే తో కలిసి ప్రారంభించారు.

రాకేష్ ఝున్‌జున్‌వాలా కంపెనీలలో ఇన్వెస్ట్ చేయటం తో పాటు కొన్ని కోట్ల విలువ గల ఆస్తులు కూడా ఉన్నాయి.

వ్యక్తిగత జీవితం :

రాకేష్ ఝున్‌జున్‌వాలా 22 ఫిబ్రవరి 1987 సంవత్సరంలో రేఖ ఝున్‌జున్‌వాలా ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు నిష్ఠా 2004 వ సంవత్సరంలో మరియు కొడుకులు ఆర్యమన్, ఆర్యవీర్ 2009 వ సంవత్సరంలో జన్మించారు.

జులై 2021 వ సంవత్సరంలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసారని ఆరోపణలు రావటం వల్ల ఇన్వెస్టిగేషన్ కూడా చేయటం జరిగింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 18.5 కోట్లు ఖర్చు చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ను సెటిల్ చేసారు.

Source: Rakesh Jhunjhunwala – Wikipedia

Leave a Comment