కాళోజీ నారాయణ రావు జీవిత చరిత్ర – Kaloji Narayana Rao biography in Telugu

కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఈయనను కాళోజి లేదా కాళన్న గా కూడా పిలవటం జరుగుతుంది.

తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిక్కచ్చిగా పోరాడిన మహా వ్యక్తి కాళోజీ. ప్రజల సమస్యలను తన సమస్యగా మరియు ప్రజల గొడవ ను తన గొడవగా తీసుకొని “నా గొడవ” పేరుతో అద్భుతమైన రచనలు కాళోజీ కలం నుంచి జాలువారాయి.

తన జీవితాంతం తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసిన మహనీయుడు. తన భావాలను తెలంగాణ యాసలో సులువుగా అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పేవారు.

తెలంగాణ భాష యొక్క అణచివేతకి వ్యతిరేకంగా గళం మరియు కలం ఎత్తినవారు కాళోజీ అని గర్వంగా ప్రజలు తనని కొనియాడుతారు.

నిజాం రాజు యొక్క అరాచక పాలనకు వ్యతిరేకంగా ఏ మాత్రం సంకోచించకుండా పోరాడారు.

కాళోజీ తెలంగాణ ఉద్యమాలతో పాటు స్వాతంత్ర ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవం గా ప్రకటించింది.

కాళోజీ పేరు మీద వరంగల్ లో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి KALOJI NARAYANA RAO UNIVERSITY OF HEALTH SCIENCES అనే పేరు పెట్టడం జరిగింది.

అలాగే వరంగల్ లోని హన్మకొండ లో కాళోజీ కళాక్షేత్రం అనే కళా ప్రాంగణం కూడా నిర్మించబోతున్నారు.

బాల్యం :

కాళోజీ 1914 వ సంవత్సరం కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు.

కాళోజి తల్లి రమాబాయమ్మ కర్ణాటక కు చెందిన వారు మరియు తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్ర కు చెందినవారు.

కాళోజీ పుట్టింది కర్ణాటకే అయినా కన్నడ, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలు కూడా చాలా బాగా వచ్చేవి. ఈ బాషలలో రచయితగా రచనలను కూడా రాసారు.

బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాలోని మడికొండలో వచ్చి స్థిరపడ్డారు. ప్రజల యొక్క సమస్యలను తన గేయాల రూపంలో వర్ణించేవారు.

చదువు :

ప్రాతమిక విద్యను మడికొండలో పూర్తిచేసుకొని హైదరాబాద్ లోని చౌమహల్ పాఠశాలలో, సిటీ కాలేజి లో, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాలలో చదివి తన కాలేజీ చదువును పూర్తి చేసారు.

కాలేజీ చదువు తరవాత 1939 సంవత్సరంలో న్యాయ కళాశాలలో చదువును పూర్తి చేసుకొని న్యాయ శాస్త్రంలో డిగ్రీ సంపాదించారు.

చదువు యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన కాళోజీ ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ ఉంటే ఎంతో బాగుంటుందని కోరుకునేవారు.

సత్యాగ్రహోద్యమంలో పాల్గొని కేవలం 25 సంవత్సరాల వయస్సులో జైలు కి వెళ్లి వచ్చారు.

ఈ కాలంలో మనం చూసే పొలిటికల్ సెటైరికల్ పోయెట్రీ (వ్యంగ్య కవిత్వం) ను ఆ రోజుల్లోనే చేసేవారు.

కాళోజీ తన రచనలను ఎవరికీ జంకకుండా, నిర్మొహమాటంగా, సూటిగా చెప్పే వ్యక్తి.

కాళోజీ రాసిన “నా గొడవ” సామజిక సమస్యలపై అధికారులకు, పాలకులకు సవాల్ చేసాయి. ఇలాంటి రచనల ద్వారా కాళోజీ ప్రజల మన్ననను పొందారు.

ఉద్యమ జీవితం :

బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.

నిజాం ప్రభుత్వం నుంచి గణపతి ఉత్సవాలపై నిషేధం ఉన్నా, ఆజ్ఞలను ఉల్లంఘించి గణపతి ఉత్సవాలు జరిపారు.

తెలంగాణ ప్రజలలో చదువు యొక్క ప్రాముఖ్యతను వ్యాపింపచేయటానికి ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖులలో ఒకరు.

రజాకార్ల యొక్క దౌర్జన్యానికి వ్యతిరేకంగా మహాసభలు చేసినప్పుడు ప్రజలు తన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు.

స్వరాజ్య సమరంలో ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురయినప్పుడు వారిని నాగపూర్ యూనివర్సిటీ లో చేర్పించి ఆదుకున్నారు.

అవార్డులు :

1972 వ సంవత్సరంలో తామ్రపత్ర పురస్కారం లభించింది.

1992 వ సంవత్సరంలో భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ ను పొందారు.

1992 సంవత్సరం లోనే వరంగల్ కు చెందిన కాకతీయ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రధానం చేసారు.

మరణం :

కాళోజీ నవంబర్ 13, 2002 వ సంవత్సరంలో తెలంగాణ లోని వరంగల్ జిల్లాలో తుదిశ్వాస విడిచారు.

Source: కాళోజీ నారాయణరావు – వికీపీడియా (wikipedia.org)

Leave a Comment