లాలా లజపతిరాయ్ జీవిత చరిత్ర – Lala Lajpat Rai biography in Telugu

లాలా లజపతిరాయ్ భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు రచయిత. 

స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించునందుకు గాను ఈయనను పంజాబ్ కేసరి అని బిరుదు తో పిలిచేవారు. అలాగే పంజాబ్ ద షేర్ (పంజాబ్ యొక్క సింహం) అని కూడా పిలుస్తారు. 

బాల్యం: 

లాలా లజపతిరాయ్ 28 జనవరి 1865 సంవత్సరంలో పంజాబ్, ఫరీద్‌కోట్ జిల్లా, ధుడికే  గ్రామంలో మున్షీ రాధా కృష్ణ మరియు గులాబ్ దేవి అగర్వాల్ అనే దంపతులకు జన్మించారు. 

రాయి తండ్రి ఉర్దూ మరియు పర్షియన్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. 

1870 సంవత్సరాల చివరిలో రాయి తండ్రి హర్యానా లోని రెవారీ నగరానికి బదిలీ చేయబడ్డారు. తన స్కూల్ చదువును అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాల నుంచి పూర్తి చేసారు. అదే స్కూల్ లో తండ్రి ఉర్దూ టీచర్ గా పనిచేసేవారు. 

1880 లో లాల లజపతిరాయ్  లా(Law) చదవటానికి లాహోర్‌లోని ప్రభుత్వ కాలేజీ లో చేరారు. కాలేజీ లో చదువుతున్న సమయంలో లాలా హన్స్ రాజ్ మరియు పండిట్ గురుదత్ లాంటి దేశ భక్తులు మరియు స్వాతంత్ర సమర యోధులను కలుసుకుంటారు. 

లాహోర్ లో చదువుతున్న సమయంలో స్వామి దయానంద్ సరస్వతి యొక్క హిందూ సంస్కరణవాద ఉద్యమం ద్వారా ప్రభావితులయ్యారు. 

కెరీర్: 

1884లో రాయి తండ్రి హర్యానా లోని రోహ్తక్ నగరానికి బదిలీ చేయబడ్డారు. లాహోర్ లో చదువు పూర్తి చేసుకున్న తరవాత రాయి కూడా తండ్రి తో పాటు చేరారు. 

1886 లో రాయి తండ్రి హర్యానాలోని హిసార్ కి బదిలీ చేయబడ్డారు. రాయి కూడా అక్కడే లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. బాబు చురామణితో కలిసి హిసార్ బార్ కౌన్సిల్ స్థాపనలో సభ్యుడు అయ్యారు. 

అదే సంవత్సరం తాయల్ సోదరులు అయిన చందులాల్ తాయల్, హరి లాల్ తాయల్ మరియు బాల్మోకంద్ తాయల్ మరియు ఇతరులతో కలిసి హిసార్ జిల్లాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క శాఖను మరియు ఆర్య సమాజ్ ను స్థాపించారు. 

1888 మరియు 1889 లో అలహాబాద్ లో జరిగిన వార్షిక సమావేశానికి  హిసార్ నుంచి హాజరైన నలుగురు ప్రతినిధులలో లాల లజపత్ రాయి ఒకరు. 

1892 లో రాయి లాహోర్ హై కోర్ట్ లో ప్రాక్టీస్ చేయటానికి లాహోర్ వెళ్లారు. అక్కడే జర్నలిజం ను కూడా చేయటం మొదలుపెట్టారు.ది ట్రిబ్యూన్ మరియు ఇతర వార్త పత్రికలలో రాసేవారు.   

1886 లో లాహోర్ లోజాతీయ వాద దయానంద ఆంగ్లో-వేద పాఠశాల ( Dayananda Anglo-Vedic School) ను ప్రారంభించటంలో భారతీయ విద్యావేత్త అయిన మహాత్మ హన్స్ రాజ్ కు సహాయం చేసారు. 

1914 లో తన లా ప్రాక్టీస్ ను వదిలేసి స్వాతంత్ర ఉద్యమానికి అవ్వటానికి బ్రిటన్ మరియు 1917 లో అమెరికా వెళ్లారు. 

అక్టోబర్ 1917లో న్యూయార్క్ లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించారు. 1917 నుంచి 1920 వరకు రాయి అమెరికా లోనే ఉన్నారు.  

రాయి యొక్కప్రారంభ స్వాతంత్ర పోరాటం  ఆర్య సమాజ్ మరియు మతం ద్వారా ప్రభావితం అయ్యింది. 

రాయకీయ జీవితం:  

1920 వ సంవత్సరంలో కలకత్తా లో జరిగిన ప్రత్యేక సమావేశంలో  ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు.  

1921 వ సంవత్సరంలో లాహోర్ లో పీపుల్ సొసైటీ సేవకులు (Servants of the People Society) అనే స్వచ్ఛంద సంక్షేమ సంస్థ ను ప్రారంభించారు. 

స్వాతంత్రం తరవాత ఈ సంస్థ ఢిల్లీ కి మార్చబడింది మరియు ఈ సంస్థ యొక్క శాఖలు భారతదేశం అంతటా ఉన్నాయి.   

లాలా లజపతిరాయ్ 1917 లో అమెరికా వెళ్ళి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తిరిగి వచ్చారు. 

అమెరికా లో ఉన్నప్పుడు పశ్చిమ  తీరం వెంబడి ఉన్న సిక్కు సంఘాలను మరియు అలబామా లోని టుస్కేగీ విశ్వవిద్యాలయాన్ని కూడా సందర్శించారు. 

అక్కడ ప్రయాణించిన వివరాల గురించి The United States of America: A Hindu’s Impressions and a Study అనే పుస్తకాన్ని కూడా రాసారు. 

అమెరికా లో నెలవారీ జర్నల్ the Young India and Hindustan Information Services Association ను కూడా మొదలుపెట్టారు. 

1917 అక్టోబర్ నెలలో లో  32 పేజీల పిటిషన్ ను విదేశీ వ్యవహారాలపై యునైటెడ్ స్టేట్స్ హౌస్ కమిటీ (United States House Committee on Foreign Affairs) కి సమర్పించారు. 

ఈపెటిషన ను కేవలం ఒక్క దారి వ్యవధిలో తయారు చేసారు. ఈ పిటీషన్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ దుష్పరిపాలన మరియు భారత దేశం స్వాతంత్రం సాధించటంలో అంతర్జాతీయ సమాజం యొక్క మద్దతు కోరింది.        

రాయి అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తరవాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.  1921 నుంచి 1923 వరకు జైలు శిక్ష ను అనుభవించారు. జైలు నుంచి విడుదల అయిన తరవాత శాసన సభ కు ఎన్నుకోబడ్డారు.  

1928 లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో రాజకీయ పరిస్తుతులను తెలుసుకోవడానికి సర్ జాన్ సైమన్ నేతృత్వంలో సైమన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. 

ఈ కమిషన్ లో భారతదేశం నుండి సభ్యులను ఉంచలేదని  భారత దేశ రాజకీయ పార్టీలు సైమన్ కమిషన్ ను బహిష్కరించాయి. దేశమంతటా నిరసనలు కూడామొదలు అయ్యాయి. 

30 అక్టోబర్ 1928 వ సంవత్సరంలో ఈ కమిషన్ లాహోర్ కి వచ్చినప్పుడు లజపత్ రాయి అహింసా మార్గాన్ని ఎంచుకొని  “Simon Go Back!” అనే నినాదంతో నిరసనలు చేసారు.

లజపత్ రాయి తో పాటు నిరసనకారులు నల్ల జెండాలతో మరియు నినాదాలతో నీరసం వ్యక్తం చేసారు. 

లాహోర్  పోలీస్ సూపరింటెండెంట్ James A. Scott (జేమ్స్ ఎ. స్కాట్) పోలీసులకు లాఠీ ఛార్జ్ చేయమని ఆర్డర్ చేసాడు మరియు రాయి ను వ్యక్తిగతంగా దాడి చేసాడు. 

లాఠీచార్జి వల్ల తీవ్రంగా గాయ పడిన రాయి అక్కడున్న నిరసనకారులను సంబోధిస్తూ ” “ఈరోజు న వంటి పై పడ్డ దెబ్బలు భారతదేశంలోని బ్రిటిష్ పాలన యొక్క శవపేటికకు చివరి మేకులు అవుతాయని నేను ప్రకటిస్తున్నాను (“I declare that the blows struck at me today will be the last nails in the coffin of British rule in India”)” అని చెప్పారు.   

మరణం: 

లాఠీచార్జి వల్ల తీవ్రంగా గాయ పడిన రాయి కోలుకోలేకపోయారు. ఫలితంగా 17 నవంబర్ 1928 వ సంవత్సరంలో మరణించారు. 

డాక్టర్లు కూడా జేమ్స్ స్కాట్ దెబ్బలకే రాయి తీవ్రంగా గాయపడి చనిపోయారని భావించారు.

ఈ విషయాన్ని బ్రిటిష్ పార్లమెంట్ వాడికి తీసుకెళ్లినప్పుడు రాయి మరణంలో తమ పాత్ర ఎలాంటిది లేదని బ్రిటిష్ ప్రభుత్వం  తిరస్కరించారు. 

ఈ ఘటన చూసిన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ విప్లవ కారుడు భగత్ సింగ్ రాయి చావు యొక్క చావుపై ప్రతీకారం తీర్చుకుంటానని శాపతం చేసాడు. 

భగత్ సింగ్ ఇతర విప్లవకారులతో కలిసి జేమ్స్ స్కాట్ ను చంపి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక సందేశం పంపాలని అనుకున్నారు. 

ప్లాన్ ప్రకారం జేమ్స్ స్కాట్ ను చంపడానికి భగత్ సింగ్ మరియు తన ఇతర విప్లవ కారులు వెళతారు. 

కానీ జేమ్స్ స్కాట్ ను గుర్తించటంలో తప్పిదం జరుగుతుంది. భగత్ సింగ్  అసిస్టెంట్ సూపరింటెండెంట్ జాన్ పి. సాండర్స్ (John P. Saunders) ను జేమ్స్ స్కేట్ గా అనుకొని తప్పుగా గుర్తించి సింగ్ తన సహచరుడుకి సిగ్నల్ చేస్తారు.    

1928 సంవత్సరం 17 డిసెంబర్ రోజున లాహోర్ లోని డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికి వస్తున్న జాన్ పి. సాండర్స్ పై  సింగ్ మరియు తన సహచరుడు రాజగురు కాల్పులు జరువుతారు. 

కాల్పుల తరవాత అక్కడినుంచి ఫరారు అవుతున్న భగత్ సింగ్ మరియు తన అనుచరులను పట్టుకోవటానికి హెడ్ కానిస్టేబుల్ చనన్  సింగ్ వెంబడిస్తారు. 

చనన్ సింగ్ పై భగత్ సింగ్ సహచరుడు చంద్ర శేఖర్ ఆజాద్ కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడుతాడు.  

Source: Lala Lajpat Rai – Wikipedia        

Leave a Comment